ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, November 23

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!
13 ఏల్ల అమ్మాయి కట్టెల కోసం అడవికి వెళ్లి గొడ్డలి తో కట్టెలను కొట్టడం....
చిన్నపుడు రేషన్ షాప్ కు ఉదయానికి వెల్లి పెద్ద లైన్ లో నిల్చొని కిరోసిన్ ఆయిల్ తేవడం....
గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడం....
ఒక అమ్మాయి తన తండ్రి గొడ్డలి తయారు చేస్తున్నపుడు సుత్తె తో కరిగిన ఇనుము పై కొట్టడం....
నీళ్ళ కొళాయి దగ్గర గొడవలు పడకుండా నీళ్ళు తేవడం.....


బాలల హక్కులు అంటే ఏమిటో తెలియని బానిసత్వం....

గుడికి వెళ్ళినపుడు కూడా గంటలు గంటలు లైన్ లోనే నిలపడడం...
సీరియల్లు చూసి హీరొయిన్ తో బాధ పడటం.....
సినిమాలో హీరో కష్టాలతో పాటు పోరాడాలని తీర్మానం...
తాగోచ్చిన తండ్రితో గొడవ పడి, చివరికి అన్నం పెట్టి పడుకోబెట్టడం....
తెల్లారితే ఏమవుతుందో తెలియని జీవితం తో పోరాడటం....
చిన్న ప్రపంచం లోనే బ్రతకడం....
ఆత్మాభిమానం అంటే ఏమిటో కూడా తెలియని మంచితనం.....
కిట్టి పార్టీస్ అంటే ఏమిటో తెలియని వాళ్లు కచ్చ కాయల ఆటే  గొప్పగా ఆడుకునేవారు...
తిన్నది అరిగేలా ఏరోబిక్స్ .మార్నింగ్ వాక్ లు తెలియనివాళ్ళు ...పొద్దునే లేచి ఇంటి ముందు 
పెద్ద వాకిలి ఊడవడం...తొక్కుడు బిళ్ళ ,స్కిప్పింగ్ ఆటలు .... ఆడటం...
అడవికి వెళ్లి పండ్లు తెంపుకొని రావడం...
తినడానికి ఏమిలేక పోతే గంజి చేసి ఇవ్వడం....అదే త్రాగడం...
పొగ చూరు పోయ్యిలలో వంటలు వండడం ...తినడం...
ఆఫీసర్స్ తిట్టినా కాని ....అయ్యా దొరా!...అని పని చేపించుకోవడం...
పోపన్నం లోనే బిర్యాని చూసుకోవడం.....
చుట్టాలోస్తే వాళ్లకు ఉన్నదాంట్లో కడుపు మాడ్చుకొని వాళ్ళకు భోజనం పెట్టడం...
సర్కారు బడికెళ్ళి నోట్ పుస్తకాలకు డబ్బులు లేక మాస్టారుతో తిట్లు పడటం....
మొత్తం మీద జీవితం లో ఉనికి కోసం పోరాడడం ....జీవితం లో ముఖ్యమైన ఆరాటం... 
తిట్లు పడ్డ కాని  ,చీదరాలు ఎదుర్కొన్న అవి జీవితంలో భాగాలు అనుకొనే రాజి పడే అనుభవాలు... 
ప్రతి చోట చీత్కారం ...అందులోనే పోరాటం...అక్కడే గెలుపు...అదే ఆనందం....అదే మజా ....
  

6 comments:

  1. Replies
    1. ధన్యవాదములు మీకు
      స్పందించినందుకు

      Delete
  2. భిన్నత్వంలో ఏకత్వమని ముద్దుగా చెప్పుకునే పేదప్రజలున్న సంపన్న భారత దేశం. ప్రతి ఒకడు మరియొకనీ దోచుకునేవాడే. తన స్వార్ధం తన లాభం చూసుకునే వాడే. స్వార్ధమే ఈ అనర్ధ కారకం. నాడూ-నేడూ మారని అంతరాలు రాజీలేని పోరాటం సాగిస్తేనే ఏనాటికైనా మారేది! అలా మారాలని మరోప్రపంచం రావాలని ఆశిద్దాం!

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా బాగుంది మీ కామెంటు....

      Delete
  3. చాలా బావుంది

    ReplyDelete
    Replies
    1. Upendar...గారికి!స్పందిచినందుకుథాంక్స్

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..