ఒకసారి ఏమైందంటే నేను చిన్నపుడు 1వ తరగతి అనుకుంటాను,ఒక బటాని గింజను భూమిలో పెట్టాను ఎందుకో తెలుసా !
అది ఆటన బిళ్ళ (50np) అవుతుందని,
నాకు అపుడే ఎన్ని తెలివితేటలో కదా అని ఇప్పుడు గుర్తు వచ్చి నవ్వు వచ్చింది,అంతే కాదు మా ఇంటిముందు డాంబర్ రోడ్ ఉండేది,బస్సు టైర్స్ పంచర్ చెయ్యాలని రోడ్ వెడల్పు ఇసుక పోసి దాంట్లో ముళ్ళులు పెట్టేవాణ్ణి,
పంచర్ ఎందుకు చేయలనుకునేవాడినో,
సరదా కోసమే అనుకుంటాను,
ఇదొక రకమైన ఆనందమా?
అంటే ఈ ఆలోచన కేవలం నాదేనా ఇంకో స్నేహితునిదా గుర్తులేదు,
కాని అలా చేయడం కర్రెక్టేనా?అపుడు ఇపుడు అలాంటి ఆనందం నాతో పాటు పెరిగి ఉంటుందా?
మరి ఇప్పుడు అలానష్టం కలిగించే పనులు చెయ్యడం లేదే?
అంటే నేను మారిపోయనా?
లేదా మంచివాడిగా నటిస్తున్నానా?
లేదా కవర్ చేస్తూ ఉంటున్నానా?
అసలు నేను ఎవరు?
0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..