ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, December 1

ప్రేమ శాతం -"కాకి ఎత్తుకెళ్ళింది...!"కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు, ,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

                           నిన్నటిపోస్ట్ :   అపుడు   ప్రేమ51- స్వార్ధం 49 గా మారిపోయింది..!

పోస్ట్ 2:
         ప్రేమించడం చిన్నపిల్లల్లో ఉంటుంది - కాని మనమే చిన్న పిల్లల్లో ప్రేమ ను చంపేస్తాము

                 అలా నా ప్రేమ ను స్వార్ధం  డామినేట్ చేసి జీవితం లో ప్రాక్టికల్ గా బ్రతకడానికి బీజం వేసింది..
అప్పటి నుంచి నేను ప్రతి మనిషి నుండి నాకేంటి ?అనే ప్రశ్న ప్రతి అంశంలో వేసుకోనేవాడిని...

కొన్నాళ్ళ తర్వాత  నాలో ప్రేమ శాతాన్ని తగ్గించిన ఆయుధం  "కాకి ఎత్తుకెళ్ళింది...!"

మీకు తెలుసా ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది....

             నా దగ్గర ఉన్న వస్తువు మా అమ్మ దాచేయ్యాలని  తీసుకొని నేను ఆ వస్తువు ఏది అని అడిగితే మా అమ్మ "కాకి ఎత్తుకెళ్ళింది...!"అని చెప్తూ ఉండేది...
కాని కొన్ని రోజులకు "కాకి ఎత్తుకెళ్ళింది...!"లో కాకి రహస్యం తెలిసిపోయింది....

ఒక రోజు మా అమ్మ లడ్డులు చేసింది ....
అపుడు నేను కొన్ని మా అమ్మకి తెలియకుండా లడ్డూలు తీసుకోని మా ఫ్రెండ్స్ తొ ఎంజాయ్ చేసాము...
ఇంటికి వచ్చాక మా అమ్మ లడ్డూలు ఏవిరా ?అని అడిగింది..తెలిసిపోద్దిగా ...కొన్నిలడ్డూలు మిస్అయితే?
నేను అప్పుడు ఏమి చెప్పానో తెల్సా?....

"కాకి ఎత్తుకెళ్ళింది...!"నేను చూసానమ్మా....! అని గట్టిగా నొక్కి వక్కానించాను...
ప్చ్ కాని ఎం లాభం?
మా అమ్మ నా లాగ చిన్న పిల్ల కాదు గదా?.వెంటనే....దొంగ ను కనుక్కుంది...?
ఇక్కడ నా బండారం బయట పడింది....బడితే పూజ పూర్తయ్యింది..!
ఆతర్వాత కొన్ని రోజులకు...
మా చెల్లె వస్తువు ఏదైనా నాకు కావాలి అనుకుంటే నేను కూడా లాక్కునే వాడిని....
మా చెల్లె తన వస్తువు ఏది అని నన్ను అడిగితే ?
నేను చెప్పే మాట "కాకి ఎత్తుకెళ్ళింది...!"
ఇక్కడ వర్కౌట్ అయ్యింది ....ఎందుకంటే చెల్లె చిన్న పిల్ల కదా?
అప్పుడు నేను ఒక సూత్రాన్ని కనుక్కున్నాను....

మన కంటే చిన్న పిల్లల దగ్గరినుండి మాత్రమే వస్తువులను "కాకి ఎత్తుకెళ్ళుతుంది...!"

ఈ విదంగా "కాకి ఎత్తుకెళ్ళిన" ప్రతి సారి నేను లౌక్యం గా తప్పించుకోవడం జరిగింది...

ఇప్పుడు నాలోని స్వార్ధం 51 నుండి 52వరకు పెరగలేదు....

ఎందుకంటే ఇది కేవలం నా లోని స్వార్ధం లో వందో వంతు మాత్రమే...

"ప్రేమ కూడా స్వార్ధానికి ఒక పర్యాయపదం గా మారిపోయింది...

మన పెద్ద వాళ్ళు గోరు ముద్దలతో స్వార్ధాన్ని ఎక్కిస్తారు, ,

ఒక మాతృమూర్తి చిన్న పిల్లవాడికి అన్నం తినిపిస్తూ,

నువ్వు తినకపోతే , ఈ ముద్ద  "కాకి ఎత్తుకెళ్తుంది...!"(ఇంకెవరికో పెడతాను)

అని బెదిరిస్తూ స్వార్ధపు బీజాలను చిన్నారి పసి మనుసులో ఎక్కిస్తే ,పెద్దవాడైన తర్వాత తను పక్కోడి ముద్దకోసం 

ఎందుకు వెంపర్లాడడు?"

కాని స్వార్ధమే ప్రేమ ని డామినేట్ చేసింది.........మళ్ళీ...ఈ రోజు కూడా

ప్రేమ లో ఓడిపోయాను....రేపు మళ్ళి కలుద్దాం.....READ MORE

.
Reactions:

5 comments:

 1. బాగుంది.మీరు చెప్పిన అబద్ధం చదవగానే ఆ సన్నివేశం ఊహించుకుంటే చాలా నవ్వొచ్చిందండీ.

  ReplyDelete
  Replies
  1. మహి గారు మీ కామెంట్ నా పోస్ట్ ను డామినేట్ చేసి పడేసిందండి!సో స్వీట్

   Delete
 2. " కథ ... కథనం... హీరో = నేనే " మీరు ఇలా ఎందుకు వ్రాశారో నాకిప్పుడర్ధమయింది. మనందరి కథను 'నా' కథగా వ్రాస్తున్నారు. ఈ ఫార్ములాకు తిరుగుండదు. ఎందుకంటే ఏదో సినిమాలో ఎవడి కథకు వాడే హీరో. నేనే హీరోని మీ కథలో :)) మొత్తం సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ వ్రాస్తున్నారు. ఇప్పటివరకైతే బాగున్నాయి. ముందు ముందూ ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. Kondala Rao Palla gaaru ధన్యవాదములు మీకు!"నా కథ లో మీరు హీరో "చాలా బాగుంది,నాకు ఇంత కంటే ఏమి కావాలి ,నా లైఫ్ సీరియల్ వల్ల కనీసం నన్ను నేను ఎవరో తెలుసుకున్న చాలు!

   Delete
 3. This comment has been removed by the author.

  ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..