అపుడు
నాకు 8 ఏండ్లు అనుకుంటాను,నాకు ఇంకా గుర్తుంది,
సాయంత్రం
8 గంటలు,మా నాన్న నన్ను తన సైకిల్ మీద ఎక్కించుకొని నేషనల్ హైవే మీదనుండి
వెళ్తున్నాము,
ఎలాంటి ట్రాఫిక్ లేదు,నిర్మానుష్యం,చల్లని గాలి,ఎదురుగా
అప్పుడప్పుడు లారీలు,
బస్సులు,కార్లు,స్కూటర్ల హెడ్ లైట్ వెలుగుల కాంతి నా మొఖాన్ని,నా కళ్ళను
తాకుతుంటే,అది నేను చిమ్మని చీకట్లో చూస్తున్న కదిలే వెలుగుల ఆనందం,ఇన్ని చందమామలు
నన్ను ఒక్కక్కటి గా తాకుతున్నాయా ?అనే ఆశ్చర్యం ఒక వైపు,అవి అన్ని నాకోసమే వస్తూ
నన్ను పలకరిస్తున్నాయి,నా స్నేహితులేవరికి అలాంటి ఆనందం కలగడం లేదు ,నాకు మాత్రమే
ఈ అద్భుతం సొంతం అని ఇంకొక వైపు, ఆ ఆనందం నేను వర్ణించలేక పోతున్నాను,అసలు అలాంటి సుందరమైన
వాతావరణం నా కోసమే అంత అందంగా ఆరోజు పుట్టిందా?
ఈ
పోస్ట్ రాస్తున్న ఇప్పుడు ఆ రోజు ఎక్కిన సైకిల్ మల్లి ఎక్కినట్టు ఉంది,
నిజమే అసలు ఈ బ్లాగ్ మొదలెట్టడం వల్ల ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయో లేదో తెలియదు కాని నా మనసుని మాత్రం చాలా చాలా రిఫ్రెష్ చేస్తుంది...!ఇంత కంటే పెద్ద లాభం ఇంకా ఏముంటది?
నేను నాతో ఆనందాన్ని పంచుకొంటున్నాను?మనం ఎవరెవరితోనో మన సంతోషాలను పంచుకొంటుంటాం,ఆనందపడుతుంటాం,కాని ఇలా మనల్ని మనం ఒంటరిగా సంతోష పెట్టుకుంటుంటే వస్తున్న కిక్కే వేరబ్బా?ఏమంటారు?
నాన్న సైకిల్ పై ఎక్కి తిరగటం ఎంత అద్భుతంగా ఉంటుందో.ఆ అదృష్టం కోల్పోయిన తర్వాత అలా వెళ్లే వారిని చూసి ఇంకా life లో అలాంటి అదృష్టం రాదు అని గుర్తు వస్తే ఆ మనసు ని కన్నీరు మాత్రమే ఓదార్చగలదు.anyway thank you so much for remembering me such a valuable memory
ReplyDeletemahi గారు !భలే వారండి మీరు !ఒక్క సారి గుర్తు చేసుకుంటే మల్లి సైకిల్ ఎక్కినట్టు లేదు! "Thanks. That means a lot to me.
Delete