ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, October 20

తినడం నా బాధ్యత,పని చేయడం ఆడవాళ్ళ హక్కు

నేను ఇలాంటి ప్రపంచం లోనే పెరిగాను,
మా అక్క నే పాత్రలు కడగాలి,మా చెల్లెనే నీళ్ళు పట్టాలి,
వాళ్ళే ఊడవాలి,వాళ్ళే అన్ని పనులు చేయాలి,
ఏదైనా వంటకం చేయాలి అంటే  మా అమ్మ నన్ను ద్రుష్టి లో పెట్టుకొని వండేది,
కోడిని కోస్తే నాకోసం స్పెషల్ ముక్కలు,నాకోసం కొసిరి కొసిరి వడ్డనలు,
ఆడ పిల్ల అంటే ఆమడ దూరంగా ఉంచే సమాజంలో,

వాళ్ళ పైన వివక్ష,పాపం వాళ్ళు కూడా మేము ఇలాగే ఉండాలి అనుకునేవారేమో,
అందుకే  ఎప్పుడూ కనీసం వాళ్ళని వాళ్ళు కూడా ప్రశ్నించుకోనేవారు కాదేమో?
ఇందులోనే సంతోషం వెదుక్కునేవారేమో?,
లడ్డులు నాన్న గారు తెస్తే
లడ్డు కావాలా నాయన అంటే నాకు రెండు లడ్డూలు వాళ్ళకు చెరొకటి,
అందుకేనేమో ఇప్పటికి కూడా  నాకు అన్నం  వడ్డించుకోవడం నా పని కాదు అనుకుంటున్నాను?

అలాంటిది, గోరుముద్దలతోనే చెప్పారు తినడం నా బాధ్యత  అని,పని చేయడం ఆడవాళ్ళ హక్కు
-----హక్కు కరెక్టే గదా!


0 comments:

Post a Comment

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..