ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Tuesday, February 17

ప్రేమశాతం :నిరాడంబరుడిని నేను... నాకు ఆడంబరమెందుకు?

ప్రేమ శాతం:serial part 22
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
శివం అంటే నీలోఉన్న ప్రేమ
మనలోని ప్రేమ శాతం తగ్గుతూ
స్వార్ధమనే విషం పెరిగి ఇక భరించలేని స్థితి కి చేరిన సమయమే....
మనలోని శివుడు విషం తీసుకోవడం...!
అందుకే ఈరోజు మనం మనలోని విషాన్ని తగ్గించుకోవడం కోసం
మనల్ని మనం ఎరుక చేసుకోవాలని జాగరణ చేయడం
కేవలం ఒక్కరోజు తో మనం మనలోని శివత్వాన్ని పెంపొందించుకోలేము
ప్రతి రోజు మనలోని ప్రేమ శాతాన్ని లెక్కించుకోవలసిందే!
మన బిజీ జీవిత గమనంలో కనీసం ఒక్కరోజైన మనల్ని గూర్చి మనం తెలుసుకోవాల్సిందే!
అదే మనం శివునికి చేసే అభిషేకం

శివ తత్వం  మనకి అన్ని ఇచ్చి తను మాత్రం అన్ని వదులుకొని
నిరాడంబరుడిని నేను.... నాకు ఆడంబరమెందుకు? అన్నట్లు
మనం కూడా ఆడంబరాలైనా కోపం స్వార్ధం అసూయ ద్వేషం తొలగించుకుంటే
మనలో కూడా నిరాడంబరం అయిన  ప్రేమ మిగులుతుంది

                                          శివ తత్వం  శివోహం శివం
             ప్రపంచం అంతా శివమయం ,ప్రతి వస్తువు శివమయం,ప్రతి మనిషి శివుడే
                                                                                                                              >>PREVIOUS PART

Saturday, February 14

ప్రేమశాతం -నిజమైన ప్రేమ దేన్ని కోరుకుంటుంది

ప్రేమ శాతం:serial part 21

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
ప్రేమ కోసం వాలెంటైన్ తన ప్రాణాన్నేత్యాగం చేసాడు...
అందుకే ఈ రోజు ప్రేమికుల రోజు,
కాని ప్రేమించబడే వాళ్ళు ప్రేమించిన వారి ప్రాణ త్యాగాన్ని కోరుకోరు?
ప్రాణాల్ని తియ్యాలనుకోరు!
నిజమైన ప్రేమ బయటికి కనపడినా కనపడకపోయినా
ప్రేమ అనేది ఎల్లపుడు ప్రేమించబడే వాళ్లకి అందించబడుతుంది.

అలా అందించబడనప్పుడు అది ప్రేమ కాదు
ప్రేమించడం అంటే ఆ వ్యక్తి ఆనందాన్ని మనం కోరుకోవడం
ప్రేమించడం అంటే మన కోసం చెయ్యడం కాదు ,తన కోసం చెయ్యడం
ప్రేమిస్తే ఆనందం వెయ్యాలి
నిజంగా ప్రేమించిన వాడెవ్వడు బాధపడడు
ఎందుకంటే ప్రేమ ను ఇస్తాడు, తీసుకోవాలనుకోడు
తీసుకోవాలనుకున్నపుడే మనకు బాధ, కోపం ,దుఖం కలుగుతాయి
అందుకోసం ప్రేమించండి...స్వచ్చంగా ..కల్మషం లేకుండా..స్వార్ధం లేకుండా
అమ్మాయి అబ్బాయినే కాదు
అబ్బాయి అమ్మాయినే కాదు
అందరిని... మన చుట్టూ ఉన్న సమాజాన్ని

మనల్ని ద్వేషించే వాళ్ళని ,మనల్ని ప్రేమించే వాళ్ళని...!
ప్రపంచాన్ని ప్రేమమయం చెయ్యండి
 <<PREVIOUS PART                                                                                    NEXTPART>>

Saturday, February 7

ఆదివారం వచ్చేసిందోచ్

23:01 Posted by srinivas No comments
ఏంటో ప్రతీ సారి ఆదివారం ఆలస్యంగా లేద్దామనుకుంటాను
అదేంటో గాని సరిగ్గా 6 గంటలకే మెలకువ వస్తుంది
మరేమో వీక్ డేస్ లో అయితే ఎంచక్కా 7-30am వరకు గాని బలవంతంగా మంచం దిగని నేను
8-00am వరకు రెడీ అవ్వాలి కదా!
కనీసం ఆదివారం అయినా హాయిగా నిద్రా దేవితో పడుకుందాం అనుకుంటే
ఏంటో ఆదివారం ఆది లోనే ఇలా జరిగిపోతుంది...!
----
చిన్నప్పుడు ఆదివారం వచ్చిందంటే
ఇంట్లో వాళ్ళతో బయట సినిమాకో షికారుకో తిరగాలి అనిపించేది
కాని ఇప్పుడు అది రోటీన్ గా అయిపొయింది
అందుకే ఎదేమైనా ఆదివారం పూర్తి సెలవు గా ప్రకటించుకోవాలని అంటే
(అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పూర్తిగా ఇంట్లోనే పూర్తి సమయం  కేటాయించడం )

అలా కుదరదు
ఈ ఫ్రెండ్స్ ఉన్నారే ..!ఎదో ఒక ప్రోగ్రాం పెట్టేస్తారు ...!
అలా ఆదివారాన్ని కూడా బిజీ చేసేస్తారు..!
చిన్నప్పటికి ఇప్పటికి ఎంత మార్పు?
---
ఆదివారం అంటే 24 గంటలు కాదు 12గంటలు మాత్రమే!
ఎందుకంటే అంత త్వరగా సోమవారం వచ్చేస్తుంది మరి...!
మొదటి 12గంటలు చాలా వేగంగా గడిచిపోతుంది.ఎలా గడిచి పోయిందో తెలియకుండా
అదేదో మూవీ లో dialogue లో చెప్పినట్టు రావమ్మ మెరుపు తీగ అన్నపుడు
మెరుపు తీగ లా ఒక అమ్మాయి  వచ్చి మాయం అయినట్టు ఆదివారం సమయం  గడిచి పోతుంది
తర్వాత 12గంటలు రేపు సోమవారం అనే దిగులుతో గడిచిపోతుంది
చిన్నప్పటి నుండి అంటే స్కూల్ కి వెళ్ళే సమయం నుండి ఇదే ప్రాసెస్
---
చూసారా ?
అపుడే 12గంటలు అయిపొయింది ...!
ఇంకా మిగిలుంది కేవలం 12 గంటలే!
---
ఎన్నాళ్ళ నుండో పెండింగ్ లో ఉండే పనులు ఆదివారానికి postpone చేస్తుంటాను
అంటే ఇంట్లో పనులు అనుకునేరు ?
laptop లోని desktop పైన పేరుకున్న చెత్త ను తొలగించడాలు ,
అనవసరంగా పెరిగిపోయిన folders,unused files తీసేయ్యడాలు
లాంటివి అన్నమాట అది కూడా ఈ రోజు కుడురుద్దో లేదో ...!
---
అవును కదా ఈ పోస్ట్ రాసే బదులు ఆ పని చేసుకుంటే బాగుంటుంది ...
సరే ఆ పని మొదలు పెడతాను
హ్యాపీ సండే ....

Thursday, February 5

ప్రేమశాతం-నేను నాన్న తో మాట్లాడను

ప్రేమ శాతం:serial part 20
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
మనలో ఉండే ప్రేమ శాతం తగ్గే అంశాలు మనలోన చిన్నప్పటి నుండి ఏర్పడే భావాలు,వాటి పట్ల మన చుట్టూ ఉండే  మనుషుల ప్రతిస్పందనలు కారాణాలు
అందులో  మరో కారణం
నేను చిన్నపుడు ఒకసారి మా నాన్న పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నం చేసాను
అప్పుడు  మా నాన్న గారూ నేను ఇవ్వను ,నువ్వు పుస్తకం చించి పడేస్తావు అని చెప్పారు
నేను చెప్పాను నేను చింపి వెయ్యను ,చూసి ఇస్తాను అని కాని మా నాన్న గారూ వినలేదు

టీవీ పైన ఉండే ఒక పింగాణి బొమ్మను తీసుకోవాలని టీవీ టేబుల్ దగ్గర ఒక కుర్చీ వేసుకొని బొమ్మ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం లో ఆ బొమ్మను పగులగోడతానేమో నని నా పైన అరిచేసారు..

అప్పుడు   కూడా చెప్పాను నేను పగులగొట్టను అని చెప్పినా కాని నన్ను కసురుకొని బొమ్మ ఇవ్వలేదు

అందుకే నేను డిసైడ్ అయ్యాను   నేను నాన్న తో మాట్లాడను అని


అలాగా నేను మాట్లాడకూడదు అని గట్టిగా అనుకొని ఆ రోజు పడుకుండి పోయాను

తెల్లారి లేచిన తర్వాత నేనేం డిసైడ్ అయ్యానో మర్చిపోయాను ,ఎంచక్కా నాన్న గారి తో మాట్లాడుకుంటూ స్కూటర్ పైన  స్కూల్ కి వెళ్ళిపోయాను

కాని నేను ఇక్కడ మర్చిపోలేనిది ఏమిటంటే
 మనకన్నతక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ,చిన్నవాళ్ళు సరిగాపనిచేయ్యలేరు అని,
వాళ్ళు మనపైన ఆధారపడే వాళ్ళుగా ఉంటారని
అసలు వాళ్ళను మనుషుల్ల కూడా చూడడం వేస్ట్ ఏమో అని ,
వాళ్ళు ఏదైనా పనిని ఫెయిల్ చేస్తారు అని
ఎవ్వరిని నమ్మకూడదు అని,
వాళ్ళు మనలాగా సహనం తో పని చెయ్యరు అని
ఇలా అపనమ్మకాన్ని పెంపోదించుకోవడం జరిగింది
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ..
మనల్ని నమ్మే వాళ్ళని మనం ఎలాంటి పరిస్థితుల్లో మోసం చెయ్యకూడదు
ఎక్కడో ఒక msg  చదివాను

If you succeed in cheating some one,
Dont think that the person is a fool....
Realise that the person trusted you so much
more than you deserved...!!
(దీనిని తెలుగు లోకి అనువదించాను కాని ఆ msg లో ఉండే ఫీల్ రాలేదు ..అంటే నా తెలుగు లో భావుకత కొంచెం తక్కువ ...అందుకే ఇంగ్లీష్ లోనే ఇవ్వడం జరిగింది
దయచేసి ఎవరైనా వీక్షకులు ఫీల్ తో కూడిన తెలుగు అనువాదం కామెంట్ చెయ్యగలరు )
అలా ఎదుటి వ్యక్తి ని నమ్మడం అనేది నా అంతరంగం నుండి తొలగించడం జరిగింది
 అలా నాలో ఉన్న ప్రేమశాతం మళ్ళి తగ్గింది  

Sunday, February 1