నేను మొన్న మా మేన కోడలి బర్త్ డే కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ....
అక్కడ గ్రాండ్ గానే బర్త్ డే జరిగింది ... డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు...
చుట్టూ పక్కల జనాలు ,చుట్టాలు...ఫ్రెండ్స్..అందరూ...వచ్చారు ..
బల్లూన్స్...ఫ్లవర్స్ ...స్టేజి ....పిల్లలతోకోలహలం
డాన్స్ ప్రోగ్రామ్స్...etc
గిఫ్ట్స్ తెచ్చారు...చాక్లెట్లు కేకు లు భోజనాలు...
ఒక పండగలా జరిగింది...
కావున అందరూ ఆనందంగా ఉన్నారు...
అసలు టాపిక్ లోకి వస్తే
మరుసటి రోజు నేను ఇంటికి బస్సు లో సాయంత్రం గం||6 రిటర్న్ అయ్యాను....బస్సు ఫెసిలిటీ ఆ వూరికి సరిగా ఉండదు...అపుడే వచ్చింది ఒక బస్సు,అది ఆర్డినరీ బస్సు..సరే అని ఎక్కేసాను
ఆ బస్సు ప్రతి ఊరి వద్ద ఆగుతూ ఎండలో,కిక్కిరిసి పోయి చెమట వాసనలతో నాకు చిరాకు తెప్పిస్తోంది
అంతలోనే ఒక యువకుడు బస్సు లోకి ఎక్కాడు...ఆ క్షణం లోనే నా పక్కనే సీట్ లో ఉన్న ఆయన లేచి వెళ్ళాడు ...ఆ యువకుడు వెంటనే వచ్చి నా ప్రక్కనే కూర్చున్నాడు..నాకు అతను నచ్చలేదు..ఏంటో నాకు జనాలు చూడగానే నచ్చాలి... అపుడు మాత్రమే నేను వాళ్ళతోనే ఫ్రెండ్లీ గా ఉండగలుగుతాను... అతని చేతిలో ఒక కవర్ ప్యాకెట్ ఉంది...
నాకేమో కొత్త వారితో సరిగా మాట్లాడాలనిపించదు.....నేను అడగకుండానే మాట్లాడుతూ ఉన్నాడు...
అతని చేతిలో ఉన్న ప్యాకెట్ లో రూ||150 విలువగల కేకు ఉందని,చాకొలేట్సు ఉన్నాయని ... ఆ రోజు తన కూతురి పుట్టిన రోజు అని ...వెళ్లిన తర్వాత నా కూతురు చాల సంతోసిస్తుందని చెప్పాడు ,అప్పుడు నేను తన ముఖం లో వెలిగే చాలా ఆనందాన్ని కనుగొన్నాను.ఏదైతే నేను ఇప్పటివరకు ఏ బర్త్ డే లో కనుగోనలేదో?
కూలి పనులు అవి చేస్తాడంట మాట్లాడుతూ తెలుసుకున్నాను...తనకు ఆ రోజు కూలి రూ||300... దాంట్లో సగం ఖర్చు పెట్టగలిగాడు.ఇంతలో అతని వూరు వచ్చింది దిగి వెళ్ళిపోయాడు.ఇప్పుడు తను నచ్చాడు...ఎందుకు నచ్చాడో తెలియదు .కాని నచ్చాడు..ఒక మనిషి కి ఆహార్యం చూసి విలువ ఇవ్వకూడదు అని ఎవరో చెంపమీద కొట్టినట్టు అనిపించింది
ఇప్పుడు నాకు బస్సులో ఎండ,చెమట వాసనలు ...తెలియడం లేదు...ఆ కిక్కిరిసిన బస్సు అందంగా కనబడుతుంది
అప్పుడు అనిపించింది ఆనందం కనిపిస్తే ఆనందాన్ని అడగాలని
ఆనందమా నీ వెల ఎంతా? అని
150 రూపాయలా ?లేదా అంతకన్నా ఎక్కువా?

0 comments:
Post a Comment
మీరు సభ్యత తో కూడిన కామెంట్స్ మాత్రమే పెట్టగలరు ,దయ చేసి notify me టిక్ చెయ్యండి,వర్డ్ వెరిఫికేషన్ ఆఫ్ చేసాను మీకు ఇబ్బంది కలిగిస్తే దయచేసి తెలుపగలరు..