ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Thursday, November 20

అసలు నేనేం తప్పు చేసాను?

05:38 Posted by srinivas 7 comments
అసలు నేనేం తప్పు చేసాను? నాకైతే ఇప్పటికి అర్ధం కాలేదు

ఇంత పెద్దయ్యాక కూడా నాకు అర్ధం కావడం లేదు!

ఎందుకో తెలుసా?అయితే చదవండి...కానీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి...!

గోడలన్నీ కలర్ వేసి  పాడుచేసావెంట్రా?
"పాడు చెయ్యలేదు నాన్నగారు....గోడలకు కలర్ వేసాను"

బొమ్మల్ని ఎందుకురా ఖరాబు చేస్తున్నావు?
లేదు అమ్మ బొమ్మల్ని రిపేర్ చేస్తున్నాను!

ఏమిటిరా గిన్నెల్నిగట్టిగా కొడుతున్నావు?
నేను మ్యూజిక్  చేస్తున్నానన్నయ్య...



ఎవరికైనా మంచి నీళ్ళు తెమ్మంటే నేనే ముందుగా తేవాలని పరుగెత్తుకుంటూ నీళ్ళు తీసుకొస్తే

అన్నీకింద పడేసావెంట్రా?అని మందలింపు?

అమ్మ పిలిచిందని పరిగేత్తుకొస్తే కింద పడి దేబ్బలు తగలితే,మా అమ్మను వదిలేసి నన్ను తిడతారెందుకు?

నాన్న గారు తెచ్చిన టేప్ రికార్డర్ కడగడానికి దాని మీద నీళ్ళు పోయడం కూడా తప్పా?

పక్కింటి సుబ్బుగాడు చిన్నా గాడిని కొడితే సుబ్బుగాడిని నేను కొట్టకూడదా?

అమ్మ డ్రెస్ ఎలాగో ఉతికేస్తుంది కదా అని మట్టిలో ఆడతా ఉంటె నామీద కేకలేందుకు?

పాపం అమ్మ ఒక్కతే పని చేసుకుంటుందని , పైప్ తో  చెట్లకు నీళ్ళు పట్టేస్తుంటే,ఎందుకు తడుస్తావంటది?

వర్షం వస్తే ఇంట్లో నీళ్ళు ఎందుకు వేస్ట్ చెయ్యడం అని వర్షం లో స్నానం చేసినా తప్పే?

బాగా తినాలి అంటారు,చాక్లెట్లు కొనుకుంటాను అంటే వద్దంటారు

నాన్నగారు బయటకి వెళ్ళేటపుడు సాయం చేద్దామని(చాకలేట్లు ,ఐస్ క్రీం కొనుక్కోవచ్చు) వెళ్తానంటే

అల్లరిచేయ్యకుడదంటారు...

ప్రొద్దున లేస్తే అల్లరి అంటారని బాగా పడుకొని ఉంటె లేలెమ్మని స్కూల్ కి టైం అయిందని లేపెసేవారు..!

ఇవన్నీ నేను చిన్నపుడు చేసిన మంచి పనులు...కాదా మీరే చెప్పండి..!

వాస్తవానికి ఇక్కడ నేనేం తప్పులు చెయ్యక పోయినా నాకు దెబ్బలు పడ్డాయి ఎందుకో ఏమో?

7 comments:

  1. ఎంత బాగుంది.చదువుతుంటే మంచి చిరునవ్వుతో ముఖం,మనసు నిండిపోయింది

    ReplyDelete
  2. same ఫీలింగ్ మీ కామెంట్ తో....ఎంత బాగుంది.చదువుతుంటే మంచి చిరునవ్వుతో ముఖం,మనసు నిండిపోయింది,

    ReplyDelete
  3. నిజమేనండి మి పిల్లలకు అలా చేయకుండా ఉండండి

    ReplyDelete
    Replies
    1. తప్పకుండానండి pydi naidu gavidi గారు!

      Delete
  4. good one .

    బాలానందం ! బ్రహ్మానందం !! మార్కెట్ తెలియని మహదానందం !!!

    అందరి చిన్నారుల కామన్ ప్రశ్నలకు జవాబివ్వగల పెద్ద 'మనసు'లెందరు?

    ReplyDelete
    Replies
    1. అవునండి !స్పందించినందుకు ధన్యవాదాలు!, మరియు మీ కొటేషన్
      "బాలానందం ! బ్రహ్మానందం !! మార్కెట్ తెలియని మహదానందం !!! "
      బాగుంది,

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..