ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Wednesday, December 3

ప్రేమ శాతం-బూరె చెప్పిన సత్యం


 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

link to పోస్ట్ 1                       link to  పోస్ట్ 2


                    ఒక రోజు మా అత్త వాళ్ళింటి వద్దకు నేను మా స్నేహితుడితొ కలిసి ఆడుకోవడానికి వెళ్ళాను...
ఆరు బయట ఆడుకొంటుంటే ...ఆ రోజు మా అత్తయ్య నన్ను మాత్రమే లోపలికి పిలిచి బూరె ను ఇంటి లోపలే తినిపించింది....నా స్నేహితున్ని పిలుద్దాం అంటే ,వద్దు నీకోసం మాత్రమే ఒకటి ఉంచాను....అది ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పింది....నేనేమో ఒక్కటే కదా మా స్నేహితుడికి ఇవ్వలేము కాబట్టి నేనొక్కడినే తినొచ్చు...
అనేసి తిన్నాను....బయటికి వెళ్లి ఏమి జరగనట్టు మా స్నేహితుడితో ఆడుకున్నాను,
మరొక విషయం ఏమిటంటే నాకు అక్కడ ఇంకా బూరెలు కనపడ్డా కాని ,మా అత్త చెప్పిన "ఒకటి మాత్రమే ఉంది"
అనే అబద్దాన్ని నా మనసును మోసం చేసుకొని ఆత్మ సంతృప్తి కలిగించుకొన్నాను,


ఇక్కడ నా మనసును నేనే మోసం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ?
జవాబు:నేను మంచి వాడిని అని నాకు ఒక బ్రాండ్ పెట్టుకొన్నాను....కనుక నేను మా స్నేహితునికి  ఇవ్వకుండా ఆ బూరె ను తిన కూడదు, కానీ తిన్నాను ...అంటే నేను మంచి వాడిని కాను...దాన్ని నేను ఒప్పుకోలేను...ఎందుకంటే పక్కవాళ్ళు నేను మంచివాన్ని కాదంటేనే ఒప్పుకోలేను ?అలాంటిది నన్ను నేను చెడ్డ వాడు అని నన్ను నేను అనుకుంటే ఇంకేమన్నా ఉందా?మరప్పుడు నేను ఎం చెయ్యాలి ?మా స్నేహితునికి ఇవ్వాలని నాకు లేదు?అందుకోసమే పలాయన మార్గాన్ని ఎంచుకొన్నాను...అదేమిటంటే అక్కడ ఒక్క బూరె మాత్రమే ఉన్నది అనే అబద్దాన్ని నేను నమ్మడం ఒక్కటే దారి,అందుకే అబద్దాన్ని నాకు నేను చెప్పుకోవడానికి మా అత్త నాకు హెల్ప్ చేసింది...ఆ రకంగా నా మనసును అంత విజయ వంతంగా మోసం చేసుకొన్నాను ...ఎంతగా మోసం చేసుకున్నాను అంటే ,ఆ తర్వాత నేను నార్మల్ గా మల్లి స్నేహితుడితో అడుకోగాలిగాను...

ఈ రకంగా నాలోని స్వార్ధం 52పెరిగి ప్రేమ  48గా తగ్గిపోయింది...

ఈ పోస్ట్ లో నేను తెలుస్కున్నది  ఏమిటంటే నేను మా స్నేహితున్ని మోసం చేసాను అని అనుకున్నాను...
కాని మా స్నేహితున్ని మోసం చేసే ముందు నన్ను నేను మోసం చేసుకున్నాను...

అందరు (నా లాగ మంచి వాడు అనే ముద్ర వేసుకున్నవాళ్ళు)ఇలా మొదటగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారనుకుంటాను...అలాగా వాళ్ళు ఆత్మ సంతృప్తి లో ఇరుక్కుంటారు!

సాదారణంగా నా లాగే మంచివాడు గా కనబడే వాళ్ళే ఎక్కువగా ఉండి ఉంటారు ?

మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి నాలాగే మీరు మీ మనసుని మోసం చేసుకో కూడదు?

అనేది నా ఈ పోస్ట్ ఉద్దేశ్యం ...ప్రేమ శాతం లో ప్రేమ ఎందుకు తగ్గుతుంది ?అంటే మనం ప్రేమ అంటే ఏమిటో

తెలుసుకోక పోవడమే?అసలు ప్రేమ అంటే ఏమిటి ?లాంటి విషయాలను వచ్చే పోస్ట్ ల లో చర్చిద్దాము....

అంత వరకు ఆత్మ సంతృప్తిలో ఇరుక్కోకండి...ఉంటాను....READ MORE

2 comments:

  1. good one. అత్త ఒక్కటే అలా అని కాదు. మీరు చెప్పిన ఉదాహరణా అంతటా ఉండేదే. ఇది వ్యక్తివాద సమాజం అంతటా అత్యంత సహజం. ఈ అంశం మొత్తం ప్రపంచానికే కీలకమైనది. ఒకే కుటుంబం - ఒకే సమాజం ఏర్పడడమే దీనికి అంతిమ పరిష్కారం. వసుదైకకుటుంబం అసాధ్యాం కాదు కానీ అంత తేలికా కాదు. అసలది కుదరదు కేవలం ఊహాలకే బాగుంటుందనేవాళ్లూ ఉంటారు. బాగుంటున్నాయి మీ పోస్టులు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు అండి Kondala Rao Palla గారు,వసుదైక కుటుంబం అనేది సాధ్యమా అసాధ్యమా కాదు ,వసుదైక కుటుంబం లో ఒక వ్యక్తి గా నేను మారితే నాకు కనిపించే కుటుంబం కచ్చితంగా వసుదైక కుటుంబం....

      Delete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..