ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, December 8

ప్రేమశాతం:నా వెనక మా అమ్మ ఉంది!

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2 3 4

స్వార్ధం పెరిగిన నేను
 ఒక రోజు మా ఇంట్లో మా అక్కయ్య వస్తువులతో ఆడుకొంటుంది
అప్పుడు  నా కన్ను మా అక్క ఆడుకొనే వస్తువుల మీద పడింది...
దాన్ని ఇమ్మని అడిగాను ...
ఇవ్వలేదు...
నా స్వార్ధానికి కోపం తోడై ఆ వస్తువు పట్ల ఆశ ఇంకా పెరిగి పోయింది
వెంటంటే మా అక్క దగ్గరి వస్తువు లాక్కోవడానికి ప్రయత్నించాను...
కాని తనేమో నాకన్నా పెద్దదాయే....
 ఒకటి నన్ను కొట్టేసి నన్ను నెట్టేసింది...
వస్తువు రాక పోగా..దెబ్బలు కూడా తగిలాయి..
మళ్ళి ఆ కదనరంగానికి వెళ్ళలేని స్థితి..
ఎందుకంటే నా బలం ఎందుకు పనికి రాదనీ తెల్సి పోయింది... 
ఇప్పుడు కొత్తగా అవమాన భారం కూడా కొతగా నా స్వార్ధానికి జతకూడింది...
నా నిస్సహాయత ...కోపం ...స్వార్ధం ..ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పంతం ,అవమాన భారం
అయ్యా బాబోయ్ చిన్న పిల్లవాడిని నాకు ఇన్ని అవలక్షనాలు ఉన్నాయా..?
ఏమో?
ఎవడికి తెల్సు ?ఇప్పుడైతే ఆలోచిస్తే 
ఆ దుష్టలక్షణాలు కలిగి ఉండడం వల్లే అలా లాక్కోవడానికి ప్రయత్నించాను..!అని అనుమానం
 మరెలా?
అసలు నేనా బొమ్మను ఏల చూడవలె?...చూసితినిపో?
మరి ఏల ఆ బొమ్మ నాకు కావాలనిపించెను?...అనిపించెను పో?
మరి ఏల వెళ్లి బొమ్మ ఇమ్మని అడగవలె?....అడిగితిని పో..?
మరి ఏల నాకు బొమ్మ ఇవ్వనని చెప్పవలె?...చెప్పినది పో?
మరి ఏల నేను లాక్కోవడానికి ప్రయత్నించవలె?...ప్రయత్నించితిని పో?
మరి ఏల నన్ను మా అక్క కొట్టవలె ...?
ఎటుల ?...ఎటుల?
హా ఎంత  అవమానం ?ఎంత అవమానం?

అని ఒక "దానవీరశూరకర్ణ "లాంటి సినిమా వేసుకున్ననేమో తెలీదు గాని అంత పని చేసి ఉండి ఉంటాను...

శత్రువు మన కన్నా బలవంతుడైనపుడు ....అతన్ని ఎదుర్కోవాలంటే అతనికన్నా ఎక్కువ బలవంతులను మన జట్టులో కూడా గట్టుకోవాలి 
అనే చాణక్యుడి నీతిని చదవకముందే, అప్పుడే ఒంట బట్టించుకొన్నానేమో? 

సరిగ్గా అప్పుడే ఒక ఐడియా వచ్చింది...
మా అక్క ఎవరి మాట వింటుందో..వాళ్ళతో చెప్పిస్తే.. ఆ వస్తువు ఏల నా వద్దకు రాదు...

ఆ ఐడియా నే ....

 "నా వెనక మా అమ్మ ఉంది!"
అమ్మను ప్రయోగించవలె..ప్రయోగించిన క్షణాల్లోనే బొమ్మ నా వద్దకు వచ్చి తీరుతుంది,వస్తుంది ,వచ్చింది...

అలాగా నాకేదైనా వస్తువు కావాలంటే మా అమ్మను ప్రయోగించి వస్తువులను ఇప్పించుకొనే వాణ్ని..

ఈ విధంగా స్వార్ధం మా స్కూల్ నుండి...మా ఇంటి పరిసరాలకు ...అటునుండి ..మా ఇంటికి వచ్చింది...


ఇలాగ నాకు కావలసినవి లాక్కోగలిగాను...

ఈ రకంగా నాకు కావలసినవిఎవ్వరి దగ్గర నుండి అయినా సాధించుకోవచ్చనే అభిప్రాయం ఏర్పడింది...

అప్పటి నుండి నేను ఇతరుల మాటలు వినను ,వాళ్ళ అవసరాలు పట్టవు

అలాగా నేను ఇతరుల పైన ఆధారపడే వాడిగా తయారయ్యాను...

భోజనం తినడం నేర్చుకున్నాను,తప్పా స్వయంగా తయారు చేసుకొనేస్థితి లో నేను లేను...

వాస్తవంగా ఆలోచిస్తే   మా అక్కని మా అమ్మ నొప్పించింది...నాకు ఇప్పించింది...

అలాగా దురభిమానంతో పెత్తనం చెలాయించే...వానిగా తయారు అయ్యాను...

ప్రేమ 47 స్వార్ధం53 గా మారింది...

కాని ఇక్కడ మా అమ్మ...మా అక్క నుండి ఇప్పించకుండా ఎం చేస్తే బాగుండేదో చెప్పగలరా?

జవాబును  మీ కామెంట్స్ రూపం లో పెట్ట గలరు

తర్వాత రేపు నా జవాబు ను ఇదే పోస్ట్ లో పెట్టగలను,రేపు ఒక సారి చూడగలరు ...

కామెంట్ లో నా జవాబు చూడగలరు READ MORE
Reactions:

5 comments:

 1. పోస్ట్ చదువుతున్నంత సేపు నవ్వుతునే ఉన్నానండీ.బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మహి గారు ....మీ కామెంట్ చాలా ఉత్సాహాన్నిస్తుంది,
   చిత్రాలక్ష్మన్ అంటే మీరేనా?

   Delete
 2. నా జవాబు :
  ఇద్దరిలో ఎవరిని నొప్పించకుండా ...ఇద్దరి కోరిక ను తీర్చాలి...ఈ సందర్బం లో వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకునేలాగా లేదా ఆ పిల్లవాడి మనసును ఇంకొక దానిపైన కు మళ్ళించడం ...లాంటివి చేస్తే బాగుంటుందేమో అని నా ఐడియా ,ఇలా కాకుండా పెద్దవాళ్ళు ,అక్కయ్య దగ్గర నుండి బలవంతంగా నాకు బొమ్మ ఇప్పించడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశ్యం

  ReplyDelete
  Replies
  1. మొక్కై వంగనిది మ్రానై వంగునా? అన్నట్లు మీ(మన) స్వార్ధానికి సపోర్ట్ దొరకకుంటే మనకు మంచి లక్షణాలు అలవడతాయి. చెడ్డ లక్షణాలు తొలగుతాయి. ఎక్కడైనా సరే మనం తప్పులను సపోర్ట్ చేయడం ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ పోవడమే ఈ పోస్టుకు సమాధానం. అది నిరంతర ప్రాసెస్. ఆ ప్రాసెస్ కు ఈ పోస్టూ ఉపయోగపడుతుంది. ఎవరినీ ఓడించకుండా ఇద్దరినీ గెలిపించే విజేత లక్షణాలను చిన్నప్పటినుండే నేర్పించాలనే మీ సూచనతో నేను ఏకీభవిస్తున్నాను శ్రీనివాస్ గారు. బాగా వ్రాస్తున్నారు.

   Delete
  2. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి!Kondala Rao Palla గారు

   Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..