ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, November 2

ప్రేమ ఎప్పటివరకు ?ఒక కోతి ప్రయోగం :-()

ఒక సైంటిస్ట్ ఒక కోతి తో ప్రయోగం చేసాడు,
ఒకరోజు కోతిని తీసుకొని, ఒక గాజు డబ్బాలో కోతిని దాని పిల్లని రెండింటిని ఉంచి ఆ డబ్బాను పైనుండి మూసి ఉంచుతాడు,
డబ్బా లోకి నీరు ప్రవేశించే ఎర్పాటు చేస్తారు,
అపుడు నీళ్ళన్నీ కోతి కాళ్ళ వరకు వస్తాయి,
అపుడు కోతి దాని పిల్లని చంక లో ఎత్తుకుంటుంది ,
అపుడు ఇంకొన్ని నీళ్ళు పంపుతారు,
కోతి చాతి వరకు వస్తాయి నీళ్ళు,అపుడు కోతి తన పిల్లను తన భుజాల పైకి ఎక్కించుకుంటది,
ఆ తర్వాత కోతి భుజాల వరకు నీటిని వదులుతారు,
అపుడు కోతి తన తలపైన ఎక్కించుకుంటుంది,
ఇపుడు కోతి తల మునిగే వరకు నీటిని పంపుతారు,
అపుడు సడన్ గాకోతి విచిత్రంగా ప్రవర్తిస్తుంది,తన పిల్లని కాళ్ళ కింద తొక్కి పెట్టి తన తల మునగకుండా
కొంచెం పైకి వస్తుంది..!
ప్రయోగం అయిపోయిందండి,
ఇపుడు విశ్లేషిద్దాం.....!
కోతి తన తల్లి ప్రేమ చూపించింది,
దాని ప్రాణం మీదకి రానంత వరకు తన పిల్లను కాపాడుకోవాలని చూసింది,
కాని చివరికి తన ప్రాణానికి ముప్పు వాటిల్లే సమయం లో తన ప్రాణాన్నికాపాడుకోవానికి బిడ్డ ను తొక్కింది
మన ప్రేమ కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ వద్ద బ్రేక్ అవుతుందా?

బ్రేక్ అయితే అది ప్రేమ అవుతుందా?
నా ప్రేమ లో బ్రేకింగ్ పాయింట్  ఉన్నట్టుంది!
బ్రేకింగ్ పాయింట్ ఉంది అని నమ్మలేక పోతున్నాను?
ఇపుడేం చెయ్యాలి ,
బ్రేకింగ్ పాయింట్ లేని ప్రేమ నాలోన సాధ్యమా?
మీ ప్రేమలో బ్రేకింగ్ పాయింట్ ఉందా?
లేకుంటేనే కామెంట్ చెయ్యండి!anonymus option open చేశాను!మీ కామెంట్ కి
కనీసం ఒక్కరైన బ్రేకింగ్ పాయింట్ లేని వారు ఉన్నారు .!అని తెలుసుకుంటాను!
వాళ్ళ సలహాలు తీసుకొని నేను కూడా అలాంటి ప్రేమ ను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను..!
                                                                                                 
                                                                                                    ఇట్లు
                                                                                           ప్రేమ ఇవ్వలేని వాడు

10 comments:

  1. ప్రేమ అనేది డోపమైన్ (Dopamine) చేసే మాయ. ఇదే డొపమైన్ మనల్ని డ్రగ్స్‌కీ, ఆల్కహాల్‌కీ అడిక్ట్ చేస్తుంది. అదే అడిక్షన్‌ని మనుషుల విషయంలో మనం ప్రేమగా వ్యవహరిస్తాం. ఈ ప్రేమ అనేది subliminal manifestation of the need for sex అని Sigmund Freud ఒక ప్రతిపాదన చేశాడు. Of course, మీరు ప్రేమలో నిండామునిగిన్నట్లైతే దాన్ని అంగీకరించడం మీకు చాలా కష్టం.

    నాకు తెలిసినంతవరకూ 'అవసరం' అన్నదిమాత్రమే నిజం. అదే స్నేహంగానూ, ప్రేమగానూ, బంధంగానూ (తల్లి, తండ్రి, సోదర బంధాలు), భక్తిగానూ తననుతాను ప్రకటించుకుంటుంది. ఆ అవసరమ్మీరాక, తృప్తికలిగాక ఇటువైరాగ్యానికో, depressionకో లేదా అటు మోక్షమార్గానికో మళ్ళుతారు.

    ReplyDelete
    Replies
    1. స్పందించినందుకు thanks అండి Sree naadh గారు ! మీరు చెప్పినది నేను అంగీకరిస్తున్నాను, అసలు 'అవసరం' లేని చోట కూడా ప్రేమ ఉంటుందా?అలాంటి ప్రేమ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ,ఎందుకంటే చాలా మంది ప్రేమకి నిర్వచనం మేమే అని చెప్పుకుంటారు నాలాగా ?అసలు వాళ్ళు వాళ్ళ ప్రేమ, ప్రేమ ఎలాగయిందో అని చెప్తారు అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసాను

      Delete
    2. మనిషి తనకు pleasure ఇవ్వని పని ఎప్పటికీ చెయ్యడు (మనకు pleasure కలిగినప్పుడు dopamine మనం అదేపనిని మనం మరోసారి చేసేలా ప్రోత్సహిస్తుంది). మనం దానంచేస్టే దాన్నుంచి కొంత pleasureని derive చేస్తాం (కొందరు ఏకంగా ఆచేసిన దానం గురించి ప్రచారంకూడా చేసుకుంటారు). ప్రేమను నేను కనీసం అలాకూడా చెప్పలేను. ఇందులో సంతృప్తిలాంటి indirect విషయాలకన్నా, కొన్ని direct విషయాలే దాగున్నాయి. కనుకనే ప్రేమలోనూ, వివాహంలోనూ మోజు తీరిపోవడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది.

      I think I should not comment any further :-)

      Delete
    3. " అసలు 'అవసరం' లేని చోట కూడా ప్రేమ ఉంటుందా?"

      అవసరం లేనిచోట ఏదీ ఉండదు. మనుషులు, జంతువులు మరియు ఇతర ప్రాణులు అవరానికే respond అవుతాయి. Everybody would like to think of themselves as self-less and ao but that is not really true.

      Coming to love sir, males try to maximize their pleasure points by trying to choose a 'beautiful' partner while the women along with that try to look out for a wealthy partner. The other dimension involved is the concern about making one's Genes perpetual. You try the book 'The Mating Mind - Geoffrey Miller.

      Delete
    4. మీరు చెప్పిందాంట్లో నేను తెల్సుకొన్నది, అసలు 'అవసరం' లేని చోటు అనేది కేవలం ఒక ఆదర్శం,అది ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు అని,కాని ఉందేమో అనుకున్నాను,మీరు చెప్పిన దానిని బట్టి ఉండక పొవచ్చు,ఉన్నది అని చెప్పుకున్నా, అది దేన్నో కోరుకుంటుంది,ఆ కోరుకునేది ఒక రకమైన ఆనందం,అది ఏదైనా కావచ్చు,కొంచెం కన్ఫ్యూషన్ ,anyways మల్లీ మీకు thanks, మీరు నన్ను నేను ఎంతో కొంత తెల్సుకోవడానికి చాల సహాయం చేసారు

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. నాకు తెలిసినంతవరకూ 'అవసరం' అన్నదిమాత్రమే నిజం. అదే స్నేహంగానూ, ప్రేమగానూ, బంధంగానూ (తల్లి, తండ్రి, సోదర బంధాలు), భక్తిగానూ తననుతాను ప్రకటించుకుంటుంది.

    ఇప్పుడు అ అవసరం అవకాశం కోసం ఎదురుచూస్తొంది.పడటానికి పడెవాళ్ళని వదిలేయడానికి.(ప్రేమ విషయంలో)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్! అండి స్పందించినందుకు పైడి నాయుడు గావిడి గారు

      Delete
  4. Very nice...mee blog chalaa baagundi:-)

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పాలంటే అది మీ గొప్పతనం

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..