ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Thursday, February 5

ప్రేమశాతం-నేను నాన్న తో మాట్లాడను

ప్రేమ శాతం:serial part 20
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
మనలో ఉండే ప్రేమ శాతం తగ్గే అంశాలు మనలోన చిన్నప్పటి నుండి ఏర్పడే భావాలు,వాటి పట్ల మన చుట్టూ ఉండే  మనుషుల ప్రతిస్పందనలు కారాణాలు
అందులో  మరో కారణం
నేను చిన్నపుడు ఒకసారి మా నాన్న పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నం చేసాను
అప్పుడు  మా నాన్న గారూ నేను ఇవ్వను ,నువ్వు పుస్తకం చించి పడేస్తావు అని చెప్పారు
నేను చెప్పాను నేను చింపి వెయ్యను ,చూసి ఇస్తాను అని కాని మా నాన్న గారూ వినలేదు

టీవీ పైన ఉండే ఒక పింగాణి బొమ్మను తీసుకోవాలని టీవీ టేబుల్ దగ్గర ఒక కుర్చీ వేసుకొని బొమ్మ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం లో ఆ బొమ్మను పగులగోడతానేమో నని నా పైన అరిచేసారు..

అప్పుడు   కూడా చెప్పాను నేను పగులగొట్టను అని చెప్పినా కాని నన్ను కసురుకొని బొమ్మ ఇవ్వలేదు

అందుకే నేను డిసైడ్ అయ్యాను   నేను నాన్న తో మాట్లాడను అని


అలాగా నేను మాట్లాడకూడదు అని గట్టిగా అనుకొని ఆ రోజు పడుకుండి పోయాను

తెల్లారి లేచిన తర్వాత నేనేం డిసైడ్ అయ్యానో మర్చిపోయాను ,ఎంచక్కా నాన్న గారి తో మాట్లాడుకుంటూ స్కూటర్ పైన  స్కూల్ కి వెళ్ళిపోయాను

కాని నేను ఇక్కడ మర్చిపోలేనిది ఏమిటంటే
 మనకన్నతక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ,చిన్నవాళ్ళు సరిగాపనిచేయ్యలేరు అని,
వాళ్ళు మనపైన ఆధారపడే వాళ్ళుగా ఉంటారని
అసలు వాళ్ళను మనుషుల్ల కూడా చూడడం వేస్ట్ ఏమో అని ,
వాళ్ళు ఏదైనా పనిని ఫెయిల్ చేస్తారు అని
ఎవ్వరిని నమ్మకూడదు అని,
వాళ్ళు మనలాగా సహనం తో పని చెయ్యరు అని
ఇలా అపనమ్మకాన్ని పెంపోదించుకోవడం జరిగింది
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ..
మనల్ని నమ్మే వాళ్ళని మనం ఎలాంటి పరిస్థితుల్లో మోసం చెయ్యకూడదు
ఎక్కడో ఒక msg  చదివాను

If you succeed in cheating some one,
Dont think that the person is a fool....
Realise that the person trusted you so much
more than you deserved...!!
(దీనిని తెలుగు లోకి అనువదించాను కాని ఆ msg లో ఉండే ఫీల్ రాలేదు ..అంటే నా తెలుగు లో భావుకత కొంచెం తక్కువ ...అందుకే ఇంగ్లీష్ లోనే ఇవ్వడం జరిగింది
దయచేసి ఎవరైనా వీక్షకులు ఫీల్ తో కూడిన తెలుగు అనువాదం కామెంట్ చెయ్యగలరు )
అలా ఎదుటి వ్యక్తి ని నమ్మడం అనేది నా అంతరంగం నుండి తొలగించడం జరిగింది
 అలా నాలో ఉన్న ప్రేమశాతం మళ్ళి తగ్గింది  
Reactions:

2 comments:

  1. పోస్ట్ చాలా బాగుంది.మీ సీరియల్ లో మీరు మీ అమ్మానాన్నలను ప్రస్తావిస్తూ రాసే పోస్టులు చదువుతుంటే బాల్యం గుర్తు వచ్చి పెదాలపై మంచి చిరునవ్వు వస్తుంది.మంచి చిరునవ్వు అంటే ప్లాస్టిక్ నవ్వు కాకుండా మనసు నుంచి వచ్చే నవ్వు అని మీకు అర్థమై ఉంటుంది.ఇక మెసేజ్ విషయానికొస్తే దానిని అంత చక్కగా తెలుగు లో అనువదించే నైపుణ్యం నాకు అసలు లేదు.

    ReplyDelete
  2. మహి గారూ ! నేను మీ కామెంట్స్ కి అడిక్ట్ అవుతున్నానేమో అని అనుమానంగా ఉందండి :-)
    మీరు కామెంట్ అప్పుడే పూచిన పువ్వులా (అంటే ప్లాస్టిక్ పువ్వు కాదండి ) చాలా బాగా చేస్తారు..
    ధన్యవాదములు మీ అభినందనలకు

    ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..