ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, July 11

మా అక్క వాడిని చావగొట్టాల్సిందా?

వీదిలో  పిల్లలు ఆడుకుంటున్నారు ...
సుబ్బు గాడు దొంగ  ...వస్తున్నాడు
నన్నుపరుగెడుతూ... అవుట్ చెయ్యాలి
నన్ను అవుట్ చేసాడు సుబ్బు గాడు...
ఇప్పుడు దొంగ నేను కావాలి,  కాని నాకు దొంగ రావడం ఇష్టం లేదు...
అందుకే నేను అవుట్ కాలేదు అని చెప్పను...
అంతే  ఆటలో గొడవ స్టార్ట్ అయ్యింది...
ఇద్ద్దరం కొట్టుకుంటున్నాము..
అంతలో  మా అక్క వచ్చింది...
మా ఇద్దరినీ గొడవ ఆపడానికి ప్రయత్నించింది..
అంతే సుబ్బు గాడు మా అక్క చెయ్యిని కోరికేసాడు ...పారిపోయాడు ...
నేను వెంట పడిన దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు...
ఇంటికి వచ్చాము...అక్క చేతికి కట్టు కట్టారు...
అపుడు మా బాబాయి అన్నాడు ...వాడిని చావకొట్టాల్సింది..మరోసారి ఎవరితోనూ గొడవ పడడు..

అపుడు మా అక్క ఇలాగ అన్నది "సుబ్బు గాడి తప్పేమీ లేదు బాబాయి"
అంత లో మా పిన్ని ఈ అమ్మాయి ఒట్టి పిరికిది ...అనవసరంగా గొడవలోకి వెళ్ళింది...
అయినా ఎవరైనా తమ్ముడి వైపు ఉండకుండా సుబ్బు గాడి వైపుకు మాట్లాడతారా?అని తిట్టారు

మా అక్క వాడిని చావగొట్టాల్సిందా?
మా అక్క పిరికిదా?
మా అక్క గొడవలోకి వేల్లకూడదా?
మా అక్క సుబ్బు గాడి వైపు మాట్లాడకూడదా?

Sunday, July 5

నాకేం కావాలో తెలియడం లేదు..!

ఏది కావాలో ఏది వద్దో ?
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ?
ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ?
ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ?
ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ?
ఏమనాలో ఏమనకూడదో ?
ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ?
ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ?
ఎందరు నాతో వస్తారో ఎందరు రారో ?

అని భయపడితే ....జీవించడమే భారంగా తోస్తుంది
అపుడు ఇలా ఆలోచిస్తే
జీవితం  లో ఆనందం నాతోనే ఉంది 
నాకు కావలసింది నాకోసం ఉంటుంది
నా అవసరం నేనేం చెయ్యాలో నాకు చెప్తుంది
నేను మంచి వాన్నైతే అందరు మంచివాళ్ళే
ప్రపంచం లో ప్రతి వస్తువు నాకోసమే అమర్చబడి ఉంది,దాన్ని సాధించుకోవాలి
ప్రేమతో నేనేం చెప్పినా నిజమౌతుంది 
అప్పుడు ఎక్కడున్నాప్రశాంతంగా ఉంటుంది
ముందు నన్ను నేను నమ్ముతాను 
అప్పుడు అందరు కలిసి నాతో వస్తారు 
ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రేమ మయం

Saturday, June 20

ప్రేమశాతం:ఒక చిన్న పాప -ఒక నాన్న

ఒక చిన్న పాప  తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి
చాలా చాలా  ఎదురుచూస్తోంది...
మాటి మాటి కి ఇంటి door వద్దకు వెళ్లి మల్లి లోపలకి వచ్చి clock వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది...
వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఏఎ రోజు కాళ్ళు ఒక చోట నిలబడడం లేదు ...
అని అనుకుంటూ తన పని తను చేసుకుంటుంది...
కాని నాన్నగారు రాలేదు...
సమయం 6 అయ్యింది..వాళ్ళ అమ్మ హోం వర్క్ చేసుకో నాన్న గారు వస్తారు లే అని చెప్పింది..
పాప ఎప్పుడు 8pmవరకు కూడా తెమలని హోం వర్క్ 6-30pm లోపే చేసేసింది...
ఇంతలో బైక్ సౌండ్ వచ్చేసింది..వెంటనే పరుగేత్తుకేల్లింది...కాని వచ్చింది మామయ్య...
వెంటనే ఎప్పుడు మామయ్య చేతుల వైపు ఆనందంగా చూసే పాప వీడెందుకు వచ్చాడురా...
ఇప్పుడు అని ఒక పేస్ పెట్టేయ్య గానే ...
మామయ్య తన చేతిలోని చాక్లెట్లుఇచ్చినా వాటిని ఎదో అల తీసుకొని bye మామయ్య అని చెప్పేసింది...
ఇంతలో వాళ్ళ అమ్మ కలుగ జేసుకొని వాళ్ళ నాన్న గారి బర్త్ డే ఈ రోజు...

అది వాళ్ళ నాన్న గారికి ఒక గిఫ్ట్ తయారు చేసింది...
అది ఇవ్వాలని తెగ ఇదయి పోతోంది...
అపుడు మామయ్య ఏది ఆ గిఫ్ట్ నేనొకసారి చూస్తాను...
అంటే noo...ఇది ముట్టకూడదు...
ఇది నాన్న గారే ఓపెన్ చేసుకోవాలి..
అమ్మా నువ్వు కూడా ఓపెన్ చెయ్యకూడదు...గిఫ్ట్ ను చూడకూడదు...అని వార్నింగ్ ఇచ్చింది...
అప్పటికే 7-30pm అయ్యింది...
ఆ గిఫ్ట్ ని అలాగే పట్టుకొని పడుకునిపొయ్యింది...
నాన్న గారు రాత్రి 9కి వచ్చారు ...
పాప పడుకొని ఉంది...
అపుడు వాళ్ళ అమ్మ ఎంటండి?పాప మీకోసం ఎంత ఎదురు చూసింది...
మీరు ఈ రోజే లేట్ గా వచ్చారు..
అదిగో ఆ గిఫ్ట్ మీకోసం తయారు చేసింది..చూడండి...అని చెప్పేసి వెళ్ళిపోయింది...
అపుడు వాళ్ళ నాన్న గారు గిఫ్ట్ చూసారు..
అది చాల beautiful బ్లూ కలర్ లో రెడ్ రిబ్బన్ తో విత్ all మై love
అని రాసి ఉన్న ఒక అందమైన డబ్బా ...
ఓపెన్ చేసి చూసాడు..
ఆశ్చర్యం అందులో ఏమి గిఫ్ట్ లేదు...
నాన్న గారికి కొంచెం అసహనం వచ్చింది..
సర్లే పోనీ అని రేపు మార్నింగ్  అడుగుదాం అనుకొని కాస్త అసహనం తో పడుకుండి పోతాడు
తెల్లవారి పాప నిద్ర నుండి  లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఓపెన్ చేసారా ?అంటుంది
అప్పుడు వాళ్ళ నాన్న ఆ గిఫ్ట్ లో ఏమి లేదు కదా? అని అడుగుతాడు
అపుడు ఆ పాప ఇలా సమాధానం ఇస్తుంది

"నేను అందులో బోలెడన్ని ముద్దులు పెట్టి అవి మీకు మాత్రమే అందేలా ప్యాక్ చేసాను" అని చెప్తుంది

అప్పుడు వాళ్ళ నాన్న ఒక్క క్షణం నిశ్చేస్టుడై ,తన బంగారు తల్లి ని అపార్ధం చేసుకున్నాను అనుకొని
పాపకు ముద్దు పెడతాడు...
పిల్లల్ని అర్ధం చేసుకోవడం కష్టమైన పని
వాళ్ళను వాళ్ళ పనులను అర్ధం చేసుకోవాలనుకొంటే  మనం పిల్లల్లా ఆలోచించాలి
అంటే పిల్లల్లాగా స్వార్ధ రహితంగా  స్వచ్చంగా  ఆలోచించాలి
(ఈ కథ సేకరించబడినది)
హ్యాపీ ఫాదర్స్ డే


Tuesday, May 26

ఆనందమా నీ వెల ఎంత ?

05:31 Posted by srinivas No comments
నేను మొన్న మా  మేన కోడలి బర్త్ డే కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ....
అక్కడ  గ్రాండ్ గానే బర్త్ డే జరిగింది ... డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు...
చుట్టూ పక్కల జనాలు ,చుట్టాలు...ఫ్రెండ్స్..అందరూ...వచ్చారు ..
బల్లూన్స్...ఫ్లవర్స్ ...స్టేజి ....పిల్లలతోకోలహలం
డాన్స్ ప్రోగ్రామ్స్...etc
గిఫ్ట్స్ తెచ్చారు...చాక్లెట్లు కేకు లు భోజనాలు...
ఒక పండగలా జరిగింది...
కావున అందరూ ఆనందంగా ఉన్నారు...

    అసలు టాపిక్ లోకి వస్తే

        మరుసటి రోజు నేను ఇంటికి బస్సు లో సాయంత్రం గం||6 రిటర్న్ అయ్యాను....బస్సు ఫెసిలిటీ ఆ వూరికి సరిగా ఉండదు...అపుడే వచ్చింది ఒక బస్సు,అది ఆర్డినరీ బస్సు..సరే అని ఎక్కేసాను

ఆ బస్సు ప్రతి ఊరి వద్ద ఆగుతూ ఎండలో,కిక్కిరిసి పోయి చెమట వాసనలతో నాకు చిరాకు తెప్పిస్తోంది

 
       అంతలోనే ఒక యువకుడు బస్సు లోకి ఎక్కాడు...ఆ క్షణం లోనే నా పక్కనే సీట్ లో ఉన్న ఆయన లేచి వెళ్ళాడు ...ఆ యువకుడు  వెంటనే   వచ్చి నా ప్రక్కనే కూర్చున్నాడు..నాకు అతను నచ్చలేదు..ఏంటో నాకు జనాలు చూడగానే నచ్చాలి... అపుడు మాత్రమే నేను వాళ్ళతోనే ఫ్రెండ్లీ గా ఉండగలుగుతాను...  అతని చేతిలో ఒక కవర్ ప్యాకెట్ ఉంది...
నాకేమో కొత్త వారితో సరిగా మాట్లాడాలనిపించదు.....నేను అడగకుండానే మాట్లాడుతూ ఉన్నాడు...
అతని చేతిలో ఉన్న ప్యాకెట్ లో రూ||150 విలువగల కేకు ఉందని,చాకొలేట్సు ఉన్నాయని ... ఆ రోజు తన కూతురి పుట్టిన రోజు అని ...వెళ్లిన తర్వాత నా కూతురు చాల సంతోసిస్తుందని చెప్పాడు ,అప్పుడు నేను తన ముఖం లో వెలిగే   చాలా ఆనందాన్ని కనుగొన్నాను.ఏదైతే నేను ఇప్పటివరకు ఏ బర్త్ డే లో కనుగోనలేదో?
   


         కూలి పనులు అవి చేస్తాడంట మాట్లాడుతూ తెలుసుకున్నాను...తనకు ఆ రోజు కూలి రూ||300... దాంట్లో సగం ఖర్చు పెట్టగలిగాడు.ఇంతలో అతని వూరు వచ్చింది దిగి వెళ్ళిపోయాడు.ఇప్పుడు తను నచ్చాడు...ఎందుకు నచ్చాడో తెలియదు .కాని నచ్చాడు..ఒక మనిషి కి ఆహార్యం చూసి విలువ ఇవ్వకూడదు అని ఎవరో చెంపమీద కొట్టినట్టు అనిపించింది

      ఇప్పుడు నాకు బస్సులో ఎండ,చెమట వాసనలు ...తెలియడం లేదు...ఆ కిక్కిరిసిన బస్సు అందంగా కనబడుతుంది
అప్పుడు అనిపించింది ఆనందం కనిపిస్తే ఆనందాన్ని అడగాలని
ఆనందమా నీ వెల ఎంతా? అని



150 రూపాయలా ?లేదా అంతకన్నా ఎక్కువా?



Monday, May 4

ప్రేమ మార్గం బౌద్ధ మార్గం

సిద్ధార్థుడు  క్షత్రియుడు అయినప్పటికీ ఆ కాలం లో ఉండే సామాజిక వర్ణ వ్యవస్థను ...మూడాచారాలను...అనైతిక ధర్మాలను చూడలేక వదిలి పెట్టడం వల్లే సామాజిక అంతరాలు తొలగిపోతాయని ,అన్ని అప నమ్మకాలను వదిలేసి తపస్సు చేయడం ఆరంభించి ఇప్పుడున్న బుద్ధ గయ వద్దగల బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు తన బోధనలో ప్రజ్ఞ ,కరుణ, శీలం లను బోధించిన మహానీయుడు
 బుద్ధుడు ఆ కాలం లో సామాజిక అంతరాలను తొలగించుటకు తన బోధనలు విశ్వ వ్యాప్తం చేసాడు
 ఇపుడు ఐక్య రాజ్య సమితి ఈ ప్రపంచం లో మానవీయ విలువలు కలిగి అతి ఉత్తమమైన ధర్మం బౌద్ధ ధర్మం అని ప్రకటించింది
ఎందుకంటే ఇక్కడ బుద్ధుని బోధనలలో కేవలం తర్క బద్ధమైన మానవీయత మాత్రమే ఉంది
అందుకే భారత దేశాన్ని పాలించిన మౌర్యులకాలం భారతీయులకు ఒక స్వర్ణ యుగం..

పుష్య మిత్ర శుంగుడు మల్లి ఆ సామాజిక అంతరాలను చిట్ట చివరి మౌర్య రాజును చంపేసి తీసుకురావడం జరిగింది

    అ తర్వాత వచ్చినవారు మన దేశం లో పుట్టిన బౌద్ధం లేకుండా చేసారు,మల్లి మనిషికి మనిషి కి మధ్య అంతరాలు ,స్వార్ధం కుల పిచ్చి మన దేశం లో వెళ్లి విరిసింది.

             అయినా, ప్రేమ కు పుట్టినిల్లయిన భారత దేశం మళ్ళి తనలో ప్రేమను నింపుకుంటుంది


"నేను అనే ఇగో ను ,కావాలి అనే కోరిక ను తీసేస్తే మిగిలేదే సంతోషం" 


                                        "ఇష్టం అంటే వాడుకోవడం ,కాని ప్రేమ అంటే కాపాడుకోవడం"



         "భారతదేశం పూర్వ వైభవాన్ని , ప్రతి మనిషిలో ప్రేమను ,అహింస ను సాదించు గాక!"
          బుద్ధ పౌర్ణిమ సందర్భంగా   బుద్ధ జయంతి  శుభాకాంక్షలు
బుద్ధం శరణం గచ్చామి!             దర్మం శరణం గచ్చామి!!                 సంఘం శరణం గచ్చామి!

   

Tuesday, April 21

పక్కోడి జీవితం -పండగ

నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను...
పైకి మాత్రం అలాగా కనపడను..?

ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ...
అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు
వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తాను వెయిట్ చెయ్యు అని వెళ్ళిపోయాడు
ఫోన్  దాన్ని ఓపెన్ చేసి వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేసిన సంభాషణను చూసి మస్తు గా ఎంజాయ్ చేస్తూ చదవ సాగాను...అలా మొత్తం చదివేసాను...
అప్పుడు వాడి గురించి ఆలోచించాను
వాడి గురించి కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
మా ఫ్రెండ్ ఇంకా రాలేదు


ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు నా గురించి ఆలోచించాను
నా గురించి కూడా  కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
అసలు నేను ఎందుకు వాడి అనుమతి లేకుండా ఫోన్ తీసాను?
ఎందుకు ఇంటరెస్టింగ్ గా వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చదివాను?
ఎగ్జైట్మెంట్ గా ఎందుకు ఫీల్ అయ్యాను?అంటే ఒక్కమాటలో శునకానందం ఎందుకు పొందాను?
అంతే కాకుండా వాడి గురించి ఆ రకంగా ఎందుకు అనుకున్నాను?నేనేదో గొప్ప వాడి నైనట్టు?
వాడు చేస్తున్నది తప్పు అయితే వాడిని సరిదిద్దోచ్చుగా అందుకే చదివానా?
అసలు వాడు చేసేది తప్పు అని నాకు ఎలా తెలుస్తది ?
ఈ ప్రపంచం లో ఎవరిదైనా తప్పు అని ఎవరైనా చెప్పగలరా?
కేవలం మనల్ని మనం తప్ప?ఎందుకంటే ప్రతి వారికి ఒక కారణం ఉంటుంది ఒప్పు చేసుకోవడానికి
కాని మన మనసుకు ఒక  కారణం చెప్పి ఒప్పించుకొనే ధైర్యం దాన్ని మోసం చేస్తే తప్ప ఉండదు!
ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకోవడం అంటే "మా ఫ్రెండ్ ని తప్పు వాడిని సరిదిద్దాలి అనుకోవడం"
అదే నాది తప్పు అయితే "నేను అసలు వాడి ఫోన్ ను ముట్టడం "
అంటే నాదే తప్పు....
వాడిది తప్పు అయితే వాడు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాడు కదా!
అప్పుడు వాడు అది తప్పో ఒప్పో తెలుసుకోలేనంత ముర్ఖుడేం కాదు గదా!


Thursday, April 9

bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!

ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను
క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు
దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని
వాడిని అడిగితే వాడు కూడా సేమ్ డైలాగ్..నా ఇగో హర్ట్ అయ్యింది
ఇలాగ కుదరదని బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగితే క్రెడిట్ వోచేర్ ఇచ్చాడు...
ఇప్పుడు cahsier ఇగో హర్ట్ అయ్యింది.

వాడి చేతిలో అవకాశం ఉంది గా

నేను vocher నింపే లోపల వెంటనే లాస్ట్ పర్సన్ cash తీసుకొని క్లోజ్ బోర్డు పెట్టాడు ...
నేను వెళ్లి డిపాజిట్ తిస్కోండి అన్నాను ..
వాడు ఇందాకే చెప్పాను  గా టైం అయిపోయిందని అని మల్లి careless జవాబు
ఇస్తూ వాడి దగ్గర స్టాక్ పెట్టుకొన్న వోచేర్స్ పాస్ చేస్తున్నాడు

నా ఇగో మళ్ళి మళ్ళి hurt అయ్యింది..


బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్దామంటే వాదేక్కడికో లోపల ఆడిటింగ్ లోకి వెళ్లి తగలడ్డాడు

అయిన వాళ్ళ వాలకం చూస్తుంటే మేనేజర్ ని కూడా ఒక ఆడిస్తున్నారు అనుకుంటాను

సరే వెయిట్ చేద్దాం అనుకుంటే సెక్యూరిటీ అక్కడ ఉన్నవాళ్ళందరినీ వేల్లగోడుతున్నారు.
వాళ్ళకి నేను మేనేజర్ తో మాట్లాడాలి అని చెప్పినపుడు
మీరు ఇక్కడ ఉండకూడదు అని
 బ్రాంచ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చెయ్యాలని ఉచిత సలహా ఇచ్చాడు....
ఎంత బలుపు ఈ నా  క్లర్క్ లకు
నాకే ఇలా చేస్తే పాపం పల్లెటూరి జనాలతో ఈ నా సేవకులు ఎలా అడుకుంటారో...?
అంబుడ్స్మన్ కు వీళ్ళ గురించి కంప్లైంట్ చెయ్యాలన్నంత కోపం వచ్చింది..
అయినా వాళ్ళు పట్టించుకుంటారా?
అసలు వీళ్ళు 5 నిమిషాల ముందే క్లోజ్ చెయ్యడం  కర్రెక్టేనా ?
ఎమన్నా అంటే మాకు ఎంత పని ఉందొ తెలుసా ?అంటారు
భూలోకం లో వీళ్ళే పనిచేస్తున్నట్టు?
పనిలేని వాళ్ళు మిగతా వాళ్ళు అనుకుంటారేమో ఈ బ్యాంకు సేవకులు..!
ac లో కూర్చున్నాం అనుకుంటారు మాకెంత టెన్షన్ ఉంటుందో తెలుసా ?అంటారు
మరి ఎండలో పనిచేసే రైతు కన్నా కష్టమా వీళ్ళ పని.!
అసలు వీళ్ళని ఈ పని ఎవడు చెయ్యమన్నాడు?
ఎందుకు ఇక్కడకొచ్చి మా పనులను ఇబ్బంది కలిగిస్తున్నారు?
కష్టమైతే ఇంట్లో కుర్చోవచ్చు గా ,నిజంగా సేవ చెయ్యాలనుకునే చాల మంది కష్టపడే నిరుద్యోగులు లేరా?

మనకు ఇన్ని సార్లు ఇగో హర్ట్ చేసినా నోర్ముసుకొని ఉండాల్సిందేనా?
వీళ్ళని ఏం చెయ్యాలి?
అందరిని ప్రేమించు అని చెప్పే నేను
పని చెయ్యని వాళ్ళని ప్రేమించలేక పోతున్నాను ...
నా ప్రేమ తగ్గింది.!
అయిన ప్రేమించినా ప్రేమించక పోయినా వాళ్ళు అలాగే చేస్తారు