ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Thursday, December 11

ప్రేమ శాతం :అలక The blackmail

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2 3 4 5

అలక అనేది మనలో స్వార్ధాన్ని పెంచే మరో గొప్ప ఆయుధం ...
చిన్నపుడు నేను అమ్మా నాన్న లతో జాతరకు వెళదామనుకున్నాము ...

అక్కడ నాకు ఒక జీప్ బొమ్మ చాలా చాలా నచ్చేసింది...ఇంకా వెళ్ళకముందే..
ఇంకా మనం ఊరుకుంటామా?...
జాతరకు వెళ్లేదే బొమ్మలకోసం..అందుకే ఇంట్లో ముందే జీప్ బొమ్మ కావాలి అని ఆర్డర్  పాస్ చేసేసాను...
ఇంకేముంది సరేలే కొందామని వాళ్ళు కూడా చూచాయి గా చెప్పేశారు...
ఇంకేం జాతరలో బొమ్మల షాప్ ల దగ్గరికేల్తే జీప్ బొమ్మ కనపడలేదు...
అన్ని bangels,stickers,లాంటివి కనిపిస్తున్నాయి...ఏంటా అని ఆలోచిస్తే ...
ప్చ్...నేను మా అమ్మ ,మా అక్క వాళ్ళ జట్టులో ఉన్నాను..
అందుకే  షాప్ లలో బొమ్మలకు బదులు గాజులు ,బొట్టుబిల్లలు కనబడుతున్నాయి..
వెంటనే నాన్న గారి జట్టులోకి వెళ్ళాను...
ఇప్పుడు నాకు కావలసిన బొమ్మల షాప్ కనబడింది...
అందులో నా కళ్ళు ఏ బొమ్మను వెతుకుతున్నాయో మీ అందరికి ముందే తెల్సు కదా...
అలా చూస్తుంటే నాకు కనిపించింది...కళ్ళు మైమరపు గొలిపే అందమైన బొమ్మ ...
అసలు నా కళ్ళను తిప్పుకోనీయకుండా నన్ను పూర్తిగా దానివైపే తిప్పెసుకున్నబొమ్మ...
అదేనండి ...రిమోట్ హెలికాప్టర్...

అదేంటి జీప్ కదా కొనుక్కోవాల్సింది ...మరి ఇప్పుడు ఇదేంటి అని డౌట్ మీకు అవసరం లేదు..
నిన్నటి నా ప్రపంచం లో జీప్ మాత్రమే ప్రయారిటి గా ఉండేది,ఎందుకంటే దాని పరిది చిన్నది అంతే ..దానికి తెలియదు జీపు ను తల దన్నే బొమ్మలు ఉంటాయని...
ఇప్పుడు ఆ ప్రపంచం లోకి వచ్చాను ...అందుకే నా ఇష్టం జీపు నుండి హెలికాప్టర్ కి షిఫ్ట్ అయ్యింది....
ఇలా ఆలోచనలో నేను ఉన్నంత లోనే మా నాన్న గారు నాకు జీప్ కొనేసారు...
నాకు జీప్ ఇవ్వబోయారు ...నా కళ్ళ లో నా ఆనందాన్ని చూడాలనే ఆశతో ...
అంతే నా మనసు మొత్తం కకా వికలమయ్యింది...ఇప్పుడు ఎలాగ? పరిస్థితి నా చేతుల్లో లేదే...
అసలు ముందు జీప్ కావాలి అని చెప్పాల్సింది కాదె...?
పక్కింటి సుబ్బుగా ఎందుకురా నాకు జీప్ చూపించావు...దాని మీద ఆశలు పెంచావు...
ఇప్పుడు హెలికాప్టర్ ఎలాగరా?కొనుక్కోనేది...?
ఇప్పటికే స్వార్ధం లో మూడు  మెట్లు ఎక్కిన నేను నాలుగో మెట్టు నాకు నేనుగా ఎక్కలేనా?
ఎక్కగలను...
అందుకే ...ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జీప్ బొమ్మ వద్దు అనకూడదు...ఎందుకంటే నిన్న ఆర్డర్ చేసాను కదా...
జీప్ తో పాటు హెలికాప్టర్ కూడాకావాలి,అని అలగాలి ...ఇదే సరైన సమయం ...ఇప్పుడు ఈ అవకాశాన్ని వృధా చేసుకోరాదు...అనుకోని ,నాకు హెలికాప్టర్ బొమ్మ కూడా కావాలి అని అడగడం ...
నాన్న గారు నో అని చెప్పడం ....అలాగైతే నేను భోజనం చెయ్యను అని చెప్పెయ్యడం ...తో

పాటు వాళ్ళతో అన్ని మూసుకొని ఇంటికి రావడం జరిగి పోయింది....
 ఎందుకంటే అక్కడ తాగేవి ,తినేవి ఏవి వాళ్ళను అడగలేదు ...ఎందుకంటే నేను అలిగాను కదా ...ఎలా అడుగుతాము...ఈ చిన్న చిన్న వాటికోసం కక్కుర్తి పడితే హెలికాప్టర్ రాదు కదా?
నైట్ 9 అయ్యింది ,అందరు భోజనాల దగ్గరికి వచ్చారు ...నా కోసం ఒక కేక వేసారు ...
దానికోసమే వెయిట్ చేసే నేను నిండా ముసుగు తన్ని పడుకున్నట్టు నటిస్తున్నాను..
చెల్లి వచ్చి అన్నా ..అన్నం తినడానికి రా అంది..
 అక్క వచ్చింది..అడిగింది...జవాబు ఇవ్వలేదు ..ఎందుకంటే వీళ్ళతో పని జరగదు..
అనవసరంగా వీళ్ళతో టైం అండ్ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం
చివరగా అమ్మ వచ్చింది...అడిగింది...నేను తినను నాకు హెలికాప్టర్ కొనలేదు కదా..అని చెప్పాను..
తర్వాత కొంటారు లే ...ఇప్పుడైతే రా రా అని అడిగింది...నేను లేదు అన్నాను...
ఇదే విషయం నాన్న గారి దగ్గరికి తీసుకెళ్ళింది...
అక్కడి నుండి నో వాడికి గారాభం ఎక్కువయ్యింది...అనే జవాబు...వాడికి ఆకలైతే వాడె వస్తాడు...అని చెప్పడం ..
వాళ్ళు తినడం జరిగింది...
బిర్యాని తెచ్చారు...తినడానికి...
సరేలే ఇంకోసారి అమ్మ వస్తే తిందాం అనుకున్నాను...
కాని bed సర్దేస్తూ హాయిగా పడుకుంటున్నారు
సరే అక్కయ్య ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా ..తనయినా అడుగుతుంది అపుడు తిందాం అనుకున్నాను...
కాని అక్కయ్య అక్కడ చదువుకుంటుంది...
సరే ఎలాగైనా చెల్లె నాతో పాటే కదా పడుకోనేది కచితంగా అన్నం తిను అన్నా అంటుంది..అపుడు తిందాం అనుకున్నాను...కాని అమ్మ తో సీరియల్ చూస్తుంది..రాత్రి 10కి సీరియల్ 10 -30 వరకు ఆగాలా?
సరేలే అనుకున్నాను...
మరో పది నిమిషాల్లో అమ్మ ఒడిలోనే నిదుర పోయింది...
అయ్యో నన్ను అడిగే వాళ్ళు లేరా?...కడుపులో ఎలుకలు తిరుగుతూ ...అహం అడ్డు వస్తూ...తినాలని ఉన్న అడగలేక ...ఉంటున్న సమయం లో సీరియల్ బ్రేక్ వచ్చింది...అమ్మ చెల్లేని నా పక్కన పడుకోబెట్టేస్తూ..
చిన్నా! నీ కోసం నాన్న గారు బిర్యాని తెచ్చారు కదా..!కొంచెం తినరా అని అడిగింది...
exact గా ఇలాంటి బుజ్జగింపు కోసమే చూసే నేను ఎగిరి గంతేసి వెళ్లి తినాలి కదా...?మల్లి హెలికాప్టర్ గుర్తొచ్చింది..
అటు తిరిగి పడుకొన్నాను...ఇంకేమి మాటలు వినపడడం లేదు..
అయ్యో అమ్మ మల్లి  టీవీ దగ్గరికి వెళ్ళిందా?మళ్లీ మరో పావుగంటా?అనుకునేంత లోపే మళ్లీ అడిగింది..
మరి ఇప్పటి వరకు ఈ సైలెంట్ ఏమిటా అనుకుంటున్నారు కదా?
చెల్లెకి దుప్పటి సర్దింది...అందుకే కొన్ని నిమిషాలు మాట్లాడలేదు...
వెంటనే నా కోరిక ను నెక్స్ట్ టైం జాతరలోకొనడం కోసం అగ్రిమెంట్ జరిపి ...కొన్ని షరతులు పెట్టడం జరిగింది...
అవేంటంటే....
నాకు రేపు కొన్ని చాక్లెట్స్ కొనివ్వాలి ,ఇప్పుడు అన్నం తినిపించాలి...
కోరికలు ఒప్పుకోవడం భోజనం చెయ్యడం ..పడుకోవడం ..జరిగిపోయింది
నెక్స్ట్ టైం జాతరకోసం ఎదురు చూస్తూ ఉన్నాను..కేవలం హెలికాప్టర్ నే టార్గెట్ గా పెట్టుకోకూడదు...
అక్కడికి వెళ్లిన తర్వాత హెలికాప్టర్ కంటే మంచి బొమ్మలు ఉండొచ్చు కదా!అందుకే చూసి కొనుక్కోవాలి...
ఇక్కడ నేను పూర్తిగా స్వార్ధ పరుని గా మారడానికి కావలసిన తెలివి తేటలు పెంపొందిన్చుకున్నాను..
ఎందుకంటే ఒకే బొమ్మకు కనెక్ట్ కాకపోవడం ,నా స్వార్ధానికి తగినట్టు పరిస్థితులకు అనుగుణంగా నా కోరికలకు ప్రతిస్పందించడం లాంటి వన్నిటి తో పాటు,
ప్రేమ 46శాతం..స్వార్ధం 54శాతం తో....READMORE

Reactions:

6 comments:

 1. మీకు చక్కగా అలా బతిమలాడారు అదే మా ఇంట్లో అయితే మా అమ్మ మూడంకెలు లెక్క పెట్టే లోపు రాకపోయావో నీ వీపు విమానం మోత మోగిస్తాను అని బెదిరించి మరీ తినిపించి ఉండేది.

  ReplyDelete
  Replies
  1. అదేంటి ...మూడు లెక్కపెట్టడం కేవలం బెదిరింపే ..ఆ బెదిరింపుకు భయపడకూడదు ,భయపడితే మన కోరికలు ఎలా తీరుతాయి అండి మహి గారు?

   Delete
  2. అలా ఒకసారి ప్రయత్నించి చూసాను.అపుడు తెలిసింది దాని వలన ఎంతటి విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయో.ఆ తరువాత అంతటి ధైర్యం చేయలేకపోయాను. ఇప్పటికీ నేను అల్లరి చేస్తే మా అమ్మ కౌంట్ డౌన్ మొదలు పెట్టేస్తుంది.

   Delete
  3. అయ్యో పాపం ....!హి హి హి !కొంపదీసి ఇప్పుడు అల్లరి -అలక మానేసారా ఏమిటి?

   Delete
 2. Replies
  1. Kondala Rao Palla గారు ! థాంక్స్ అండి

   Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..