ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, December 12

ప్రేమ శాతం :ఆ రోజు నాకో చెల్లి పుట్టింది

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6


ఆ రోజు నాకో చెల్లి  పుట్టింది


నాకొక చెల్లి పుట్టిందని  తెలిసి ఆనందపడిపోయాను..ఈ విషయాన్ని సుబ్బు గాడితో చెప్పాలని వాడింటికి వెళ్ళాను...
ఆ తర్వాత...
నా బొమ్మలు తీసుకుంటుందని ...నా బొమ్మలతో ఆడుకుంటుందని...నేను ఇప్పుడు మా అక్క దగ్గర నుండి బొమ్మలు లాక్కుంటున్నట్లు నా బొమ్మలన్నీ తీసుకుంటుందని సుబ్బు వాళ్ళ అక్క నాతో చెప్పింది..
అంతే ఒక్కక్షణం లో నా ఆనందం ఆవిరి అయిపొయింది...
నాకు వెంటనే మా చెల్లి  పైన అసూయ కలిగింది...
అ తర్వాత ...
నేను హాస్పిటల్ కి వెళ్ళాను నాన్న గారితో...
అసలు నా బొమ్మలు ఎలాగా లాక్కుంటుంది..అలాంటివి ఏమైనా చేస్తే వెంటనే కొట్టాలి...
అనుకొన్నాను ..
అక్కడ ఊయలలో చిన్న పాప ను చూసాను ..నన్ను చూసి బలే గా నవ్వింది...
నేను వెంటనే వెళ్లి పాప తో ఆడుకున్నాను...చేతులు పట్టుకున్నాను ,నా వేలును గట్టిగా పట్టుకుంది...
ఇంటికి వెళ్ళాలనిపించలేదు...స్కూల్ కి ఎగ్గొట్ట వచ్చు ...ఇంకా ఎంచక్కా ఇక్కడే ఆడుకోవచ్చు ...
ఇంకా అంతే సుబ్బు వాళ్ళక్క అన్ని అబద్దాలు నాకు చెప్పినదని అర్ధమైంది...
మా అక్క నాకన్నా ముందే  ఎప్పుడో వచ్చింది ..ఇంకా చెల్లికి తన బొమ్మలు కూడ తెచ్చింది...చెల్లి అక్క వేలును కూడా పట్టుకుంది..

ప్చ్...నాకు వెంటనే నా బొమ్మలు అన్ని తెచ్చేసి నేనే మంచి మార్కులు తెచ్చుకోవాలని అనిపించింది...
వెంటనే ఇంటినుండి నా బొమ్మలు తేవాలని  అల్లరి చేసాను..
బొమ్మలు తెచ్చుకుందామని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్లి స్కూల్ కి పంపేసారు..
మల్లి సాయంత్రం వచ్చి చేల్లెతో ఆడుకున్నాను...
ఇక్కడేమో స్వార్ధం ప్రేమ రెండు దోబుచులాడుకున్నాయి...స్వార్ధం ..ప్రేమ...రెండు పోటి పెట్టుకున్నాయి...
మొదట స్వార్ధం పెరిగింది..(అసూయ రూపం లో)చివరకు ప్రేమ గెలిచింది(చెల్లె కోసం నా బొమ్మలు ఇవ్వాలనుకోవడం) అందుకే ప్రేమ శాతం ...పెరగ లేదు  అట్లే స్వార్ధం శాతం... కూడా పెరగలేదు
ఇవ్వడం లో కూడా ఆనందం ఉంటుందని తెలుసుకున్నాను...
మనం ప్రేమించినా ,ద్వేశించినా మన ఆనందం కోసమే చేస్తాము...
ప్రేమించినపుడు కలిగే ఆనందం ...త్రుప్తి రూపం లో ఉంటుంది
ద్వేశించినపుడు కలిగే ఆనందం ...పాపం రూపం లో ఉంటుంది..
మొత్తం మీద మన ఆనందం కోసమే  ప్రేమ ...మన ఆనందం కోసమే స్వార్ధం
                                                                                       NEXTPART
if you want notification..email me: srinosys1@gmail.com

Reactions:

9 comments:

 1. చాలా బాగుందండీ.it was so cute.

  ReplyDelete
  Replies
  1. చెల్లి పైన అసూయ బాగుందా?లేక ప్రేమ బాగుందా? మహి గారు

   Delete
  2. అసూయ ప్రేమగా మారటం బాగుంది.

   Delete
  3. నిజం చెప్పాలంటే కేవలం మా చెల్లి విషయం లో అసూయ ప్రేమ గా మారిపోయింది...ఇలాగే అందరి విషయం లో ఎందుకు ఉండలేక పోతున్నానో అర్ధం కావడం లేదు .........?

   Delete
 2. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదోయి అన్నాడు కదా ఆత్రేయ గారు (?). ఇది అందరి విషయంలోనూ ఉంటే .... గుడ్ థింకింగ్..!

  ReplyDelete
  Replies
  1. Kondala Rao Palla గారు ! థాంక్స్ for supporting me

   Delete
 3. I always spent my half an hour to read this weblog's posts
  everyday along with a mug of coffee.

  Stop by my web-site: diy home improvements [homeimprovementdaily.com]

  ReplyDelete
 4. I always spent my half an hour to read this weblog's posts
  everyday along with a mug of coffee.చాలా థాంక్సండి..మీ కామేంట్ కు

  ReplyDelete
 5. My brother suggested I might like this website. He was totally right.

  This post actually made my day. You can not imagine just how much time I had spent for this
  info! Thanks!

  Also visit my site; Derechos del Ciclista
  ()

  ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..