నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను...
పైకి మాత్రం అలాగా కనపడను..?
ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ...
అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు
వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తాను వెయిట్ చెయ్యు అని వెళ్ళిపోయాడు
ఫోన్ దాన్ని ఓపెన్ చేసి వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేసిన సంభాషణను చూసి మస్తు గా ఎంజాయ్ చేస్తూ చదవ సాగాను...అలా మొత్తం చదివేసాను...
అప్పుడు వాడి గురించి ఆలోచించాను
వాడి గురించి కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
మా ఫ్రెండ్ ఇంకా రాలేదు
ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు నా గురించి ఆలోచించాను
నా గురించి కూడా కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
అసలు నేను ఎందుకు వాడి అనుమతి లేకుండా ఫోన్ తీసాను?
ఎందుకు ఇంటరెస్టింగ్ గా వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చదివాను?
ఎగ్జైట్మెంట్ గా ఎందుకు ఫీల్ అయ్యాను?అంటే ఒక్కమాటలో శునకానందం ఎందుకు పొందాను?
అంతే కాకుండా వాడి గురించి ఆ రకంగా ఎందుకు అనుకున్నాను?నేనేదో గొప్ప వాడి నైనట్టు?
వాడు చేస్తున్నది తప్పు అయితే వాడిని సరిదిద్దోచ్చుగా అందుకే చదివానా?
అసలు వాడు చేసేది తప్పు అని నాకు ఎలా తెలుస్తది ?
ఈ ప్రపంచం లో ఎవరిదైనా తప్పు అని ఎవరైనా చెప్పగలరా?
కేవలం మనల్ని మనం తప్ప?ఎందుకంటే ప్రతి వారికి ఒక కారణం ఉంటుంది ఒప్పు చేసుకోవడానికి
కాని మన మనసుకు ఒక కారణం చెప్పి ఒప్పించుకొనే ధైర్యం దాన్ని మోసం చేస్తే తప్ప ఉండదు!
ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకోవడం అంటే "మా ఫ్రెండ్ ని తప్పు వాడిని సరిదిద్దాలి అనుకోవడం"
అదే నాది తప్పు అయితే "నేను అసలు వాడి ఫోన్ ను ముట్టడం "
అంటే నాదే తప్పు....
వాడిది తప్పు అయితే వాడు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాడు కదా!
అప్పుడు వాడు అది తప్పో ఒప్పో తెలుసుకోలేనంత ముర్ఖుడేం కాదు గదా!

ఇంతకీ మీ ఫ్రెండ్ చేసిన సంభాషణ ఏంటో మీరు మాతో పంచుకోలేదు ;)
ReplyDeletewelcome to my blog శరత్ గారు....
Deleteఅలాంటి సంభాషణ ఇక్కడ "సెన్సార్"
థాంక్స్ ఫర్ responding