ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Thursday, April 9

bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!

ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను
క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు
దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని
వాడిని అడిగితే వాడు కూడా సేమ్ డైలాగ్..నా ఇగో హర్ట్ అయ్యింది
ఇలాగ కుదరదని బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగితే క్రెడిట్ వోచేర్ ఇచ్చాడు...
ఇప్పుడు cahsier ఇగో హర్ట్ అయ్యింది.

వాడి చేతిలో అవకాశం ఉంది గా

నేను vocher నింపే లోపల వెంటనే లాస్ట్ పర్సన్ cash తీసుకొని క్లోజ్ బోర్డు పెట్టాడు ...
నేను వెళ్లి డిపాజిట్ తిస్కోండి అన్నాను ..
వాడు ఇందాకే చెప్పాను  గా టైం అయిపోయిందని అని మల్లి careless జవాబు
ఇస్తూ వాడి దగ్గర స్టాక్ పెట్టుకొన్న వోచేర్స్ పాస్ చేస్తున్నాడు

నా ఇగో మళ్ళి మళ్ళి hurt అయ్యింది..


బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్దామంటే వాదేక్కడికో లోపల ఆడిటింగ్ లోకి వెళ్లి తగలడ్డాడు

అయిన వాళ్ళ వాలకం చూస్తుంటే మేనేజర్ ని కూడా ఒక ఆడిస్తున్నారు అనుకుంటాను

సరే వెయిట్ చేద్దాం అనుకుంటే సెక్యూరిటీ అక్కడ ఉన్నవాళ్ళందరినీ వేల్లగోడుతున్నారు.
వాళ్ళకి నేను మేనేజర్ తో మాట్లాడాలి అని చెప్పినపుడు
మీరు ఇక్కడ ఉండకూడదు అని
 బ్రాంచ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చెయ్యాలని ఉచిత సలహా ఇచ్చాడు....
ఎంత బలుపు ఈ నా  క్లర్క్ లకు
నాకే ఇలా చేస్తే పాపం పల్లెటూరి జనాలతో ఈ నా సేవకులు ఎలా అడుకుంటారో...?
అంబుడ్స్మన్ కు వీళ్ళ గురించి కంప్లైంట్ చెయ్యాలన్నంత కోపం వచ్చింది..
అయినా వాళ్ళు పట్టించుకుంటారా?
అసలు వీళ్ళు 5 నిమిషాల ముందే క్లోజ్ చెయ్యడం  కర్రెక్టేనా ?
ఎమన్నా అంటే మాకు ఎంత పని ఉందొ తెలుసా ?అంటారు
భూలోకం లో వీళ్ళే పనిచేస్తున్నట్టు?
పనిలేని వాళ్ళు మిగతా వాళ్ళు అనుకుంటారేమో ఈ బ్యాంకు సేవకులు..!
ac లో కూర్చున్నాం అనుకుంటారు మాకెంత టెన్షన్ ఉంటుందో తెలుసా ?అంటారు
మరి ఎండలో పనిచేసే రైతు కన్నా కష్టమా వీళ్ళ పని.!
అసలు వీళ్ళని ఈ పని ఎవడు చెయ్యమన్నాడు?
ఎందుకు ఇక్కడకొచ్చి మా పనులను ఇబ్బంది కలిగిస్తున్నారు?
కష్టమైతే ఇంట్లో కుర్చోవచ్చు గా ,నిజంగా సేవ చెయ్యాలనుకునే చాల మంది కష్టపడే నిరుద్యోగులు లేరా?

మనకు ఇన్ని సార్లు ఇగో హర్ట్ చేసినా నోర్ముసుకొని ఉండాల్సిందేనా?
వీళ్ళని ఏం చెయ్యాలి?
అందరిని ప్రేమించు అని చెప్పే నేను
పని చెయ్యని వాళ్ళని ప్రేమించలేక పోతున్నాను ...
నా ప్రేమ తగ్గింది.!
అయిన ప్రేమించినా ప్రేమించక పోయినా వాళ్ళు అలాగే చేస్తారు


Reactions:

5 comments:

 1. Which bank which branch...chepte andariki helpful ga untadi...lekapote meedi aranya rodhaney...

  ReplyDelete
 2. నేను కూడా ఇలాంటివి చాలా చూశాను. రాయదుర్గం sbh లో గంట క్యూలో నిల్చున్న తర్వాత ఆన్ లైన్ లేదంటారు. ముందే చెప్పరు. ఐనా హైదరాబాద్ నయం...ఊర్లలో చుక్కలు చూపిస్తారు.

  ReplyDelete
  Replies
  1. Avunandi. ..
   Veellu chaala aadukuntaaru janalatho
   Thanks for responding

   Delete
 3. ఇలా మా బ్యాంకు వాళ్లని ఇష్టమొచ్చినట్టు తిట్టడం ఏం బాలేదండీ.దీనికి శిక్షగా రెండు నెలల ముందు వరకు మేం బ్యాంకు కు వచ్చేసరికి జనధన్ అకౌంట్స్ కోసం బ్యాంకు ముందు ఉన్న పెద్ద లైన్ చూసి చచ్చాం రా బాబూ అంటూ మా మనసులో కలిగిన ఫీలింగ్(అసహనం,కోపం ఇంకా రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటి మిశ్రమమైన భావన) మీకు కూడా మీ ఆఫీసులో ఒక గంట సేపు ఎదురవ్వాలని శపించేస్తున్నానంతే.

  ReplyDelete
 4. Hmmmm:-)
  Konchem seva drukpatham undali kadandi

  ReplyDelete

మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..