ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, November 7

చిన్నపుడు అమ్మంటే ప్రేమా....?

ఏంటో నా ప్రపంచం లో
చిన్నపుడు అమ్మంటే ఇష్టం ప్రేమా...
తన మాట వింటుంటే ధైర్యం...@
తను నవ్వితే కరుణ :)
తనతోనే ఉంటే నాకు గుర్తింపు $
తనంటే నాకిష్టం నా కోసమే ఆలోచిస్తుందని....!
ఈ ప్రేమ ఇప్పుడు ఇలాగే ఉందా ? లేకుంటే  ఇలాగే ఎందుకు లేదు...!?
ఎందుకంటే ....?ఏమో అలా జరిగిపోతుంది...!


ఇప్పుడేమో ఈ అమ్మాయంటే ఇష్టం  ప్రేమా....
తన మాట వింటుంటే ప్రేరణ....>
తను నవ్వితే నా వెన్నుముక లో అలల ప్రతిస్పందనలు ~~~~
తనతోనే ఉంటే నన్ను నేను మర్చిపోతాను....
తనంటే నాకిష్టం నా కోసమే ఆలోచిస్తుందని....!
నాకు తెలియదు ఈ అమ్మాయి పైన ప్రేమ ఎన్ని నాళ్ళు ఉంటుందో మరి ?
అసలు ఇది ప్రేమ అయితే కదా శాశ్వతంగా ఉండడానికి?

అంటే అసలు ప్రేమే లేనపుడు ఈ పదాన్ని ఎవడు సృష్టించాడు ?

Reactions:

0 comments:

Post a Comment

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..