ఇది ప్రేమా....! ప్రేమా.......!
అసలు నాది ప్రేమా లేక అట్రాక్షనా ?
తన గురించి ఆలోచిస్తే అది ప్రేమేనా ?
తను నా గురించే ఆలోచించాలి ,నేనే సూపర్ అనుకోవాలి అనుకున్నాను !
అయినా తనతో ఉండాలి అనుకోలేదు ...?
తర్వాత కొన్ని రోజులకి
తను ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తుందని ,తనకి కూడా ఒక రోల్ ఇచ్చిందని తెలిసి ... !
తను తప్పు చేసిందో లేదో తెలియదు ...,
నేను తనని వద్దనుకున్నాను ...,(అంతకు ముందులాగే తనతో ఉండాలి అనుకోలేదు ...?)
తనలో ప్రేమ బదిలీ కి నేనే కారణం అంది...! (ఎందుకంటే తనతో ఉండాలి అనుకోలేదు ...?)కదా ?
అయినా తనని మరచిపోలేకున్నాను ..!
ప్రేమ బదిలీ అనే తప్పు చేసానంది!తను నన్ను మర్చిపోలేనంటుంది ..!
ఇకనుండి ప్రేమని ప్రేమిస్తానంది...... !
అయినా తనతో ఉండాలి అనుకోలేదు ...?
అయినా తనని మరచిపోలేకున్నాను ..!
కానీ తను ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను...!
ఇది ప్రేమా....! ప్రేమా.......!
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..