ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Tuesday, October 28

ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?

నేనూ అవినీతి గురించి మాట్లాడతా,
అవినీతి చేసిన వాళ్ళను చీడపురుగుల్లా చూస్తా,
నా భాషలో చెప్పాలంటే వాళ్ళను మన మనస్సు అనే లోకంలో నేను వాళ్ళకి సాంఘిక బహిష్కరణ శిక్ష వేసేస్తా,
వాళ్ళంటే ఒకరకమైన ఏహ్య భావం చూపిస్తా,
అవినీతిపరున్ని(దొరికినోడిని/లేదా నా దగ్గర కూడా అవినీతి చేసినోడిని)నా మనస్సు సంతృప్తి పడే దాకా తిట్టేసుకొని సేద దీరుతా,
ఇలాగ నేనేదో మంచి బాలుడిని అయినట్టు నా ఆక్రోశాన్నినా స్నేహితులు /ఇతరుల దగ్గర వేల్లకక్కుతా!

అలాంటి నేనే..! ఏంటి అలాంటి నేనే...!
ఎం చేస్తానంటే..?
ఒక పుస్తకం ఉంది,దాని Pages 200 మరియు పబ్లిషర్  రేట్ Rs 1000 అనుకుందాం,అపుడు,నేను ఆ పుస్తకం కొనకుండా200 pages ని జిరాక్స్ చేపించాను.అంటే పైరసీ జరిగిందన్న మాట,దానికి నాకు అయిన ఖర్చు Rs 200,
ఇక్కడ అవినీతి ఏంటి అని సందేహమా?
చెప్తాను వినండి,సాదారణంగా ఆ పుస్తకం తయారు కావడానికి ,అందులో ఉన్న విషయం సేకరించిన దానికి వాళ్ళు Rs 1000 ఖరీదు పెట్టారు,వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి పుస్తకాలు వస్తాయి కదా...!
కాని నేను వారికి నష్టం చేసాను కదా?
మన లాభం కోసం మరొకరి నష్టం చెయ్యడమే అవినీతి కదా అండి!
ఇలా ఆలోచించ కూడదా?వీడికి పిచ్చిలేసింది అనుకుంటున్నారా?
ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?
చిన్న చిన్నవి చూసి చూడకుండా వదిలేయ్యలంటారా?
మరి అపరిచితుడెంటి?చిన్న చిన్నవే పెద్ద పెద్దవి అవుతాయి అన్నాడు కదండీ!
ఏమోనండి నాకైతే అవినీతి అంటే కొంచెం కూడా సమజైతలే?
నేను అవినీతి చేసేవాడినో ?కాదో?
అసలు నేనెవరు?





3 comments:

  1. మొదటి రకంగా ఆలోచిస్తే మీరు capitalist
    రెండో రకంగా ఆలోచిస్తే మీరు communist

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి!గెల్ల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారూ!మీరు చెపినట్టు రెండు రకాలే కాదు నాలో ఉన్నవి?చాలానే ఉన్నాయి ,నేను భాహ్యంగా ఒకటి మాత్రమే(అదే కట్టే విరగకుండా పాము చావకుండా) కానీ అంతరంగా మరెన్నో,ఎదో ఒకటి అవుదామని నా కోరిక,అందులో నన్ను నేను తెలుసుకొనే ప్రయత్నం,దయ చేసి నాకు నేనెవరో కేవలం ఎదో ఒకటి చెప్పగలరు ...!
      ఎందుకంటే నాకు ఎలాంటి సామజిక అనుభవం లేదు,
      అందమైన ప్రపంచం అబద్దలమయం అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను
      మీలాంటి పెద్దవాళ్ళ బ్లాగు లు చూస్తున్నాను,
      మీ అందరి విశ్లేషణలు చదివుతున్నాను,అవి అన్ని చూసాక నాలో జరిగే మార్పులకు ఇక్కడ పరిష్కారం దొరకచ్చు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో ఈ బ్లాగ్ మొదలు పెట్టాను

      Delete
  2. అది అవినీతేనండీ కానీ నేను చేస్తున్నది అవినీతేనా అనే ఆలోచన రావడం కాస్త ఊరట కలిగించే విషయం

    ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..