మా అమ్మ చెప్పిన చిన్ననాటి కథలు...
అని నాకు తిపించడానికే ఒక కథ ను తయారు చేసుకొని పెట్టుకుంది మరి...!
నిజంగా మనకు తెలియదు అమ్మ అలాగా కొసిరి కొసిరి తినిపిస్తుంటే మనం చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ తింటూ ఉండి ఉంటాము...ప్చ్ కాని ఏం లాభం అవేమి మనకు ఇప్పుడు గుర్తుకు లేవాయే...!
ఇంకా పండుకునేటపుడు...
చందమామ ను చూపిస్తూ డాబా పైన చందమామలో పేదరాసి పెద్దమ్మ కథ....గుర్తుంది కదా!
పేదరాసి పెద్దమ్మ నూలు వడుకుతూ ఉంటుంది....అనేకథ చెప్తూ ,చందమామ లోకి మనుషులు వెళ్తున్నారు తెలుసా? అని అడిగితే
నేను నేను కూడా వెళతాను ,...నిన్ను డాడి ని తీసుకొని అక్కడికి వెళ్తాను అని చేప్పేవాడినంట..!
అప్పుడు ఇప్పుడు లా కెమెరా ఫోన్ లు డిజిటల్ కెమెరా లు ఉంటె బాగుండేది...!
ఇంకా నేను స్కూల్ కి వెళ్ళడానికి కూడా కథ చెప్పాల్సి వచ్చేదట..!
అదేనండి రాత్రి చెప్పిన చందమామ కథ ని లింక్ చేస్తూ అమ్మను చందమామ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే నేను పెద్ద ఆఫీసర్ ని కావాలి ,ఆఫీసర్ కావాలి అంటే బాగా చదువుకోవాలి,బాగా చదువుకోవాలి అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి...అని చందమామ దారిలో బడి కి దారిని చూపిస్తూ...కథను చెప్తుంది.
"చందమామ ఇంటికి దారి..."ఇదే నండి...!
ఇదే నండి చిన్న పిల్లలని ప్రేమతో బడికి పంపే దారి
"చందమామ ఇంటికి దారి..."ఇదే నండి...!
ఇదే నండి చిన్న పిల్లలని ప్రేమతో బడికి పంపే దారి
కాదంటారా....?నవ్వుకోండి,కాని ఇదా చందమామ ఇంటికి దారి అని తిట్టుకోకండే?
ఇలాగ నాకు స్కూల్ అంటే ఇష్టం కలిగే దాక ఇలాగే చెప్పేదంట...
ఆ తర్వాత నేను మా అమ్మకి కథలు చెప్పడం స్టార్ట్ చేసాననుకోండి..ఇప్పుడు కూడా....;-))
అది వేరే విషయం...
చిన్నపుడు మా అమ్మ దెయ్యాల కథలు చెప్పేది కాదు,కాని పక్కింటి పిల్లలతో చెప్పించుకునేవాడిని...
మళ్ళి ఆ భయం పోవాలంటే... మా అమ్మతో మరొక కథ చెప్పించుకోవాల్సిందే కదా...
అప్పుడు చిలుకమ్మ కథ ,టక్కరి నక్క కథ ,పెద్దపులి కథ లు చెప్పెదింట....
నాకు ఊహ తెలిసినపుడు మా అమ్మ చెప్పిన ,బాగా గుర్తున్న కథ ఏమిటంటే,
ఒక రాజ కుమారుడు ,ఒక రాజ కుమారి కోసం ఏడూ సముద్రాలు దాటడం,అక్కడ ఉండే రాక్షషులను చితక్కోట్టడం,
తర్వాత రాణిని తెచ్చుకోవడం....
ఇలాగ ఉండేది...
ఆ కథలో రాజకుమారుడి ల నేను ఫీల్ అయ్యేవాడినేమో అందుకే ఆ కథ కి బాగా కనెక్ట్ అయ్యానేమో,
సో ఇది స్నేహితులారా మా అమ్మ చెప్పిన చిన్ననాటి కథలు....
Nice one sir..
ReplyDeleteధన్యవాదములు మీకు స్పందించినందుకు
Deleteచిన్ననాటి విషయాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeletethanks upendar gaaru
Deleteమీరు అందరినీ ఓసారి బాల్యంలోకి తీసుకెళుతున్నారు. మళ్లీ అలాంటి రోజులు వస్తే బాగుండనేలా గుర్తు చేస్తూ బ్లాగులోకంలో ఓ మంచి పని చేస్తున్నారు. కీపిటప్. ధన్యవాదములు శ్రీఇనివాస్ గారు.
ReplyDeleteధన్యవాదములు Kondala Rao Palla గారు.!
Delete