ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, September 28

నాకు తెలిసిన నేను:

23:11 Posted by srinivas No comments
అంటే అదే నాకు ఉహ తెలిసినప్పుడు ప్రొద్దున నన్ను లేపడానికి సూర్యుడు చాల తొందరగా ఉదయించేవాడు,అదేంటో నన్ను నేను మర్చిపోయిన లోకం నుండి నేనెంటో తెలిసే లోకం లోకి రావాలంటే చాలా బద్దకంగా ఉండేది.ప్రతిరోజు స్కూల్ కెల్లడం,ఇంటికి రావడం ,బుక్స్ పక్కకు పడెయ్యడం,ఇంటి ముందున్న రోడ్ పైన గ్యాంగ్ తో ఆటలు ఆడడం(రేస్,గిల్లిదండ,టైర్ నడపడం,ముట్టిచుకొనడం,etc)పొద్దు పోయే దాక ఆడి ఆడి అలిసిపోయి ఇంటికోచ్చి తినేసి పడుకోవడం,ఇది స్కూల్ నాస్కూల్ జీవితం రొటీన్,కాని అది రొటీన్ కాదు అని ఇప్పుడు అర్ధమైనది,ఎందుకంటే 

"సీతాకోక చిలుకకు తెలుసునా అది స్వేచ్చగా ఉందని,స్వేచ్చ అంటే ఏమిటో తెలియనపుడు,"
లాంటిదే నా జీవితం 
అని పెరుగుతున్న కొద్ది తెలిసింది!

0 comments:

Post a Comment

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..