ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Wednesday, November 12

నేను కూడా నవ్వాను!

04:52 Posted by srinivas 2 comments
నేను జీవితం లో ఎదో అలాగా జీవిస్తూ ఉన్నాను,

అసలు నాకు నవ్వడానికే తీరిక లేదన్నట్లు ఉంటూ ఉన్నాను,

ఈ ప్రపంచం లో నవ్వు వచ్చే బోలెడన్ని విశేషాలు ఉంటే నవ్వడానికి ఏం రోగం?

అని మీరు అనుకోవచ్చు ...!

నిజమే నవ్వుతాను..!కాని గుండె లోతుల్లోంచి కాదు!

మూవీ లో వచ్చే జోక్స్ చూసి  నవ్వాను అన్నట్టు నవ్వుతాను

twitter లో tweets చూసి కూడా నవ్వుతాను

fb లో పోస్ట్ లకు ,కామెంట్ లకు  నవ్వుతాను

whats up మెసేజ్ లకు నవ్వుతాను

Cellphone లో గర్ల్ ఫ్రెండ్  చాటింగ్ లో నవ్వుతాను

laughing therapy లో నవ్వుతాను

కాని ఈనవ్వు ఎప్పటికీ ఆ నవ్వు కాదు,

చిన్నపుడు peergroup(సమ వయస్కులతో ) ఆట పట్టించిన సమయం లో ,

ఆ సరదా సన్నివేశాలలో నవ్విన  నవ్వును నేనెప్పుడూ నవ్వలేదు,ఇప్పటి వరకు!

కాని నిన్న నవ్వాను,నేను కూడా నవ్వాను,


అప్పటి స్నేహితున్ని కలిసినపుడు, ఆ పాతమధురాలను నెమరు వేసుకున్నపుడు ..!

అవును నేను కూడా నవ్వాను!

2 comments:

  1. అందరం మీలాగే ఏదో నవ్వాలి కాబట్టి మొహమాటంగా నవ్వుతున్నాం.నిజమైన నవ్వు నవ్విన అవకాశం మీకు వచ్చినందుకు చాలా సంతోషం.

    ReplyDelete
    Replies
    1. మహి గారూ! ధన్యవాదములు

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..