ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, November 21

ఇలాగా పాటలు పాడి నాకు తినిపించేదంట...

05:46 Posted by srinivas 4 comments
నిన్న రాసిన పోస్ట్ కు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి....
నిజంగా ఆ పోస్ట్ రాసేటప్పుడు నా చిన్నతనం లో జరిగిన సంఘటనలు రాయడం జరిగింది....
చాలా బాగా అనిపించింది....
అప్పుడే ఇంకొక పోస్ట్ రాయడానికి ఒక ఐడియావచ్చింది...
అదేంటంటే చిన్నపుడు మా అమ్మ నాకోసం ఏమేం పాటలు పాడేదో తెలుసుకోవాలని అనుకున్నాను,
అందుకే అవి అడిగి తెలుసుకొని ఆ పాటలు ఇక్కడ ఇవ్వడం జరిగింది....

                                                                           అమ్మకో ముద్ద...
                                                                           నాన్నకో ముద్ద....
తాతయ్యకో ముద్ద....
మామాకో ముద్ద....
అమ్మమ్మకో ముద్ద....
ఇలాగా పాటలు పాడి నాకు తినిపించేదంట...
google image

                   గుడు గుడు గుంచం...
గుండె రాగం .....
పాముల పట్నం....
పడిగే రాగం....
పక్కన చెవ్వు పట్టుకో...

అక్కడ దగ్గర గా ఉండే వాళ్ళ చెవులు పట్టుకొని గు... బా.. గు...బా..అని లాగాలి...

                                                                     కాళ్ళ గజ్జా ...
                       కంకానమ్మ....
       వేగూ చుక్కా....
       వెలగా పండు.....
      కాళ్ళు తీసి కడగా పెట్టు....
అంటే కాళ్ళు ఇలాగ దూరంగా పెట్టాలంట....
ఇంకా మీకు తెలిసే ఉంటుంది ...

చందమామ రావే.....

జాబిల్లి రావే.....

ఇలా పాడుకుంటూ చందమామ ను చూపిస్తూ పెరుగన్నం పాలు కలిపి తినిపించేదంట...
పెరుగన్నం కూడా చందమామ లాగ తెల్లగా ఉండడం వల్ల చందమామ లోని తెల్లదనం తినేవాన్నెమో...
ఇంకా 
                                                               చిట్టి చిలుకమ్మ
             అమ్మ కొట్టిందా... 
      తోటకేల్లావా....
      పండు తెచ్చావా...
      గూట్లో పెట్టావా...
      గుటుక్కుమింగావా....
అని కూడా తినిపించే దంటా....
బాగున్నయా ?రేపు మా అమ్మ చెప్పిన చిన్నప్పటి చిట్టి చిట్టి కథల తో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను ఏమంటారు?
గమనిక:మీకు తెలిసిన చిన్నప్పటి పాటలు మీ కామెంట్ లో పెడితే ,ఈ కాలం మాతృ మూర్తులు తెలుసుకుంటారు ,ఇంకా చిన్న పిల్లలకు పాడుతుంటారు అనుకుంటాను 

4 comments:

  1. ఏవి తల్లీ..... నాడు చూసిన మమతలు.... కుటుంబ బంధాలు...... ఆట పాటలు.... వెన్నెలలో తీరిక కబురులు.... ఇలా ఎన్నెన్నో నేడేవీ. చందమామను సైతం బుల్లితెరలోనే చూస్తున్న రోజులివి. అంతా బిజీ గజిబిజి జీవితం :((

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములండి!స్పందించినందుకు....నిజంగానే ఇప్పుడు ఉన్న తల్లులకు పిల్లలకు లాలించుతూ బువ్వ తినిపించే సమయమే లేదు అనుకుంటాను

      Delete
  2. చిన్నోడమ్మ చిన్నోడు
    చిన్న సైకిల్ కొన్నాడు
    సైకిల్ పైకి ఎక్కాడు
    కాలు జారి పడ్డాడు...
    హాస్పిటల్ కి వెళ్ళాడు
    మందులు గోలీలు మింగాడు

    ReplyDelete
    Replies
    1. Anonymous థాంక్స్ అండి

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..