ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Tuesday, October 14

లంచమా నా దగ్గరికి ఎందుకు రావు?

09:44 Posted by srinivas 2 comments
లంచం తీసుకోనేవాడు ఒకడు...లంచం తీసుకొననివాడొకడు...
వీడికి హంగులు ఆర్భాటాలు.... వీడికి హంగులు ఆర్భాటాలు కల్ల...
వీడి కొడుకు అమెరికా లో...  వీడి కొడుకు అంబర్పేటలో...
డబ్బుమయమైన ప్రపంచం లో
వీడికే గౌరవం....
ప్రపంచాలు తిరిగేవాడు వీడు...
ఉన్న లోకం లోనే బావి లో కప్పలా నేను?
ఇలాంటి పరిస్థితిలో లంచమా నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు?అనిపిస్తోంది
అసలు నేనెందుకిలా తప్పుగా ఆలోచిస్తున్నాను?

నేనెవరు....?

2 comments:

  1. హ..హ..
    లంచం మీ దగ్గరికి రావడం లేదు అన్నది రాంగ్.. మీరు రానివ్వడం లేదు అనడం కరెక్ట్...

    నేను ఆయితే లంచంను నా దరిదాపులకు రానివ్వడం లేదు... దానికి నేను పొందుతున్న ప్రతిఫలం..
    హంగు-అర్బాటలు,
    గౌరవం (??),
    ప్రపంచాలు తిరిగే అవకాశం కన్నా
    చాలా ఎక్కువే పొందుతున్నాను. అదేంటో తెలుసా!!
    అత్మగౌరవం, మనశ్శాంతి, గుండెల మీద నిశ్చయంగా చేయి వేసి హాయిగా పడుకోవడం, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కష్టార్దితమే అన్న సత్యం....
    ఇంత కంటే ఏమి కావాలి సార్...

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి మీ కామెంట్ కి

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..