ఒక అబ్బాయి అమ్మ చేతిలో చేయ్యివేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బస్సు స్టాండ్ కి వెళ్ళాడు,అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు,ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు పూంగి మని చప్పుడు జేస్కుంట ఆడికి వచ్చింది,ఆ బస్సు కోసం అక్కడ చాలా మంది వెయిట్ చెయ్యడం వళ్ళ వెంటనే నిండి పోయింది,ఎలాగో అలాగా అబ్బాయికి, వాల్ల అమ్మ కు సీట్ దొరికింది,ఆ బస్సు కేవలం ఒక్క ఊరికే వెళ్ళదు కదా!
చాలా ఊళ్ళను కలుపుకుంటూ వెళ్తుంది అందుకోసం చాలా మంది జనాలు ఎక్కుతుంటారు,అందులో చంటి పిల్లను ఎత్తుకొని తల్లి గారింటి కెళ్ళే ఆడపడుచు కోసం సీట్ కోసం వెదికే కన్నతల్లి ఆరాటం,అప్పుడే అక్కడున్న ఒక పెద్ద మనిషి ఆవిడ కి సీట్ ఇచ్చేసి గొప్ప దానకర్ణుడిలా పోస్ కొట్టడం,ఇంకో ఆవిడ చిల్లర డబ్బుల సంచి ఒక వైపు ,ఆవిడ మొగుడు ముసలోడిని లాక్కుంట వచ్చి ముసలాయినకు సీట్ లోకూర్చో బెట్టింది,ఇవ్వన్ని అర్ధమయ్యే వయసు కాదు ఆ బాబుది అప్పుడు ....కాని వీల్లెందుకు ఇలా ఉన్నారు అని మాత్రం అనుకున్నాడు.
తన మొత్తం దృష్టి డ్రైవర్, అక్కడున్న స్టీరింగ్ ,గేర్ రాడ్ ల మీద మాత్రమే,తనని ఎవరు ఏమి అనరు అని గట్టిగా అనిపిస్తే తనే ఆ బస్సు డ్రైవర్ కావలనుంది ఆ పిల్లాడికి,కాని ఎం లాభం అమ్మ గట్టిగ పట్టుకొంది...
ఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ అనేసి, బాబు నీ వయసెంత ?అని పూర్తిగా అడగకముందే నాకు 10 ఎండ్లండి...
అని కండక్టర్ ని మోసం చెయ్యకుండా వాళ్ళమ్మ కరెక్ట్ టికెట్ తన కోసం తీసుకోవాలని(అది దేశభక్తి అని అపుడు తెలియని వయసు),నన్ను కూడా కొందరు గుర్తిస్తున్నారు అనే చిన్న ఆనందం ....
మనం సాధారణంగా ఎవైనా పనులు మనకోసం చెయ్యము ,ఎవరైనా గుర్తించి తీరాలని చేస్తాము
అంతలోనే వాళ్ళ అమ్మమ్మ ఊరు కు వెళ్ళే స్టాప్ వచ్చేసింది,ప్చ్ అసలు నన్ను డ్రైవ్ చెయ్యమని ఎవరైనా అడిగితే బాగుండు అనుకొని అదోలాగ బస్సు దిగేసాడు.
అంతలోనే వాళ్ళ అమ్మ తనని తీసుకొని నడవడం సాగించింది,ఎందుకంటే ఇంకా 2km నడవాలి,ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు,పిల్లాడికేమో తెలియదాయె,200మీ. దూరం నడవగానే పిల్లాడి లేత కాళ్ళు నొప్పి పెట్టడం మొదలయ్యింది,
అమ్మా ఇంకా ఎంత సేపే నడవడం?
అపుడు అమ్మ ఇంకా కొంచెం దూరం నడిస్తే సరిపోద్దిరా!
అంటే పాపం అమ్మకు కూడా కాళ్ళు నొప్పెడతాయి కదా! అనుకొని, అలాగే అంటూ అమ్మా చేతిలో చెయ్యి వేస్తూ,చిన్న చిన్న అడుగులతో నడుస్తూ ఎప్పటికైనా ఈ దూరాన్ని నడవకూడదు ,పెద్దైనాక ఒక కార్ కొనాలి అపుడు ఇంత కష్టపడి నడవాల్సి ఉండదు,అని అనుకొన్నాడు.
అప్పుడు అలా అనుకొన్న బాబు ఎవరో కాదు నేనే...!
ఈ పోస్ట్ రాయడానికి కారణం ఈ మధ్య నాకు ఒక తల్లి ,తన బాబు ను చేతిలో పట్టుకొని నడుస్తూ కనబడింది, ఈ సీన్ లు ఎప్పుడు కనబడుతూ ఉంటాయి,అప్పటి సీన్ గుర్తు వచ్చింది,పిల్లాడు కూడా నాలాగే తను పక్కన పోయే వాహనాలను చూస్తూ నా లాగే కచ్చితంగా అనుకొని ఉంటాడు,ఉండాలి,అపుడు మాత్రమే తనలో కసి పెరిగి కచ్చితంగా వాళ్ళ అమ్మని ఎదో ఒకరోజు తన కార్ లో ఎక్కించుకుంటాడు
15 సంల నుండి జనాల కష్టాలు మారలేదు,కాని పాత్రలు మారాయి,అపుడు నేను ,ఇపుడు ఈ పిల్లాడు,15 సం లే కాదు తర తరాల నుండి కష్టాలు కష్టాలే,ఇవి ఎలా తీరుతాయి అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న!
నాకు తెల్సి కేవలం చదువు మాత్రమే జనాల తల రాతలను మార్చుతుందనుకుంటాను,నాలాగా!

Tarangini గారు..!మీ కామెంట్ కి ధన్యవాదాలు
ReplyDelete