ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, November 3

blog రాయడం -ఒక నెల-నా అనుభవాలు

03:32 Posted by who am i 4 comments
బ్లాగ్ రాస్తుంటే బాగుంది,
నాకు తెలియని నేను ను తెలుసుకొనుటకు రాస్తే నాకు మాత్రమే తెలిసే విధంగా సొంతంగా ఉండాలి  అనుకున్నాను,
అందుకే మొదటి రోజు నా భావాలూ రాసాను
కాని అగ్గ్రిగేట్స్ లో పెడితే అందరూ చూస్తారు కదా ఎలాగూ నేనెవరో తెలియదు,పైగా వాళ్ళ కామెంట్స్ సలహాల వల్ల నన్ను నేను  మార్చుకొనేందుకు ఉపయోగాపడతాయి అనుకొని అగ్గ్రిగేట్స్ కు సబ్ స్క్రైబ్ అయ్యి  రాస్తున్నాను,
ఆ తర్వాత నా బ్లాగ్ ని చూసేవాళ్ళు పెరగాలి,కామెంట్స్ రావాలి ,
బ్లాగ్ లో విషయం బాగా చెప్పగలగాలి,
అనుకొని రాస్తున్నాను,
ఇదెంటి వీడు ఒక్క నెల మాత్రమే ఇక్కడికొచ్చి-అపుడే అనుభవాలా?అనుకోకండే
అంటే నాకు ఎప్పుడు కొత్త కొత్త అనుభవాలు కలుగుతుంటాయి,అపుడు ఇవి మర్చి పోవచ్చు,అందుకే ఇప్పుడే నేను రాయాలి అనుకున్నాను


అనుభవాలు:

 • రాసేటపుడు మనకే కొన్ని పోస్ట్ లు చాలా నచ్చుతాయి ,ఎంతో ప్రేమ గా పోస్ట్ చేస్తాము,వాటికీ బాగా వీక్షకులు రావాలనుకొంటాం,కానీ కొన్ని సార్లు రాకపోవచ్చు ,(ఒకసారి పబ్లిష్ అయినాక అది వీక్షకుల ఛాయిస్)
 •  ఎదో అలా రాసిన వాటికీ మాత్రం మంచి స్పందన ఉంది
 • కామెంట్స్ రావడం ఒక సినిమా హిట్ అయినపుడు డైరెక్టర్ పడే ఆనందంలాంటిది,ఎందుకంటే అది  వీక్షకుల భావాలను కదిలించి వారి అమూల్య సమయాన్ని మనకోసం వేచ్చింపజేస్తుంది
 • చాల సులభంగా బ్లాగ్ వీక్షకులు పెరగాలి అంటే కొన్ని రకాల కంటెంట్ పెడితే వీక్షకుల సంఖ్య పెరగచ్చు కానీ నా బ్లాగ్ ఉద్దేశ్యం మారిపోవద్దు అనుకొని చిన్నా,పెద్దా అందరూ అభినందిచేలా వీక్షకులు ఉన్నా,లేకపోయినా ఈ బ్లాగ్ నన్ను నేనెవరో తెలుసుకొనేవిధంగానే ఉండాలి అనుకున్నాను.   
 • కొందరు సీనియర్ బ్లాగర్స్ నా చిన్న బ్లాగ్ ని చూస్తున్నారని తెలిసి చాల ఆనందం వేసింది,


Reactions:

4 comments:

 1. తెలుగు బ్లాగుప్రపంచానికి స్వాగతం.
  మీ బ్లాగు మీ కోసం. ముఖ్యంగా కేవలం మీ కోసం.
  చక్కగా వ్రాయటాన్ని ఆనందించండి.
  శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలండి!శ్యామలీయం గారు...!మీ శుభాకాంక్షలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందండి!

   Delete

 2. వెల్కం బెక బెక ! ముందు ముందుంది ముసళ్ళ పండగ !!

  జిలేబి

  ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..