ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Saturday, November 29

ప్రేమ శాతం-ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...



ప్రేమ శాతం:serial part 2
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అసలు ఒక మనిషి పుట్టినపుడు అతని లో ప్రేమ శాతం ఎంతుంటుంది...

అతను పెరిగి పెద్ద వాడయిన కొలది అది త్రగ్గుతుందా?లేక పెరుగు తుందా?

పెరిగితే నష్టం లేదు...తగ్గితేనే ప్రమాదం...అంటుందీ సమాజం...

కాని మరి సమాజం లో ఉన్న చాలా మంది ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ద్వేషమే ...ప్రేమ శాతాన్ని

డామినేట్ చేస్తుంది..

అందరికీ తెలుసు ప్రేమ శాతాన్ని పెంచుకొంటే బాగుంటుందని...అందరు ప్రేమే సత్యం ప్రేమే నిత్యం అంటారు....

అయినా ప్రేమించే ఉద్దేశ్యం ఉండదు ....ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...

ప్రేమించడం అంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలి ....మన మనసుని చాలా చాలా కష్ట పెట్టాలి...

అయితే పెంచుకోవడం ఎలా?

మొదటగా నేను అనుకున్నాను 50-50 (ప్రేమ- స్వార్ధం) ఉన్నాయి అని

ఈ శాతం నాకు ఉహ తెలిసే వరకు ఉండి ఉంటుంది..

నా పక్కన కూర్చున్న అబ్బాయి కి బలపం లేకపోతే నేను ఇచ్చాను,ఏమీ ఆశించకుండా?

లంచ్ టైం లో  మా అన్న వచ్చి తిట్టాడు నీకు అంత పెద్ద బలపం ఇచ్చాను అప్పుడే అయిపోయిందా అని?

అపుడు నా పక్కనే కూర్చున్న మరొక అమ్మాయి చెప్పింది.. మా అన్నయ్య కి ,నేను వేరొక అబ్బాయికి నా బలపం

కొంత ఇచ్చాను అని,


అంతే మా అన్నయ్య నన్ను తిట్టేసి నీకు వాడు ఎప్పుడైనా బలపం ఇచ్చాడా?నువ్వెందుకు ఇచ్చావు అని ..!

అపుడు   ప్రేమ51- స్వార్ధం 49 గా మారిపోయింది..!

ఆతర్వాత నుండి నేనేవరికైనా నా వస్తువు ఇవ్వాలి అంటే వాడు నాకు గతం లో ఏమైనా ఇచ్చాడా? అని అలోచించి

వాడికి సహాయం చేసేవాడిని...!

ఈ రకంగా నేను స్వార్ధం లో తొలిమెట్టును ఎక్కాను....రేపు మల్లి కలుద్దాం...

మీ అభిప్రాయలు తప్పక తెలియ చేయగలరు.... READ MORE

ప్రేమ శాతం-నా లో ప్రేమ ఎంత ?



కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...



ఒక మనిషి పుట్టినపుడు తనలో ఎంత శాతం ప్రేమ ఉంటుంది ,ఎంత శాతం ద్వేషం ఉంటుంది?ఇప్పుడు నాలో ఎంత

శాతం ప్రేమ ఉంది ? ఎంత శాతం ద్వేషం ఉంది?అసలు మనిషి లో ప్రేమ శాతం లేదా ద్వేష శాతం త్రగ్గడానికి కారణం 

ఏమిటి? అని ఒక రోజు నాకు నేనే ప్రశ్నలు వేసుకున్నాను?

అపుడు మరిన్ని ప్రశ్నలు ఉదయించాయి..
             
               ప్రేమ శాతం ఎక్కువుంటే ఏమౌతుంది...ద్వేష శాతం ఎక్కువుంటే ఏమౌతుంది..?

                అది మనకు  నష్టమా?లేదా మనతో ఉండే వాళ్ళకు నష్టమా?సమాజానికి నష్టమా?

ఆ ఆలోచన లోంచి పుట్టినదే ఈ ప్రేమ శాతం % of love....my life serial

నా చిన్నప్పటి నుండి ప్రేమ శాతాన్ని నేను ఇక్కడ అవిష్కరించదలచుకున్నాను

The Tabula Rasa concept ప్రకారం మనిషి పుట్టి స్కూల్ కి వచ్చే వరకు ...అతను ఒక తెల్లని రాయబడని 
కాగితం లాంటి వాడు ..అంటే అతనికి ఎమీ తెలియదు ....కాని పిల్లవాడు అప్పటికే చాల నేర్చుకుంటాడు
అని తర్వాత మనో శాస్త్ర వెత్తలు చెప్పడం జరిగింది...

నేనుకూడా మనిషిలో ప్రేమ శాతం పుట్టినపుడు 100%ఉంటుందని అనకుండా , 50-50 (ప్రేమ- స్వార్ధం) ఉన్నాయి అని నా సీరియల్ concept మొదలు అవుతుంది... రేపటి  నుండి మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది,తప్పక మీ అభిప్రాయాలు నాతో పంచుకోగలరు...

నేనొక్కడినే ప్రేమశాతాన్ని పెంచుకోవడం ఎందుకు ?నాతో పాటు ఎవరికైనా సహాయం చేయవచ్చు కదా?

అసలు ప్రేమ శాతాన్ని పెంచుకోవడం పట్ల ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి ....కనీసం ఒక్కరైనా ఒక్క

శాతమైన వారిలోని ప్రేమను కనుక్కోగలిగితే

ఈ బ్లాగ్ సార్ధకత చెందినట్లే....అని బ్లాగ్ స్టార్ట్ చేసాను...

మరి కొత్త బ్లాగ్ కి అప్పుడే జనాలు చూడరు కదా ...అందుకే ఒక 10000 వీక్షకులు పెరిగిన తర్వాత serial స్టార్ట్

చేద్దామనుకున్నాను,50 పోస్ట్ లు 8500 viewrs సరేలే అని నా లైఫ్ సీరియల్ స్టార్ట్ చేసాను...నా నుండి డైలీ

సీరియల్ గా ఎక్సెపెక్ట్ చెయ్యకండి,కాని డైలీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను....

మీరు అభిమానిస్తారని ...మీ అభిమాని

                                                                                                                           -శ్రీనివాస్


Thursday, November 27

blog రెండు నెలల అనుభవాలు-జిలేబి గారు ముందే చెప్పారు?

19:10 Posted by srinivas 4 comments
నేను కూడా  సెలబ్రిటీ అయ్యానోచ్...!

అర్ధం కాలేదు కదా!

ఎవరైతే సెలబ్రిటీ లు ఉంటారో వాళ్ళకి అభిమానులు ఉంటారు.

అదే సమయం లో  వాళ్ళని ద్వేషించే వాళ్లు ఉంటారు.

మనం రోజు చూస్తూ ఉంటాం ఒక హీరో ని ఒకడు తిడతాడు ,ఒకడు ప్రాణమిస్తాడు,

గొప్ప గొప్ప నాయకులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు.

అలా ద్వేషించే వాళ్ళు రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు,

Ex:తప్పులని వెదుకుతారు ,కానీ ఎలా సరిచేయ్యాలో వాళ్ళకి తెలియదు

      వాళ్ళని వాల్లే గొప్ప వాళ్లు అనుకుంటారు,ఇతర గొప్ప వాళ్ళని చూసి తట్టుకోలేక   ఒర్వలేకుండా వాళ్ళ కసి ని

వెళ్లగక్కడం,

 actual గా నా బ్లాగ్ ఇలాంటి వాళ్లు, నాతో పోల్చుకొని నేనెలాగ మారుదామనుకుంటున్నానో అలాగా నైనా మారే

ప్రయత్నం చేస్తారేమో అని ఉద్దేశ్యం..!

ఒక మనిషి లో ఉండే ప్రేమ శాతాన్ని పెంచడం...!

నా బ్లాగ్ మొదటి నెల అనుభవం లో నా బ్లాగ్ చూసినవారు ఓకే అనుకోని ఉండొచ్చు ..1

అందుకే ఆ మొదటి నెల నా అనుభవాలు లో శ్యామలీయం వంటి పెద్ద వారు నన్ను ఆశీర్వదించారు..!

ఆతర్వాత మరో నెల తర్వాత ఈ పోస్ట్ రాస్తున్నాను..!

ఇది రాసేటప్పుడు వరూధిని అలియాస్ జిలేబి గారు గుర్తొచ్చారు...!

ఎందుకంటే వెల్కం బెక బెక ! ముందు ముందుంది ముసళ్ళ పండగ !! అని కామెంట్ పెట్టారు కొంచెం వెటకారంగా

కాని తను చెప్పింది నిజమని తెలియడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు...!

నేను నిన్న నన్ను పాజిటివ్ గా స్పందించిన బ్లాగ్ చదువరుల గురించి మాత్రమే విన్నవించుకున్నాను...!

కాని చదువరుల్లో మరో భిన్నమైన కోణం కలిగిన వారు కూడా ఉంటారని నాకు తెలిసింది ...!


ఎవరైనా ఎవరినైనా విమర్శించొచ్చు!కాని విమర్శ వ్యక్తి లో మార్పు తెచ్చేది గా ఉండాలి ...కాని తన ఇగో హర్ట్

అయ్యేలా ఉండకూడదు ...అనేది నా ఉద్దేశ్యం...

ఎవరో నా బిర్యాని పోస్ట్ కు Anonymus కొంచెం ఇబ్బందికరమైన భాష ను ఉపయోగించడం జరిగింది.అంతకు

ముందు నా బ్లాగ్ లో కామెంట్ మోడరేషన్  లేదు ,కాని ఆ కామెంట్ వల్ల  నా బ్లాగ్ లో అది  పెట్టడం

జరిగింది..

    కాని Anonymus  ఆ భాష ను ఉపయోగించినా మంచి విలువైన సలహా ఇచ్చాడు ... బ్లాగ్ లో పోస్ట్ రాసేంత

సమయం లో "బిర్యానీ ఇచ్చి రావచ్చని ...! ఇక్కడేం చేస్తున్నావని"

నిజంగా తనకి అంత మంచి సహృదయం ఉన్నందుకు.. !వారి పట్ల తన సహాయతను నా పైనకోపం తో

 వెళ్ళగక్కాడు..! నేను అనుకునే వాడిని అందరు నా లాంటి స్వార్ధ పరులు ఉంటారని,ఆ పోస్ట్ లో నేను చేసిన తప్పు

గురించి రాసుకున్నాను,

ఇకనుండి అలా చేయకూడదనే ఆ పోస్ట్  కూడా రాసుకున్నాను,

ఇంకొకటి బుగ్గలను బూరేలతో పోల్చినపుడు బర్గర్ తో పోల్చకూడదంటా?

సరే దానిని విమర్శించోచ్చు కాని పబ్లిష్ చేయడానికి వీలు కాని Anonymus కామెంట్స్ ఎందుకు చేస్తారు ...

నేనవరిని ఏమి అనలేదే?

టెలిఫోన్ నుండి మారిపోయి స్మార్ట్ ఫోన్ వాడే మనం, బూరెలు తినడం మాని వేసి బర్గర్ లు తినే మనం ...

బుగ్గలను బర్గర్ తో పోల్చకూడదా?కొత్త నీరు ను స్వీకరించలేక పోతున్నారా?

లేకపోతే ఈబ్లాగ్ వరల్డ్ లో ఇంకా గ్రూప్ లు ఉన్నాయా ?

అసలేం జరుగుతుందో ఇక్కడ నాకు ఏమి అర్ధం కావడం లేదు?అసలు నా జీవితం లో నా పైన ఇలాంటి కామెంట్ లు

వస్తాయని నేను అనుకోలేదు..."చీకట్లో మనిషి ఇంత క్రౌర్యంగా ఉంటాడా?"

మరోAnonymus గారు నా బ్లాగ్ కి blogspot వాళ్ళ స్పేస్ వేస్ట్ అని.. అది నిజం కావచ్చు...కాని నేనేం చెయ్యలేను

నా గురించి నేను రాసుకోవడం తప్పా...?

నీకు గుర్తుందా నీ చిన్నపుడు నీ టెడ్డి బేర్ గురించి నువ్వు చెప్పే ప్రతికథ నేను వినే వాడిని

అనే పోస్ట్ నాకు చాలా నచ్చిన పోస్ట్...

దీనికి Anonymus:నిజంగా మీ బ్లాగ్ సూపర్ గా ఉండండి! ఈపోస్ట్ నిజంగా కన్నీళ్ళు తెప్పించింది నాకు 

అని చాలా మంచి కామెంటు చేసారు 

మంచి వెనక చెడు ,చెడు వెనక మంచి ఎక్కడైనా ఉంటుందని తెలుసు ....

కాని ఇక్కడ కూడా ఉందని ...గతం లో మహా యుద్దాలే జరిగాయని తెలిసింది...

కొత్త బ్లాగర్లను ర్యాగర్లు ర్యాగింగ్ చేసే వారని...నేను నిన్న కొన్ని తెలుగు బ్లాగులను చూస్తే తెలిసింది...

ఏది ఏమైనా నేను నా బ్లాగ్ లో నా గురించే రాసుకుంటాను ...నేనెవరిని కించ పరిచే ఉద్దేశ్యం నాకు లేదు...

నాకు ఒక పద్ధతి గా రాసే తెలుగు రాక పోవచ్చు ,కావున దానిలోని భావాన్ని చూడండి లేకపోతే వదిలెయ్యండి

ఇకనుండి నా బ్లాగ్ లో నెల నెల  నా అనుభవాలు రాయకూడదు ..అని నిర్ణయించుకున్నాను,ఎందుకంటే కామెంట్

అంటేనే కామెంట్ ,ఇలాంటి అనుభవాలు దరిదాపుగా అందరు ఎదుర్కొనే ఉండి ఉంటారు...అందుకే చాలా మంది

వారి బ్లాగ్స్  లో కామెంట్ మోడరేషన్ పెట్టుకున్నారు...

కాని నా బ్లాగ్ లో నేను కామెంట్ మోడరేషన్ తీసివేసే రోజులు రావాలని కోరుకుంటున్నాను...!

బ్లాగ్ లకు రక్షణ ఉండాలి అని కోరుకుంటున్నాను...!

కామెంట్ మరియు చర్చ  అంటే విమర్శించితే తప్పు -ప్రశంసించితే ఒప్పా..?  లో కామెంట్స్ ఒకసారి 

చూడండి,

చివరగా.... 

నా బ్లాగ్ లోని ఆండ్రాయిడ్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకున్నవారికి ధన్యవాదములు...

మీరు కోరినట్టే subscribe me ఆప్షన్ పెట్టడం జరిగింది ,గమనించగలరు,

ప్రతి ఒక్కరికి ధన్య వాదములు...

రేపటి నుండి నా బ్లాగ్ లో "ప్రేమ శాతం నా  లైఫ్ సీరియల్ "

Wednesday, November 26

నా బ్లాగ్ లోని కామెంట్ల పరంపర... !

19:08 Posted by srinivas 6 comments
తెలుగు బ్లాగ్ చదువరులకు ధన్యవాదములు....


మీరు మీ కామెంట్స్ నన్ను ,మరియు నాకు చాల ప్రోత్సాహాన్ని కలిగించాయి...

మచ్చుకు నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిన కామెంట్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది...

నా బ్లాగ్ లో ఉండే  మీ కామెంట్స్ పరంపర ఇలాగే కొనసాగాలని ...,

పతి ఒక్కరికి పేరు పేరున ధన్య వాదాలు తెలియ జేస్తూ మీ శ్రీనివాస్...

(రేపు ఒక బ్లాగ్ రెండు నెలల అనుభవాలు ) 

మీకు ఇంకా ఏమైనా నా పోస్టు ల గురించి చెప్పాలి అంటే పోస్ట్ టైటిల్స్ పైన క్లిక్ చెయ్యండి.....


మహి:3 వ విమర్శ తప్పు కదండీ ఒక వ్యక్తి రూపు రేఖలు గురించి విమర్శించడం మన ఆలోచనా విధానం లోని లోపాన్ని ప్రతిబింబిస్తుందని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. విమర్శ కి బాధ పడాలా వద్దా ప్రశంస కి సంతోష పడాలా లేదా అనేది విమర్శించే (లేదా ప్రశంసించే) వ్యక్తి మనస్తత్వం ను బట్టి నిర్ణయించుకుంటే ఏ సమస్యా రాదు.onవిమర్శించితే తప్పు -ప్రశంసించితే ఒప్పా..?

Kondala Rao Palla:good one . బాలానందం ! బ్రహ్మానందం !! మార్కెట్ తెలియని మహదానందం !!! అందరి చిన్నారుల కామన్ ప్రశ్నలకు జవాబివ్వగల పెద్ద 'మనసు'లెందరు? on అసలు నేనేం తప్పు చేసాను?

Kondala Rao Palla:భిన్నత్వంలో ఏకత్వమని ముద్దుగా చెప్పుకునే పేదప్రజలున్న సంపన్న భారత దేశం. ప్రతి ఒకడు మరియొకనీ దోచుకునేవాడే. తన స్వార్ధం తన లాభం చూసుకునే వాడే. స్వార్ధమే ఈ అనర్ధ కారకం. నాడూ-నేడూ మారని అంతరాలు రాజీలేని పోరాటం సాగిస్తేనే ఏనాటికైనా మారేది! అలా మారాలని మరోప్రపంచం రావాలని ఆశిద్దాం! on పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...

Upendar:చాలా బావుంది on పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...

pydi naidu gavidi:సూపర్ అంతే on పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...

Zilebi.:అమ్మనెందుకు గౌరవించాలి ?? సింపుల్ - అమ్మ కాబట్టి !! జిలేబి on అమ్మనెందుకు గౌరవించాలి

మహి:ఎంత బాగుంది.చదువుతుంటే మంచి చిరునవ్వుతో ముఖం,మనసు నిండిపోయింది on అసలు నేనేం తప్పు చేసాను?

K.S. Chowdary:చాలా బాగుంది.సూపర్! బ్లాగ్ వేదిక తరుపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. on నా వంతుగా అగ్గ్రిగేటర్ లను ప్రమోట్ ఇలా చేద్దామనుకున్నాను

Tarangini:Nice post! on అప్పుడు అలా అనుకొన్న బాబు ఎవరో కాదు నేనే..

Anonymous:నిజంగా మీ బ్లాగ్ సూపర్ గా ఉండండి! ఈపోస్ట్ నిజంగా కన్నీళ్ళు తెప్పించింది నాకుon నీకు గుర్తుందా నీ చిన్నపుడు నీ టెడ్డి బేర్ గురించి నువ్వు చెప్పే ప్రతికథ నేను వినే వాడిని

Chiranjeevi Y:nice n very true on మనం ఎవరినైనా గెలవాలి అంటే ముందు మనం వాళ్ళ ఇగో ని సంతృప్తి పరచాలి!

Sharma:Hi Srinivas....Your poetry is awesome... In contemporary telugu poetry...this is the best I read today. I like the way you compared Burger with Bugga...it shows ur naughtiness ;-) Good... Keep Going..-Sharma on రెండు నెలవంకలు బోర్లాపడి నీ కను బొమ్మలైనాయి

Anonymous:బర్గర్ లాంటి బుగ్గల్లో నీ ముద్దమందారం లాంటి ముక్కు, Burger lanti Buggalentii.. Mukku Mudda mandram enti... LOL..too funny on రెండు నెలవంకలు బోర్లాపడి నీ కను బొమ్మలైనాయి...

Rao S Lakkaraju:"కనీసం పెద్దలు గురు సమానులు కూడా సలహాలు ఇవ్వరే?" మేమందరం చూసే పెళ్ళి చేసుకున్నాము, తాకి కాదు. ఇంకా సంసారాలు నడుస్తూనే ఉన్నాయి. చూసి, తాకి, సంవత్సరాలు డేటింగ్ లు చేసుకుని, అంతా తెలుసుకున్నా మనుకుని పెళ్లి చేసుకునే అమెరికాలో నూటికి యాభై మంది కి పెళ్లి పెటాకులు అవుతాయి. ముందర ఎవరో అన్నట్లు పెళ్లి చేసుకునే ముందూ తరువాత కూడా మనస్తత్వం తెలుసుకోవటం చాలా కష్టం. అయినప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏమిటి దోవ అంటారా, మొట్ట మొదట చూడంగానే కలసి జీవించ గలమనే భావన కలగాలి. కలిసి మాట్లాడు కోవచ్చు అనే భావన కలిగితే, సంసారంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించు కోవచ్చు. (కొందర్ని చూడంగానే మాట్లాడగానే బాబోయ్ మనకి కుదరదు అనిపిస్తుంది). విష్ యు గుడ్ లక్. on ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం లో వీడొక తురుపు ముక్క

swapna@kalalaprapancham:Ee post chadivaka okka mukka artam kale. Em chepalanukunaru asalu memu em cheppali ani? Mi previous post chusaka malli ee post chuste apudu artamindi story :) Emundi ammayilu epudu valla husbands baga chusukovali n baga imp. Caring ivvali. Ala cheste chalu happy ga untaru. Valla istalni telusukovali. Miru private ga matladandi phone lone better. Free ga matladochu personal ga kanna. Jokes chestu free ga matladandi itte padipotaru plus vallu open ga matladutaru apudu. Naku telisi ipudu amayilaki evariki vantalu ravu edo 1 % unnaremo :) dont expect much on this. Inka mat mida amay ni kurchopete valu kuda unnara very surprising. Intaki miru em job chestaru. on ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం లో వీడొక తురుపు ముక్క

మహి:నాన్న సైకిల్ పై ఎక్కి తిరగటం ఎంత అద్భుతంగా ఉంటుందో.ఆ అదృష్టం కోల్పోయిన తర్వాత అలా వెళ్లే వారిని చూసి ఇంకా life లో అలాంటి అదృష్టం రాదు అని గుర్తు వస్తే ఆ మనసు ని కన్నీరు మాత్రమే ఓదార్చగలదు.anyway thank you so much for remembering me such a valuable memory on ఇన్ని చందమామలు నన్ను ఒక్కక్కటి గా తాకుతున్నాయా

Kondala Rao Palla:గెలుపుపై మీ అభిప్రాయం బాగుంది. గెలుపు ఓటమి కాకుండా నిరంతర ప్రయత్నమే అసలైన విజేత లక్ష్యం లక్షణం కూడా! వేరొకరిని ఓడించడం ద్వారా సాధించేది "గెలుపు" అందరి సహకారంతో అందరికీ ఉపయోగపడేలా నీవు సాధించేది "విజయం" గెలుపు బలుపునిస్తే విజయం ఆనందాన్ని ఆత్మ సంతృప్తినీ అసలైన ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది. నా అభిప్రాయం ప్రాకారం గెలుపుకీ విజయానికీ తేడా ఉంది. ఇవి రెండూ ఒకటి కాదు. on  ఆడటం అంటే గెలవడానికేనా ? మరి గెలుపు లక్ష్యం నా చేతుల్లో ఉండదు కదా..

శ్యామలీయం:తెలుగు బ్లాగుప్రపంచానికి స్వాగతం. మీ బ్లాగు మీ కోసం. ముఖ్యంగా కేవలం మీ కోసం. చక్కగా వ్రాయటాన్ని ఆనందించండి. శుభాకాంక్షలు. on blog రాయడం -ఒక నెల-నా అనుభవాలు

ఎగిసే అలలు..:Very nice...mee blog chalaa baagundi:-) on ప్రేమ ఎప్పటివరకు ?ఒక కోతి ప్రయోగం :-()

Sree naadh:మనిషి తనకు pleasure ఇవ్వని పని ఎప్పటికీ చెయ్యడు (మనకు pleasure కలిగినప్పుడు dopamine మనం అదేపనిని మనం మరోసారి చేసేలా ప్రోత్సహిస్తుంది). మనం దానంచేస్టే దాన్నుంచి కొంత pleasureని derive చేస్తాం (కొందరు ఏకంగా ఆచేసిన దానం గురించి ప్రచారంకూడా చేసుకుంటారు). ప్రేమను నేను కనీసం అలాకూడా చెప్పలేను. ఇందులో సంతృప్తిలాంటి indirect విషయాలకన్నా, కొన్ని direct విషయాలే దాగున్నాయి. కనుకనే ప్రేమలోనూ, వివాహంలోనూ మోజు తీరిపోవడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. I think I should not comment any further :-) on ప్రేమ ఎప్పటివరకు ?ఒక కోతి ప్రయోగం :-()

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు:మొదటి రకంగా ఆలోచిస్తే మీరు capitalist రెండో రకంగా ఆలోచిస్తే మీరు communist on ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?

SIVARAMAPRASAD KAPPAGANTUమన ఆలోచనలను కూడా కల్తీ చెయ్యటానికి, మీరన్న ఆ కొంతమంది మనుషులే, పార్టీలు కూడా పెట్టుకుని చెయ్యకూడని పన్లు చేస్తున్నారు. on కొంత మంది మనుషుల్లారా?అందరికీ నష్టం...!మీకు కుడా
హ..హ..
లంచం మీ దగ్గరికి రావడం లేదు అన్నది రాంగ్.. మీరు రానివ్వడం లేదు అనడం కరెక్ట్...

నేను ఆయితే లంచంను నా దరిదాపులకు రానివ్వడం లేదు... దానికి నేను పొందుతున్న ప్రతిఫలం..
హంగు-అర్బాటలు,
గౌరవం (??),
ప్రపంచాలు తిరిగే అవకాశం కన్నా 
చాలా ఎక్కువే పొందుతున్నాను. అదేంటో తెలుసా!!
అత్మగౌరవం, మనశ్శాంతి, గుండెల మీద నిశ్చయంగా చేయి వేసి హాయిగా పడుకోవడం, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కష్టార్దితమే అన్న సత్యం.... ఇంత కంటే ఏమి కావాలి సార్... on లంచమా నా దగ్గరికి ఎందుకు రావు

విమర్శించితే తప్పు -ప్రశంసించితే ఒప్పా..?

నేను ఈ  పోస్ట్ రాసిన ఉద్దేశం విమర్శ అనేది బాధ పెట్టేది గా ఉండకూడదు...

ప్రశంసించేది గా ఉండి ఏమైనా లోటు పాట్లు ఉంటె సరిదిద్దు కొనేలా ప్రేరేపించాలని ...

దానికోసం నన్ను నేను ఏంటో తెలుసుకొనే ప్రయత్నం చేసాను...

 నేను ఇలాగ జనాలను విమర్శించే వాడిని.....

1)నీ తలేంటి ఇంత చిందరవందరగా ఉంది...అసలు ఇంట్లో అద్దం లేదా?

2)ఏం పని మొదలెట్టావు ?నీకు వేరే పనిలేదా?

3)నువ్వేంటి ఇలాగ ఉన్నావు ....ఇంత పొట్టి గా చూడటానికి బాగా లేకుండా ఉన్నావు ...

4)ఇంటి నిండా మురికి బట్టలే పడి ఉన్నాయి ...ఇది ఇళ్ళా ?మురికి కుంపా?

5)ఏం పాట పాడుతున్నావు ...నా తల దిమ్మెక్కి పోతోంది...
http://naperusrinivas.blogspot.in/

6)చేతులు ఇలాగేనా శుభ్ర పరచడం ,చూడు చేతుల్లో ఎంత మురికి ఉందో...

7)ఏ పని చెయ్యడం చేత గాదు...? అసలు నువ్వు దేనికైనా పనికొస్తావా?

8)ఇలాగేనా కూర వండేది...ఇంత ఉప్పు ఎక్కువైంది...



ఇపుడు ఆలోచిస్తే ఇవి కరెక్ట్ కాదు అనిపిస్తోంది...

కాని దాన్నే ఇలాగ ప్రశంశిస్తే బాగుంటుంది అనుకుంటాను...

For Example:

1)నీకు ఎవరో బాగా హెయిర్ స్టైల్ చేసారు ,నీ తలను బాగా దువ్వుకొంటే బాగుంటుంది కదా ?

ఇలాగే

  ఇంకా మంచి విమర్శ లేదా ప్రశంస ఎలా చేయాలో 2,3,4,5,6,7,8....ల కు తెలుప గలరు

మీ అమూల్యమైన ఆభిప్రాయాలు తెలుపగలరు,లేదా

ఇంకా నేను నాకు తెలియకుండా జనాలని విమర్శిస్తూ ఉండిఉంటాను,

వాళ్ళ బాధపడుతున్నది కనీసం గుర్తించనైనా గుర్తించలేనని నాకు అర్ధమైంది...

ఇలాగ మనం చేసే విమర్శలు ఏమైనా ఉంటె (పైనవి కాకుండా )నాకు తెలుపగలరు

నా నిన్నటి పోస్ట్ :చందమామ ఇంటికి దారేది...తెలుసుకోవలనుకుంటున్నారా?

Tuesday, November 25

చందమామ ఇంటికి దారేది..?

05:15 Posted by srinivas 6 comments
మా అమ్మ చెప్పిన చిన్ననాటి కథలు...

ఒక రాజు ఉంటాడంట,ఆ రాజుకేమో ఆటలాడుకోవడం అంటే చాలా ఇష్టమంట,ఆ రాజు ఆడుకొని ఆడుకొని ఆకలేసిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి నిల్చుంటాడంట,అప్పుడు అమ్మ ఇలాగ తినిపిస్తుందంట,

అని నాకు తిపించడానికే ఒక కథ ను తయారు చేసుకొని పెట్టుకుంది మరి...!
        నిజంగా మనకు తెలియదు అమ్మ అలాగా కొసిరి కొసిరి తినిపిస్తుంటే మనం చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ తింటూ ఉండి ఉంటాము...ప్చ్ కాని ఏం లాభం అవేమి మనకు ఇప్పుడు గుర్తుకు లేవాయే...!

ఇంకా పండుకునేటపుడు...


చందమామ ను చూపిస్తూ డాబా పైన చందమామలో పేదరాసి పెద్దమ్మ కథ....గుర్తుంది కదా!
పేదరాసి పెద్దమ్మ నూలు వడుకుతూ ఉంటుంది....అనేకథ చెప్తూ ,చందమామ లోకి మనుషులు వెళ్తున్నారు తెలుసా? అని అడిగితే 
నేను నేను కూడా వెళతాను ,...నిన్ను డాడి ని తీసుకొని అక్కడికి వెళ్తాను అని చేప్పేవాడినంట..!
అప్పుడు ఇప్పుడు లా కెమెరా ఫోన్ లు డిజిటల్ కెమెరా లు ఉంటె బాగుండేది...!

ఇంకా నేను స్కూల్ కి వెళ్ళడానికి కూడా  కథ చెప్పాల్సి వచ్చేదట..!

అదేనండి రాత్రి చెప్పిన  చందమామ కథ ని లింక్ చేస్తూ అమ్మను చందమామ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే నేను పెద్ద ఆఫీసర్ ని కావాలి ,ఆఫీసర్ కావాలి అంటే బాగా చదువుకోవాలి,బాగా చదువుకోవాలి అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి...అని చందమామ దారిలో బడి కి దారిని చూపిస్తూ...కథను చెప్తుంది.

"చందమామ ఇంటికి దారి..."ఇదే నండి...!

ఇదే నండి చిన్న పిల్లలని ప్రేమతో బడికి పంపే దారి

కాదంటారా....?నవ్వుకోండి,కాని ఇదా చందమామ ఇంటికి దారి అని తిట్టుకోకండే?

ఇలాగ నాకు స్కూల్ అంటే ఇష్టం కలిగే దాక ఇలాగే చెప్పేదంట...
ఆ తర్వాత నేను మా అమ్మకి కథలు చెప్పడం స్టార్ట్ చేసాననుకోండి..ఇప్పుడు కూడా....;-)) 
అది వేరే విషయం...
చిన్నపుడు మా అమ్మ దెయ్యాల కథలు చెప్పేది కాదు,కాని పక్కింటి పిల్లలతో చెప్పించుకునేవాడిని...
మళ్ళి ఆ భయం పోవాలంటే... మా అమ్మతో మరొక కథ చెప్పించుకోవాల్సిందే కదా...

అప్పుడు చిలుకమ్మ కథ ,టక్కరి నక్క కథ ,పెద్దపులి కథ లు చెప్పెదింట.... 

నాకు ఊహ తెలిసినపుడు మా అమ్మ చెప్పిన ,బాగా గుర్తున్న కథ ఏమిటంటే,
ఒక రాజ కుమారుడు ,ఒక రాజ కుమారి కోసం ఏడూ సముద్రాలు దాటడం,అక్కడ ఉండే రాక్షషులను చితక్కోట్టడం,
తర్వాత రాణిని తెచ్చుకోవడం....
ఇలాగ ఉండేది...
ఆ కథలో రాజకుమారుడి ల నేను ఫీల్ అయ్యేవాడినేమో అందుకే ఆ కథ కి బాగా కనెక్ట్ అయ్యానేమో,
సో ఇది స్నేహితులారా మా అమ్మ చెప్పిన చిన్ననాటి కథలు....

Monday, November 24

కథలా సాగిపోయే ఈ జీవితం కలలా మిగిలి పోకూడదని...?

నేను కలిసిన ఒక ముసలాయన జీవితం ...
అతన్ని  చూడగానే ...అతని కళ్ళలో నాకు కనిపించిన భావమే ....ఈ పోస్ట్


జీవితం లో నేననే వాడు ఒకడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయానా?
అనుక్షణం అస్తిత్వానికై పోరాటం లో నన్ను నేను కోల్పోయానా?
మార్కుల పందెం లో చిన్న నాడు ఆటలకు దూరమయ్యాను....!
నడి ఈడు లో ధనసంపాదనే లక్ష్యం తో చిన్న చిన్న ఆనందాలను చేరిపెసాను...
కాని ఇప్పుడు.....
ఈ మలి ఈడు లో నాతో ఆటలాడే వారెవరు....?
నేను చెరిపిన చిన్న చిన్న (కావు అవి చాలా విలువైనవి)ఆనందాలు ఇచ్చేదెవరు?
అసలు నన్ను నేనే ప్రేమించుకోలేదు....ఇక నన్నెవరు ప్రేమిస్తారు....
కనీసం ఇపుడైనా నన్ను నేను ప్రేమించుకుంటున్నానా? 

ఈ ముసలాయన జీవితం నాకొక పాఠం...!
ఈ ఉరుకుల పరుగుల జీవితం లో మన కోసం మనం ప్రతి రోజు కొన్ని నిమిషాలైన కేటాయించుకోవాలని....!
ఆ సమయం లోనైనా మనల్ని మనం ప్రేమించుకోవాలని....
కథ లా సాగిపోయే ఈ జీవితం లో నేను కల లా మిగిలి పోకూడదని...?


Sunday, November 23

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!
13 ఏల్ల అమ్మాయి కట్టెల కోసం అడవికి వెళ్లి గొడ్డలి తో కట్టెలను కొట్టడం....
చిన్నపుడు రేషన్ షాప్ కు ఉదయానికి వెల్లి పెద్ద లైన్ లో నిల్చొని కిరోసిన్ ఆయిల్ తేవడం....
గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడం....
ఒక అమ్మాయి తన తండ్రి గొడ్డలి తయారు చేస్తున్నపుడు సుత్తె తో కరిగిన ఇనుము పై కొట్టడం....
నీళ్ళ కొళాయి దగ్గర గొడవలు పడకుండా నీళ్ళు తేవడం.....


బాలల హక్కులు అంటే ఏమిటో తెలియని బానిసత్వం....

గుడికి వెళ్ళినపుడు కూడా గంటలు గంటలు లైన్ లోనే నిలపడడం...
సీరియల్లు చూసి హీరొయిన్ తో బాధ పడటం.....
సినిమాలో హీరో కష్టాలతో పాటు పోరాడాలని తీర్మానం...
తాగోచ్చిన తండ్రితో గొడవ పడి, చివరికి అన్నం పెట్టి పడుకోబెట్టడం....
తెల్లారితే ఏమవుతుందో తెలియని జీవితం తో పోరాడటం....
చిన్న ప్రపంచం లోనే బ్రతకడం....
ఆత్మాభిమానం అంటే ఏమిటో కూడా తెలియని మంచితనం.....
కిట్టి పార్టీస్ అంటే ఏమిటో తెలియని వాళ్లు కచ్చ కాయల ఆటే  గొప్పగా ఆడుకునేవారు...
తిన్నది అరిగేలా ఏరోబిక్స్ .మార్నింగ్ వాక్ లు తెలియనివాళ్ళు ...పొద్దునే లేచి ఇంటి ముందు 
పెద్ద వాకిలి ఊడవడం...తొక్కుడు బిళ్ళ ,స్కిప్పింగ్ ఆటలు .... ఆడటం...
అడవికి వెళ్లి పండ్లు తెంపుకొని రావడం...
తినడానికి ఏమిలేక పోతే గంజి చేసి ఇవ్వడం....అదే త్రాగడం...
పొగ చూరు పోయ్యిలలో వంటలు వండడం ...తినడం...
ఆఫీసర్స్ తిట్టినా కాని ....అయ్యా దొరా!...అని పని చేపించుకోవడం...
పోపన్నం లోనే బిర్యాని చూసుకోవడం.....
చుట్టాలోస్తే వాళ్లకు ఉన్నదాంట్లో కడుపు మాడ్చుకొని వాళ్ళకు భోజనం పెట్టడం...
సర్కారు బడికెళ్ళి నోట్ పుస్తకాలకు డబ్బులు లేక మాస్టారుతో తిట్లు పడటం....
మొత్తం మీద జీవితం లో ఉనికి కోసం పోరాడడం ....జీవితం లో ముఖ్యమైన ఆరాటం... 
తిట్లు పడ్డ కాని  ,చీదరాలు ఎదుర్కొన్న అవి జీవితంలో భాగాలు అనుకొనే రాజి పడే అనుభవాలు... 
ప్రతి చోట చీత్కారం ...అందులోనే పోరాటం...అక్కడే గెలుపు...అదే ఆనందం....అదే మజా ....
  

Saturday, November 22

నా వంతుగా అగ్గ్రిగేటర్ లను ప్రమోట్ ఇలా చేద్దామనుకున్నాను

చాల మంది బ్లాగ్స్ లో వాళ్ళు ఉపయోగించే aggrigator లను ప్రమోట్ చెయ్యడం లేదు


దానికి ఒక కారణం :టెక్నికల్ గా మాకు తెలియదు ,అనేవారికోసం

ముందు నా బ్లాగ్ లో aggrigator ల వరుస ను చూడండి...
ఆ వరుస మీకు నచ్చి నట్టయితే.....
(మీరు వరుసలను మార్చుకోవాలి  అంటే కామెంట్ పెట్టండి,నేను మీకు తప్పక సహాయం చేస్తాను)

మీ బ్లాగ్ ఇంటర్ఫేస్ లో overview మీద నొక్కండి,,,
lay out సెలెక్ట్ చెయ్యండి....
అందులో మీకు నచ్చిన చోట Add gadjet నొక్కండి....
html/javascript కోసం scroll చేసి html/javascrip పైన  క్లిక్ చెయ్యండి
మీకొక popup విండో open అవుతుంది...
అందులో title వద్ద box లో కృతజ్ఞతలు అని తెలుగు లో రాయండి...

ఇంకా క్రింద నున్న box లో క్రింది కోడ్ copy చేసి paste చేయండి....
తర్వాత save చెయ్యండి...
మీ బ్లాగ్ లో aggrigators ప్రమోట్ అవుతాయి...

రెండవ కారణం:మాకేం లాభం,అనే వారికోసం

అవి మనల్ని ప్రమోట్ చేస్తున్నపుడు వాటిని మనమెందుకు ప్రమోట్ చెయ్యకూడదు?
మనం అన్నీ aggrigators ని ప్రమోట్ చెయ్యడం వల్ల మనకు అన్నీ aggrigators నుండి viewers పెరగరా?
వాటి వాళ్ళ మనకు కూడా automatic గా viewers పెరుగుతారు...
ఆలోచించండి....వద్దు ...ఆలోచించకుండానే మీ బ్లాగ్ లో aggrigators ని ఇప్పుడే ప్రమోట్ చెయ్యండి...
బ్రతకనివ్వండి బ్రతకండి....

<a href="http://koodali.org/"target="_blank">
  <img src="http://koodali.org/banner120x50.png" alt="koodali" style="width:100px;height:42px;border:0" />
</a>
<a href="http://maalika.org/"target="_blank">
 <img src='http://maalika.org/img/Maalika-Logo-9.gif'alt='maalika' style="width:100px;height:42px;border:0"/>
</a><br/>
<a href="http://www.blogillu.com/"target="_blank">
  <img src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi8jI2pqx_TJ-iBxACpQM0hcgZx5AO9Pae7ysXlpIJvSQ_g3BYqfr2Ux4hZAFelPlmZGLSL6LPTVG-ICBpS_JYvSGUaAwm8ux3scBth_SwR-ojzZL3zqnRl1NoqZH64kkyInZiHjGvzk_o/s1600/blogillu2.gif" alt="koodali" style="width:100px;height:42px;border:0" />
</a>
<a href="http://magazine.palleprapancham.in" target="_blank">
 <img src="http://www.palleprapancham.org/palle.png"alt='maalika' style="width:100px;height:42px;border:0"/>
</a><br/>
<a href="http://blogvedika.blogspot.in/"target="_blank">
  <img src="http://1.bp.blogspot.com/-oc3uTffhWvM/VD_V5oApWoI/AAAAAAAADFo/hm8_dNqJhfs/s1600/blogvedika11.jpg" alt="blogvedika" style="width:100px;height:42px;border:0" /></a>
<a href="http://poodanda.blogspot.in/"target="_blank">
 <img src='https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjcflsxHFNCRPTRoUp-GQHNMW8RQayCmyfk0yO686hom8Brj_LQAYcpK-eadZPZDsW0zxcSV71yL5CktsrT5TqWEAvaaD4d7c1XeAlcWpF4UrfUzQkmkD4kIScs1xrSzwGrQE2HBflta_jQ/h120/poodanda.png'alt='poodanda' style="width:100px;height:42px;border:0"/>
</a>
గమనిక :నాకు తెలిసిన aggrigator లు మాత్రమే ఇక్కడ ఇచ్చాను,
             ప్రస్తుతం తెలుగు బ్లాగ్ లకు సేవ చేసే ఇతర aggrigators ఉంటే నాకు తప్పకుండా తెలుపగలరు

Friday, November 21

ఇలాగా పాటలు పాడి నాకు తినిపించేదంట...

05:46 Posted by srinivas 4 comments
నిన్న రాసిన పోస్ట్ కు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి....
నిజంగా ఆ పోస్ట్ రాసేటప్పుడు నా చిన్నతనం లో జరిగిన సంఘటనలు రాయడం జరిగింది....
చాలా బాగా అనిపించింది....
అప్పుడే ఇంకొక పోస్ట్ రాయడానికి ఒక ఐడియావచ్చింది...
అదేంటంటే చిన్నపుడు మా అమ్మ నాకోసం ఏమేం పాటలు పాడేదో తెలుసుకోవాలని అనుకున్నాను,
అందుకే అవి అడిగి తెలుసుకొని ఆ పాటలు ఇక్కడ ఇవ్వడం జరిగింది....

                                                                           అమ్మకో ముద్ద...
                                                                           నాన్నకో ముద్ద....
తాతయ్యకో ముద్ద....
మామాకో ముద్ద....
అమ్మమ్మకో ముద్ద....
ఇలాగా పాటలు పాడి నాకు తినిపించేదంట...
google image

                   గుడు గుడు గుంచం...
గుండె రాగం .....
పాముల పట్నం....
పడిగే రాగం....
పక్కన చెవ్వు పట్టుకో...

అక్కడ దగ్గర గా ఉండే వాళ్ళ చెవులు పట్టుకొని గు... బా.. గు...బా..అని లాగాలి...

                                                                     కాళ్ళ గజ్జా ...
                       కంకానమ్మ....
       వేగూ చుక్కా....
       వెలగా పండు.....
      కాళ్ళు తీసి కడగా పెట్టు....
అంటే కాళ్ళు ఇలాగ దూరంగా పెట్టాలంట....
ఇంకా మీకు తెలిసే ఉంటుంది ...

చందమామ రావే.....

జాబిల్లి రావే.....

ఇలా పాడుకుంటూ చందమామ ను చూపిస్తూ పెరుగన్నం పాలు కలిపి తినిపించేదంట...
పెరుగన్నం కూడా చందమామ లాగ తెల్లగా ఉండడం వల్ల చందమామ లోని తెల్లదనం తినేవాన్నెమో...
ఇంకా 
                                                               చిట్టి చిలుకమ్మ
             అమ్మ కొట్టిందా... 
      తోటకేల్లావా....
      పండు తెచ్చావా...
      గూట్లో పెట్టావా...
      గుటుక్కుమింగావా....
అని కూడా తినిపించే దంటా....
బాగున్నయా ?రేపు మా అమ్మ చెప్పిన చిన్నప్పటి చిట్టి చిట్టి కథల తో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను ఏమంటారు?
గమనిక:మీకు తెలిసిన చిన్నప్పటి పాటలు మీ కామెంట్ లో పెడితే ,ఈ కాలం మాతృ మూర్తులు తెలుసుకుంటారు ,ఇంకా చిన్న పిల్లలకు పాడుతుంటారు అనుకుంటాను 

Thursday, November 20

అసలు నేనేం తప్పు చేసాను?

05:38 Posted by srinivas 7 comments
అసలు నేనేం తప్పు చేసాను? నాకైతే ఇప్పటికి అర్ధం కాలేదు

ఇంత పెద్దయ్యాక కూడా నాకు అర్ధం కావడం లేదు!

ఎందుకో తెలుసా?అయితే చదవండి...కానీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి...!

గోడలన్నీ కలర్ వేసి  పాడుచేసావెంట్రా?
"పాడు చెయ్యలేదు నాన్నగారు....గోడలకు కలర్ వేసాను"

బొమ్మల్ని ఎందుకురా ఖరాబు చేస్తున్నావు?
లేదు అమ్మ బొమ్మల్ని రిపేర్ చేస్తున్నాను!

ఏమిటిరా గిన్నెల్నిగట్టిగా కొడుతున్నావు?
నేను మ్యూజిక్  చేస్తున్నానన్నయ్య...



ఎవరికైనా మంచి నీళ్ళు తెమ్మంటే నేనే ముందుగా తేవాలని పరుగెత్తుకుంటూ నీళ్ళు తీసుకొస్తే

అన్నీకింద పడేసావెంట్రా?అని మందలింపు?

అమ్మ పిలిచిందని పరిగేత్తుకొస్తే కింద పడి దేబ్బలు తగలితే,మా అమ్మను వదిలేసి నన్ను తిడతారెందుకు?

నాన్న గారు తెచ్చిన టేప్ రికార్డర్ కడగడానికి దాని మీద నీళ్ళు పోయడం కూడా తప్పా?

పక్కింటి సుబ్బుగాడు చిన్నా గాడిని కొడితే సుబ్బుగాడిని నేను కొట్టకూడదా?

అమ్మ డ్రెస్ ఎలాగో ఉతికేస్తుంది కదా అని మట్టిలో ఆడతా ఉంటె నామీద కేకలేందుకు?

పాపం అమ్మ ఒక్కతే పని చేసుకుంటుందని , పైప్ తో  చెట్లకు నీళ్ళు పట్టేస్తుంటే,ఎందుకు తడుస్తావంటది?

వర్షం వస్తే ఇంట్లో నీళ్ళు ఎందుకు వేస్ట్ చెయ్యడం అని వర్షం లో స్నానం చేసినా తప్పే?

బాగా తినాలి అంటారు,చాక్లెట్లు కొనుకుంటాను అంటే వద్దంటారు

నాన్నగారు బయటకి వెళ్ళేటపుడు సాయం చేద్దామని(చాకలేట్లు ,ఐస్ క్రీం కొనుక్కోవచ్చు) వెళ్తానంటే

అల్లరిచేయ్యకుడదంటారు...

ప్రొద్దున లేస్తే అల్లరి అంటారని బాగా పడుకొని ఉంటె లేలెమ్మని స్కూల్ కి టైం అయిందని లేపెసేవారు..!

ఇవన్నీ నేను చిన్నపుడు చేసిన మంచి పనులు...కాదా మీరే చెప్పండి..!

వాస్తవానికి ఇక్కడ నేనేం తప్పులు చెయ్యక పోయినా నాకు దెబ్బలు పడ్డాయి ఎందుకో ఏమో?

Wednesday, November 19

అమ్మనెందుకు గౌరవించాలి?

అమ్మనెందుకు గౌరవించాలి...
ఈసృష్టి లో మనకోసం అన్ని త్యాగం చేసేది అమ్మ!
మన ఆనందం లోనే తన ఆనందం వెతుక్కోనేది
మనం ఏ మాత్రం ఆలోచించకుండా కేకలు వేసేది కూడా అమ్మ పైనే!
అసలు వీడు తప్పు చేసాడు ఇప్పుడు వీడిని క్షమించాలి అని కూడా ఆలోచించక , క్షమించేది అమ్మే!

ఇంకా అమ్మఅంటే తెలుస్కోవాలా?

Tuesday, November 18

జీవితం లో నేను అంటే ఒకటి ,,,అందరిలో ఒకటి కాదు...

జీవితంలో  అందరూ పుడతారు,

కాని దానికి ఒక అర్ధం పర్ధం ఉండకుండా ఎన్నో జీవితాలు ఉన్నాయి...

నేను ఇన్ని రోజులు నేను కూడా పుడింగి నే అనుకున్నాను...

కాని ఎం లాభం ....నేను కూడా సామాన్యుడినే...

నేను అందరిలానే భూమి మీదకు వచ్చాను...

నేను నా జీవితం సంపాదన.....

పెళ్ళాం ,పిల్లలు ...

తరువాత మనుమలు మనుమరాళ్ళు...

సంతృప్తి .....

అంతే ఇంకేం లేదు చెయ్యడానికి....


నో ఇలాగ ఉండకూడదు ....నేను అంటే ఒకటి ,,,అందరిలో ఒకటి కాదు...

అనేది నా కోరిక ....

దీన్ని ఇలాగే సజీవంగా ఉంచాలి ....

లేకపోతే అందరిలో నేనోక్కడిగా మిగిలిపోతానేమో......

అసలు నేనెవరు ? ఇందుకు ఇక్కడికి వచ్చాను అనే ప్రశ్న తో నా కోరిక ను నేరవేర్చాలనుకుంటున్నాను..

ఇంతకి నేనెవరు...?

Monday, November 17

నా చుట్టూ ఆవరించిన నీ పరిమళం వెయ్యి మైళ్ళు నిన్ను గుర్తుకు తెస్తుంది..!

"ఈ కవిత నా జీవితం లో కి రాబోవు భాగస్వామి కి అంకితం"

పున్నమి వెన్నల లో నువ్వు
పులకించిపోయే నేను
మందారం లా నువ్వు మకరందం లో నేను
చెలియా నీ చెక్కిలి పై మలయమారుతం నీ నవ్వు

google image

నా చుట్టూ ఆవరించిన నీ పరిమళం
వెయ్యి మైళ్ళు నిన్ను గుర్తుకు తెస్తుంది..!
నా చేతులను పట్టుకున్న సుమధుర బంధం
తీగ లా అల్లుకున్న లత లా ,నన్ను బందించేసింది..!
నీ ప్రేమ లో కరిగిపోయే నా కోపం...
చీకట్లో కనుమరుగైపోయింది...!

ప్రళయం నీ మౌనం...ప్రపంచాన్ని కాకా వికలం చేస్తుంది...!
బడబాగ్ని నీ కోపం...దావానలమై అడవి ని మసి చేస్తుంది..!
అయినను.....?
 ఇవి ఏవి నీ దరి చేరలేదు నా కోసం...!

ఎపుడు చేస్తావు నా ఇల్లు బృందావనం...!
కోకిల పాటలు...పక్షుల కిలకిలలు ...
పిచ్చుకల కేరింతలు...
మువ్వల సవ్వడులు...
ఆనంద నందనాలు....
పచ్చని తోరణాలతో.....!
నీతో అవ్వాలి నా ప్రపంచం ...నందనవనం...!
నీవెవరో ,ఎక్కడున్నావో...
ఎపుడు నా దగ్గరికి వస్తావో...!

Sunday, November 16

అప్పుడు అలా అనుకొన్న బాబు ఎవరో కాదు నేనే...

 ఒక  అబ్బాయి అమ్మ చేతిలో చేయ్యివేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బస్సు స్టాండ్ కి వెళ్ళాడు,అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళే  బస్సు కోసం ఎదురు చూస్తున్నారు,ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు పూంగి మని చప్పుడు జేస్కుంట ఆడికి వచ్చింది,ఆ బస్సు కోసం అక్కడ చాలా మంది వెయిట్ చెయ్యడం వళ్ళ వెంటనే నిండి పోయింది,ఎలాగో అలాగా అబ్బాయికి, వాల్ల అమ్మ కు సీట్ దొరికింది,ఆ బస్సు కేవలం ఒక్క ఊరికే వెళ్ళదు కదా!

 చాలా ఊళ్ళను కలుపుకుంటూ వెళ్తుంది అందుకోసం చాలా మంది జనాలు ఎక్కుతుంటారు,అందులో చంటి పిల్లను ఎత్తుకొని తల్లి గారింటి కెళ్ళే ఆడపడుచు కోసం సీట్ కోసం వెదికే కన్నతల్లి ఆరాటం,అప్పుడే అక్కడున్న ఒక పెద్ద మనిషి ఆవిడ కి సీట్ ఇచ్చేసి గొప్ప దానకర్ణుడిలా పోస్ కొట్టడం,ఇంకో ఆవిడ చిల్లర డబ్బుల సంచి ఒక వైపు ,ఆవిడ మొగుడు ముసలోడిని లాక్కుంట వచ్చి ముసలాయినకు సీట్ లోకూర్చో బెట్టింది,ఇవ్వన్ని అర్ధమయ్యే వయసు కాదు ఆ బాబుది అప్పుడు ....కాని వీల్లెందుకు ఇలా ఉన్నారు అని మాత్రం అనుకున్నాడు.

    తన మొత్తం దృష్టి డ్రైవర్, అక్కడున్న స్టీరింగ్ ,గేర్ రాడ్ ల మీద మాత్రమే,తనని ఎవరు ఏమి అనరు అని గట్టిగా అనిపిస్తే తనే ఆ బస్సు డ్రైవర్ కావలనుంది ఆ పిల్లాడికి,కాని ఎం లాభం అమ్మ గట్టిగ పట్టుకొంది...

         ఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ అనేసి, బాబు నీ వయసెంత ?అని పూర్తిగా అడగకముందే నాకు 10 ఎండ్లండి...
అని కండక్టర్ ని మోసం చెయ్యకుండా వాళ్ళమ్మ కరెక్ట్ టికెట్ తన కోసం తీసుకోవాలని(అది దేశభక్తి అని అపుడు తెలియని వయసు),నన్ను కూడా కొందరు గుర్తిస్తున్నారు అనే చిన్న ఆనందం ....
    మనం సాధారణంగా ఎవైనా పనులు మనకోసం చెయ్యము ,ఎవరైనా గుర్తించి తీరాలని చేస్తాము 
     
 అంతలోనే వాళ్ళ అమ్మమ్మ ఊరు కు వెళ్ళే స్టాప్ వచ్చేసింది,ప్చ్ అసలు నన్ను డ్రైవ్ చెయ్యమని ఎవరైనా అడిగితే బాగుండు అనుకొని అదోలాగ బస్సు దిగేసాడు.

     అంతలోనే వాళ్ళ అమ్మ తనని తీసుకొని నడవడం సాగించింది,ఎందుకంటే ఇంకా 2km నడవాలి,ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు,పిల్లాడికేమో తెలియదాయె,200మీ. దూరం నడవగానే పిల్లాడి లేత కాళ్ళు నొప్పి పెట్టడం మొదలయ్యింది,
     అమ్మా ఇంకా ఎంత సేపే నడవడం?
     అపుడు అమ్మ ఇంకా కొంచెం దూరం నడిస్తే సరిపోద్దిరా!
    అంటే పాపం అమ్మకు కూడా కాళ్ళు నొప్పెడతాయి కదా! అనుకొని,  అలాగే అంటూ అమ్మా చేతిలో చెయ్యి వేస్తూ,చిన్న చిన్న అడుగులతో  నడుస్తూ ఎప్పటికైనా ఈ దూరాన్ని నడవకూడదు ,పెద్దైనాక ఒక కార్ కొనాలి అపుడు ఇంత కష్టపడి నడవాల్సి ఉండదు,అని అనుకొన్నాడు.

అప్పుడు అలా అనుకొన్న బాబు ఎవరో కాదు నేనే...!

       ఈ పోస్ట్ రాయడానికి కారణం ఈ మధ్య నాకు ఒక తల్లి ,తన బాబు ను చేతిలో పట్టుకొని నడుస్తూ  కనబడింది, ఈ సీన్ లు ఎప్పుడు కనబడుతూ ఉంటాయి,అప్పటి సీన్ గుర్తు వచ్చింది,పిల్లాడు కూడా నాలాగే తను పక్కన పోయే వాహనాలను చూస్తూ నా లాగే కచ్చితంగా అనుకొని ఉంటాడు,ఉండాలి,అపుడు మాత్రమే తనలో కసి పెరిగి కచ్చితంగా వాళ్ళ అమ్మని ఎదో ఒకరోజు తన కార్ లో ఎక్కించుకుంటాడు
   
       15 సంల నుండి జనాల కష్టాలు మారలేదు,కాని పాత్రలు మారాయి,అపుడు నేను ,ఇపుడు ఈ పిల్లాడు,15 సం లే కాదు తర తరాల నుండి కష్టాలు కష్టాలే,ఇవి ఎలా తీరుతాయి అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న!

         నాకు తెల్సి కేవలం చదువు మాత్రమే జనాల తల రాతలను మార్చుతుందనుకుంటాను,నాలాగా!

Saturday, November 15

సహాయం చేసి ఇది నేనే సహాయం చేశాను అని పబ్లిసిటీ ఇవ్వకూడదు!

ఈ క్రింది వీడియో నాకు నచ్చింది,ఒక చిన్న పిల్లగాడు తనకు ఎంతో ఇష్టమైన వస్తువులను 
త్యాగం చేసి ఒక ముసలావిడకి తానెవరో కూడా తెలియకుండా సహాయం చేసాడు 


ఈ వీడియో నుండి నేను నేర్చుకున్నవి
  • సహాయం చేసి ఇది నేనే సహాయం చేశాను అని పబ్లిసిటీ ఇవ్వకూడదు
  • సహాయం ముందు మిగతావి అన్ని చిన్నవిషయాలు
  • తప్పు చేసిన వారిని అర్ధం చేసుకోవాలి
ఇంకా ఏమైనా ఉంటే చెప్పగలరు!
 click here to veiw for best post

Friday, November 14

మీకు ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా?

05:29 Posted by srinivas No comments
చిన్నప్పటి నుండి నాకొకటి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.
ఏంటంటే నా చుట్టూ ఏదైనా జరుగుతుంటే దాని గురించి ఫుల్  ఇన్ఫర్మేషన్ నాకు ఆటోమేటిక్ గా వస్తుంటుంది,
ఫర్ Ex:

  1. Dinosaurs lesson మాకు ఆ రోజే సర్ చెప్పారు,ఆ టైం లో  "Jurassic Park" మూవీ రిలీజ్ అయ్యింది , చూసాను.
  2. The curse of tutankhamun lesson  టైం లోMUMMY  movieరిలీజ్ అయ్యింది ,చూసాను,
  3. TITANIC lesson టైం లో TITANIC   మూవీ చూసాను,
  కేవలం మూవీస్ మాత్రమే కాదు నిజ జీవితం లో కుడా అలాగా జరుగుతుంటాయి,

మనం ఏదైనా తప్పు చేసే ముందు కూడా అలాంటి తప్పు చేసేవాళ్లు కనపడుతుంటారు,అపుడు మనం వాళ్ళని

చూసి మనం చేయబోయే తప్పు తప్పా లేక ఒప్పా అని తెలుస్తుంది,


అలాగే నేను ఎక్షామ్ రాసే టైం లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ టైటిల్స్ లేదా ఎవరైనా సైంటిస్ట్ గురించి తెలుసు కోవాలి

అంటే మన కోసమే అన్నట్టు  డైలీ న్యూస్ పేపర్స్ లో వాళ్ళ గురించి రాతలు వస్తూ నాకు  పనికొచ్చేమొత్తం

సమాచారం తెలుస్తుంది, ఇవి ఎక్ష్ప్రెస్స్ చెయ్యలేం కాని నా కోసం మాత్రం సమాచారం రెడీ గ ఉంటుంది నేను

తెల్సుకోవడానికి,

మీకు ఇలాంటి అనుభవాలు జరిగి ఉంటాయి ,ఆలోచిస్తుంటే బలే ఫన్నీ గా అనిపిస్తూ ఉంటాయి,

వాస్తవానికి ఇలా ఎందుకు జరగుతుందని సైకాలజిస్ట్ ల భాషలో చెప్తుంటే

"మనం మనకు కావలసిన సమాచారాన్ని తెలుస్కోనే ప్రయత్నం మన అంతరంగం లో కూడా జరుగుతుంటుంది,

అది మనకి కావలసిన కీ వర్డ్స్ ని ఆటోమేటిక్ గా గుర్తించి సమాచారం ఇస్తుంది తప్పా మనకోసం ప్రత్యేకించి రాదు.

సమాచారం ఎప్పుడూ ఉంటుంది,కాని మనమే గుర్తించం ,కాని అవసరమైనపుడు గుర్తిస్తూ ఉంటాం, "

సరే ఏదేమైనా మనకోసమే సమాచారం ఎదురు చూస్తూ ఉందని భావించడం , మనకోసం ఎవరో

ఎదురుచూస్తున్నారు,అని అంటే మనము కూడా ఎంతో కొంత పనికి వచ్చే వాళ్ళం అనే కదా!

అమ్మా నాన్న ల ఉత్తరం   "నిన్నటి పోస్ట్ కోసం ఇక్కడ నొక్కండి"


Thursday, November 13

నీకు గుర్తుందా నీ చిన్నపుడు నీ టెడ్డి బేర్ గురించి నువ్వు చెప్పే ప్రతికథ నేను వినే వాడిని

07:30 Posted by srinivas 2 comments

ప్రియమైన నా పాపా /బాబు కి,

నేను ముసలి అయిపోతే నన్ను అర్ధం చేసుకొని నాతో ప్రేమ తో సహనంతో ఉంటావు అనుకుంటాను

ఒక వేల నేను పళ్ళెం పగులగొడితే,లేదా సూప్ ని టేబుల్ పైన ఒలక పోస్తే నా పైన అరవకూడదు అనుకుంటాను

ఎందుకంటే నా కళ్ళ చూపు మందగించి ఉండోచ్చు

ముసలి వాళ్లు చాల సున్నితంగా ఉంటారు,నువ్వు అరిస్తే వాళ్ళకి వాల్లే జాలి పడతారు

ఒకవేళ నువ్వు చెప్పినది నాకు చెవులు వినపడక ,వినపడక పోతే చెవిటోడు అని తిట్టకు,

దయ చేసి మరో సారి చెప్పు లేదా రాసిచూపించు!

నేను ముసలి  అవుతున్నాను,నా కాళ్ళు బలహీనమై పోతున్నాయి,

నేను లేవడానికి సహనం తో సహాయం చేస్తావు అనుకుంటున్నాము


ఎలాగంటే నువ్వు చిన్నపుడు నడక నేర్చుకుంటున్న సమయం లో నేను నీకు సహాయం చేసినట్టు

దయ చేసి నన్ను భరించు

నేను అరిగి పోయిన రికార్డు లాగ వాగుతూ ఉంటే నువ్వు వింటూ ఉంటావనుకుంటున్నాను

కాని నా  వాగుడు చూసి ఎగతాలిచెయ్యకు లేదా వినడం వృధా అనుకోకు  

నీకు గుర్తుందా నీకు బెలూన్ కావాలి అన్నపుడు ఎం చేసావో

అది కొనిచ్చే వరకు ఎన్నిసార్లు అడిగి అల్లరి చేసావో

నన్ను క్షమించు నీకు నా దగ్గర ముసలి వాసన వస్తే,స్నానం చెయ్యమని పదే పదే చెప్పకు 

నాకు ఓపిక ఉండదు ఎందుకంటీ నా శరీరం బలహీనమైపోయింది 

పైగా నాకు తొందరగా జలుబు చేస్తుంది,

నీకు గుర్తుందా నీ చిన్నపుడు నువ్వు స్నానంచెయ్యనని మారం చేస్తే 

 నీ చుట్టూ తిరిగి నీకు స్నానం చేపించే వాణ్ణి,

నేను చాదస్తం చేస్తూ ఉంటే కొంచెం మాతో ఓపిక గా ఉండు

ముసలి వాళ్లు అయ్యేటపుడు ఇలాగే చేస్తారు

నీవు ముసలి అయ్యేటపుడు ఇది అర్ధమౌతుంది 

నీకు సమయం ఉంటే నాతో మాట్లాడటానికి కొన్ని నిమిషాలైన సమయమివ్వు 

నేనిపుడు ఎపుడూ ఒంటరి గానే ఉంటున్నాను ,పలకరించే వాళ్లు లేక

నాకు తెలుసు నీవు పని ఒత్తిడి లో ఉన్నావని!

నా సోది వినే ఓపిక లేక పోయినా ,దయచేసి నీవు నాతో కొంచెం సమయం గడుపు

నీకు గుర్తుందానీ చిన్నపుడు నీ టెడ్డి బేర్ గురించి నువ్వు చెప్పే ప్రతికథ నేను వినే వాడిని!

నేను మంచాన పడిపోయినపుడు నన్ను జాగ్రత్తగా చుసుకుంటావనుకుంటున్నాను 

నన్ను క్షమించు !నేను బెడ్ ని తడిపినపుడు లేదా పాడు చేసినపుడు

నన్ను నువ్వు జాగ్రత్త గా చూసుకుంటావనుకున్తున్నాను నా చివరిక్షణాలలో....

నేను ఎలాగో నిన్ను ఎక్కువ రోజులు కష్ట పెట్టను...

నేను చని పోయేటపుడు నా చేతులను పట్టుకొని నాకు చావు ఎదుర్కొనే ధైర్యం కలిగిస్తవనుకుంటున్నాను

బాధ పడకు నేను దేవుణ్ణి కలిసాక  నీ గురించి దేవునికి చెవిలో చెప్తాను నా పాప/బాబు ని  ఆశీర్వదించమని

ఎందుకంటే నువ్వు అమ్మా నాన్నలను ప్రేమించావని

ధన్యవాదాలు నీ ప్రేమకు

మేము నిన్ను చాలా ప్రేమిస్తుంటాము

ప్రేమతో 
నీ అమ్మా నాన్న  

ఇది నేను కాపీ కొట్టాను,వీడికింత సీన్ లేదు ,అని మీరనుకున్నది కరెక్టే,కాని ఇది  నాకు చాలా బాగా నచ్చినది,
మీతో 
షేర్ చేసుకోవాలనిపించింది,నా ఆనందాన్ని,అందుకే నా ఆనందం ,నా నవ్వు మిమ్మల్ని ఆలోచింప చేసినందుకు ...
నా
 ఆనందం నా నవ్వు మీ జ్ఞాపకాలను మీకు  గుర్తు చేస్తున్నందుకు ....

క్రింది వీడియో చూడండి