ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, December 5

ప్రేమ శాతం :అసలు నా జీవితం లో ప్రేమ కలిగిన రోజే లేదా?


 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

 పోస్ట్ 1  పోస్ట్ 2 పోస్ట్ 3

అసలు నాలో ప్రేమే లేదా ?ఎంత సేపు స్వార్ధ పరున్నేనా?
అసలు నా జీవితం లో ప్రేమ కలిగిన రోజే లేదా?

నేను ఒక రోజు మా నాన్న గారితో గుడికి వెళ్ళడం జరిగింది....
మా నాన్న గారు తన దగ్గరున్నకొన్ని చిల్లర డబ్బులు కొన్ని ఇచ్చాడు ....
వాటిని అక్కడ  గుడి దగ్గరి బిక్షగాల్లకు ఇవ్వమని చెప్పాడు...
పాపం కదా...వాళ్ళకు కనీసం తినడానికి తిండి కూడా సరిగా దొరకడం లేదు కదా...
ఇక్కడైతే ఆలోచించలేదు వాళ్ళకు డబులిస్తే వాళ్ళు నాకేం ఇస్తారు రిటర్న్ అని...
ఇప్పుడైతే అనుకొంటాను వాళ్ళు ఆశీర్వదిస్తారు అనే కారణం వల్ల వాళ్ళకు డబ్బులిస్తానేమో వాళ్ళకు
అలా ఆలోచిస్తే వచ్చిన పోస్టే   సంస్కారవంతమైన దీపావళి
అందులో ఆ రకంగా ప్రార్ధించాను.....

ఇలా గా నా ప్రేమ శాతాన్ని  48 నుండి 49 కి పెంచుకున్నాను.....నేను మంచి బాలుడినే కదా

కాని ఆ చిన్న సంఘటన నా లో కూడా ప్రేమ ఉందన్న సంగతిని తట్టి లేపింది....

అందుకేనేమో కనీసం మంచి గా  ఆలోచించే శక్తి నాకు వచ్చి ఉంటుందేమో ?

ప్రేమ అనేది ప్రతి మనిషి లో ఉంటుందనేది నా నమ్మకం...

అంటే నాలో కూడా ఉంటుంది...ఉంది ..

కాని దాన్ని నా శరీరాన్ని పెంచి పోషించినట్లు, నా లో ఉన్న  ప్రేమను పోషించడం లేదు...


మరి ప్రేమను పోషించడం ఎలా?

ప్రేమను పెంచుకోవడం ఎలా?

స్వార్ధం అంటే కలుపు మొక్క లాంటిది ...

అది ఎలాగైనా పెరిగిపోతుంది...

కాని ప్రేమ మనం పెంచుకొనే మొక్క...

దానికి ఏమి కావాలి?ఎలా పెరుగుతుంది?

దానికి ఏమైనా పద్ధతి ఉందా?

మీకు తెలిస్తే నాకు చెప్పడానికేం మొహమాట పడకండి...

ఎందుకంటే నేను ఇక్కడ మీ అమూల్యమైన అభిప్రాయాల కోసం ....నాలో ప్రేమ శాతాన్ని పెంచుకోవడం కోసం

ఎదురు చూస్తున్నాను...READMORE


4 comments:

  1. ప్రేమను శాతాల్లో కూడా కొలుస్తారా?

    ReplyDelete
  2. Anonymous గారు !మనలో ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలి కదండీ...!

    ReplyDelete
  3. ఇపుడు మీరు చెప్పిన నాన్నగారి చిల్లర దానం వంటి వాటి లాగే సమాజంలో ప్రేమని పంచే ప్రతి సందర్భాన్ని స్వీకరించండి. కొత్తగా, చిన్న వారు, లేదా చిన్న పిల్లల ప్రయోగాలను, ప్రయత్నాలను అభినందించదం ద్వారా మనలో ప్రేమ శాతాన్ని పెంచుకోవచ్చు.

    మీరు క్రితం పోస్టు లింకు ఇచ్చినట్లుగానే పాత పోస్టులలో ఈ సిరీస్ కు సంబంధించి తరువాతి పోస్టు అనే లింక్ కూడా ఇవ్వండి. కొత్త పోస్టుకు తప్ప మిగతా వాటికి కొంచెం శ్రమపడి ఆ విధంగా చేయగలరు. తీరిక ఉన్నప్పుడు వరుసగా చదువుదామనుకునేవారికు ఉపయోగపడుతుంది.

    ReplyDelete
  4. కొండల రావు గారు!మీ సూచన బాగుంది ,ఒక పద్ధతి గా చువుకోవడానికి అందరికి ఉపయోగ పడే లాగ ఉన్నదండి...ధన్యవాదములు,READMORE అనే లింక్ ద్వారా తర్వాతి పోస్ట్ కి లింక్ ఇవ్వడం జరిగింది...

    ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..