ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Saturday, November 29

ప్రేమ శాతం-ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...ప్రేమ శాతం:serial part 2
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అసలు ఒక మనిషి పుట్టినపుడు అతని లో ప్రేమ శాతం ఎంతుంటుంది...

అతను పెరిగి పెద్ద వాడయిన కొలది అది త్రగ్గుతుందా?లేక పెరుగు తుందా?

పెరిగితే నష్టం లేదు...తగ్గితేనే ప్రమాదం...అంటుందీ సమాజం...

కాని మరి సమాజం లో ఉన్న చాలా మంది ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ద్వేషమే ...ప్రేమ శాతాన్ని

డామినేట్ చేస్తుంది..

అందరికీ తెలుసు ప్రేమ శాతాన్ని పెంచుకొంటే బాగుంటుందని...అందరు ప్రేమే సత్యం ప్రేమే నిత్యం అంటారు....

అయినా ప్రేమించే ఉద్దేశ్యం ఉండదు ....ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...

ప్రేమించడం అంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలి ....మన మనసుని చాలా చాలా కష్ట పెట్టాలి...

అయితే పెంచుకోవడం ఎలా?

మొదటగా నేను అనుకున్నాను 50-50 (ప్రేమ- స్వార్ధం) ఉన్నాయి అని

ఈ శాతం నాకు ఉహ తెలిసే వరకు ఉండి ఉంటుంది..

నా పక్కన కూర్చున్న అబ్బాయి కి బలపం లేకపోతే నేను ఇచ్చాను,ఏమీ ఆశించకుండా?

లంచ్ టైం లో  మా అన్న వచ్చి తిట్టాడు నీకు అంత పెద్ద బలపం ఇచ్చాను అప్పుడే అయిపోయిందా అని?

అపుడు నా పక్కనే కూర్చున్న మరొక అమ్మాయి చెప్పింది.. మా అన్నయ్య కి ,నేను వేరొక అబ్బాయికి నా బలపం

కొంత ఇచ్చాను అని,


అంతే మా అన్నయ్య నన్ను తిట్టేసి నీకు వాడు ఎప్పుడైనా బలపం ఇచ్చాడా?నువ్వెందుకు ఇచ్చావు అని ..!

అపుడు   ప్రేమ51- స్వార్ధం 49 గా మారిపోయింది..!

ఆతర్వాత నుండి నేనేవరికైనా నా వస్తువు ఇవ్వాలి అంటే వాడు నాకు గతం లో ఏమైనా ఇచ్చాడా? అని అలోచించి

వాడికి సహాయం చేసేవాడిని...!

ఈ రకంగా నేను స్వార్ధం లో తొలిమెట్టును ఎక్కాను....రేపు మల్లి కలుద్దాం...

మీ అభిప్రాయలు తప్పక తెలియ చేయగలరు.... READ MORE
Reactions:

4 comments:

 1. :)) నిజాయితీగా చక్కగా వ్రాసినట్లున్నది. ఆసక్తికరంగా తరువాత పోస్టుకోసం చూస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. కొండల రావు గారు ,మీ అభినందనలకు ధన్యవాదములు

   Delete
 2. ప్రేమించాలంటే మన మనసుని ఎందుకు కష్టపెట్టుకోవాలి అండి?

  ReplyDelete
  Replies
  1. నిజాయితి గా ప్రేమించి చూపండి

   Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..