ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Saturday, November 8

ఛీ...!నేను ఒక మనిషినేనా ?


బావర్చి లో  బిర్యాని ముద్ద నోట్లో పెట్టుకొంటుండగా,RTC క్రాస్ రోడ్  పైన అంతకు ముందే చూసిన  ఆకలితో అలమటించే పాప గుర్తొచ్చినపుడు ఎవడైనా ఎం చేస్తాడో నేను అదే చేశాను .....
ఏం చేసానో తెలుసు కోవాలని ఉందా?
పంది లాగ తిన్నాను,
తిన్నాను సరే ...! తిన్నా కాని ఇవి చెయ్యొచ్చు


  • పార్సెల్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు (లేదు )
  • డబ్బులు ఇవ్వచ్చు (లేదు)
  • దగ్గరలో ఎదో ఒక తినేపదార్థము కొనివ్వచ్చు(లేదు)
  • జాలి పడొచ్చు(అవును ఇదే చేసాను).....అందుకే ఇది రాసాను
 ఛీ...!నేను ఒక మనిషినేనా ?
already నాకు మానవత్వం లేదు అని పాత పోస్ట్ లోనే తిట్టుకున్నాను
Note:అసలు వాస్తవానికి వాళ్ళను  గుర్తించనైనా  గుర్తించలేదు,

అందుకే గుర్తు కుడా రాలేదు తినే  సమయానికి

అంటే కనీసం ఛీ...!నేను ఒక మనిషినేనా ? అని తిట్టుకోనేందుకు కూడా అర్హుడిని కానా?

మీరు నాలా చెయ్యకండేమ్?(అంటే తిట్టుకోకన్డేం?)

2 comments:

  1. mee blog mee gurinchi rasthunnaraa?leka janalu ilagunnaru ani ratshunnaraa?

    ReplyDelete
    Replies
    1. Anonymous గారు !స్పందించినందుకు కృతజ్ఞతలు!ఇందులో ప్రతి పోస్ట్ నా గురించి మాత్రమే రాసుకుంటున్నది ! ఎవరిని ఉదేశించినది కాదు..!నా లాంటి వాళ్ళను చాల మందినే చూసాను ...కనీసం వారు మారతారేమోనని!నా లాగా!

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..